.
కేంద్ర ప్రభుత్వానికి తన అవసరం ఉంది కాబట్టి, మోడీ మెడలు వంచి… కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూ… అదే కేంద్రాన్నే ముందుపెట్టి… బనకచర్ల ఏటీఎం ప్రాజెక్టును సుసాధ్యం చేసుకోవాలని చంద్రబాబు ప్రెజర్ టాక్టిక్స్ స్టార్ట్ చేశాడని చెప్పుకున్నాం కదా…
ఏపీ గోదావరి జలకుట్రలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నిరకాల చెక్స్ పెడుతుందో కూడా చెప్పుకున్నాం… తాజాగా అప్‌డేట్ ఏమిటంటే..? కేంద్ర -బాబుకు, అదేనండీ, కేంద్రానికీ, చంద్రబాబుకూ జాయింట్‌గా షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం…
Ads
సాగునీటి ఎజెండా పేరిట ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఏర్పాటు చేసి, ఏదోలాగా తెలంగాణ ప్రభుత్వాన్ని బనకచర్లకు అనుకూలంగా కమిట్ చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది కదా… సో, బనకచర్లపై మాట్లాడేదేమీ లేదనీ, ఒకవేళ అదే ఎజెండా అయితే ఆ చర్చలు మాకక్కరలేవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి, ఆ ఎజెండాను తిరస్కరించింది…
ఈమేరకు కేంద్రానికి తాజా లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం… ఇది కేంద్ర- బాబు ఊహించలేదు, ఇక తదుపరి ఏం టాక్టిక్స్ ప్లే చేస్తాడో చూడాల్సి ఉంది… నిజానికి ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు జరిగే తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ… అంటేనే అర్థమవుతోంది కదా చంద్రబాబు ఎత్తుగడ…
ఇప్పటికే కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే ఎజెండాను పంపించింది తెలంగాణ ప్రభుత్వం… అంటే ఓ విస్త్రృతమైన ఎజెండా…
కానీ ఏపీ కేవలం బనకచర్ల ఎజెండానే ప్రతిపాదిస్తుండటంతో ఇక… దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయాన్నే కేంద్రానికి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం… రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో స్పష్టం చేసింది…
జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో మళ్లీ ప్రస్తావించారు… అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని ఉటంకించారు…
అంతేకాదు… గోదావరి– బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తూ… ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది… ఇప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల కుట్ర ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా, ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇవ్వకుండా… సరైన అడుగులే వేస్తోంది…
Share this Article