‘ప్లీజ్, మా దేశానికి రండి, పర్యాటకం లేనిదే మా దేశం లేదు, మీరు రాకపోతే దివాలా తీస్తాం, మన దేశాల నడుమ బంధం చరిత్రాత్మకం, శాంతి-స్నేహాన్ని కోరుకుంటున్నాం’…. ఇలా మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం తాజాగా మీడియా ద్వారా మొత్తుకుంటున్నాడు…
ఈ దొంగ మాటల్ని ఇండియా నుంచి వెళ్లాలనుకునే టూరిస్టులు పట్టించుకోవాల్సిన పనిలేదు, అసలు అక్కడికి వెళ్లాల్సిన పనే లేదు… కడుపులో కత్తులు పెట్టుకున్న ప్రభుత్వ ముఖ్యులు అక్కడ… ఒకవైపు చైనాకు తొత్తుగా మారి, అపారమైన సముద్రజలాల్లో ఇండియాకు చెక్ పెడుతోంది… మన ఛాపర్లు వాసప్, మన సైనికులు వాపస్… ఇన్నేళ్లుగా ఆ దేశానికి మనం చేసిన వేల కోట్ల సాయమూ వేస్ట్… పర్యాటకం పేరిట దాన్ని నిలబెట్టిందీ వేస్ట్… ఒకనాడు అవసరమొచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రత్యేక విమానాల్ని పంపించి కుట్రల్ని బ్రేక్ చేసిందీ వేస్ట్…
నియ్యత్ లేని దేశం అది… నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు… ఇప్పుడు అవసరం కోసం ఏవో చిలక పలుకులు పలుకుతున్నాడు ఆ మంత్రి… కానీ అది మారలేదు, మారదు… మరీ ధర్మదాతల్లా ఉండాల్సిన అవసరం లేదు… అపాత్రదానం, అపాత్ర ఔదార్యం ఏమాత్రం మంచివి కావు అని మనకు ఎప్పటికప్పుడు మాల్దీవులు నేర్పిస్తూనే ఉంది…
Ads
మోడీ లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చుని… దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిద్దాం అని పిలుపునిచ్చాడు… మాల్దీవుల తోక కత్తిరిద్దామనేదే ఆలోచన… అన్నీ ఆలోచించుకున్నాకే వేసిన అడుగు అది… ఆ తరువాత ఏమైంది..? భారతీయ పర్యాటకులు అవాయిడ్ చేయడం మొదలెట్టారు… ఎవడైనా సెలబ్రిటీ అక్కడికి వెళ్లి ఫోటోలు పెడితే భారీ ట్రోలింగ్ మొదలైంది… ఈ దెబ్బకు ఒకప్పుడు టాప్ ప్లేసులో ఉండే భారత పర్యాటకుల సంఖ్య ఇప్పుడు ఆరో ప్లేసుకు వెళ్లిపోయింది…
ఐనా జనం ఇంకా వెళ్తూనే ఉన్నారు… రాబోయే రోజుల్లో మాల్దీవులకు వెళ్లే సెలబ్రిటీ టూరిస్టుల మీద సోషల్ మీడియా ట్రోల్ దాడి ఇంకా ఉండబోతోంది… మాల్దీవులకు పర్యాటక యాత్రల్ని ఆర్గనైజ్ చేసే ఏజెన్సీలపైనా కన్ను ఉండబోతోంది… ఈ స్థితిలోనూ మాల్దీవులు చైనాను బతిమిలాడుతోంది… చైనా కూడా ఉదారంగా ‘ఆర్గనైజ్డ్ టూరిస్టుల’ను పంపిస్తోంది… అవసరమైన ఆర్థికసాయం చేస్తోంది… ఎందుకంటే..?
దానికి ఆ సముద్రజలాల మధ్యన ఓ అడ్డా కావాలి… ఇన్నాళ్ల ఇండియా పట్టును అది బ్రేక్ చేయాలి… అదీ దాని ప్లాన్… అందులో మాల్దీవులు ఓ పావు… ఈరోజుకూ మాల్దీవుల ముఖ్య నేతలు చైనాకు పర్యటనలు చేస్తూ రాచమర్యాదలు పొందుతున్నారు… భారత వ్యతిరేకత ఏమీ తగ్గలేదు ఆ ప్రభుత్వంలో…
సో, ఇప్పుడు ఆ నప్పతట్ల మాటలకు, అంటే నంగి మాటలకు పడిపోవాల్సిన పనేమీ లేదు… తిప్పితిప్పికొడితే మల్కాజిగిరి జనాభా ఉండదు అక్కడ… ఐతేనేం, మనకు అపారమైన సముద్రజలాల్లో, కీలకమైన ప్రపంచ ఆర్థిక జలరవాణా మార్గాల్లో అదొక ఎర్రజెండా…!! అయ్యో, అయ్యో, ఆ దేశం భ్రష్టుపట్టిపోతుంది కదా అంటారా..? అది వాడి ఖర్మ… కర్మానుసారమే ఫలితం..!!
Share this Article