ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి ఓ సెన్సేషన్ కదా… అసలు ఏమిట్లు..? కోమట్లా..? శెట్టి అని ఉందిగా… అనుష్క శెట్టి, యూత్‌కా తాజా దడకన్ కృతి శెట్టి, చార్లి రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి… కన్నడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా వేళ్లు వ్యాపించిన ఈ శెట్టిల్లో ఎవరూ కోమట్లు కారు… శెట్టి మాత్రమే కాదు, హెగ్డే, రాయ్ ఇంటి పేర్లు కూడా ఉండే ఈ కులం పేరు బంట్… మంగళూరు ప్రాంతంలో, తుళు పరంపర వాళ్లది… వాళ్ల భాష కూడా తుళు… ఐశ్వర్య రాయ్, పూజా హెగ్డే కూడా సేమ్…
నిజానికి బంట్ అంటే యోధ అని అర్థం… వాళ్లది పోరాటకులమే… భూస్వాములు… ప్రస్తుతం కర్నాటకలో బీసీలు, కేంద్ర ఓబీసీ జాబితాలో మాత్రం లేరు… స్థూలంగా పరికిస్తే వాళ్లు అగ్రవర్ణుల్లాగే వ్యవహరిస్తారు… కానీ ఎగువ శూద్రులు… ఇప్పుడు ఈ కులం గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే… వీళ్లలో 10 శాతం బ్రాహ్మణ్యంలో బతుకుతారు… మరో 10 శాతం జైనులు… మిగతావాళ్లు హైందవులు… కానీ మరణించిన తమ పూర్వీకులు ఆత్మల్లాగా (భూతాలు) తిరుగుతూ ఉంటారని, ఓ నిర్ణీత జానపద నృత్యంతో ఆరాధిస్తే వచ్చి, ఆవహిస్తారని నమ్ముతారు… యక్షగానాల్లో ఒకటైన భూతకళ అదే… కాంతారా సినిమాలో కీలకమైన క్లైమాక్స్ కూడా అదే… (అది ఎలా అనేది చెప్పదలుచుకోలేదు….)
బీభత్స, భయానక, రౌద్ర రసాలను అభినయించడం కష్టం… అందుకే ఈ గ్రామీణ కళాకారులు కనుమరుగయ్యారు… ఈ భూత కళ వంటివి కొన్ని వార్షిక ఉత్సవాల్లో తప్ప రోజువారీ ప్రదర్శించరు… ఓసారి ఎప్పుడో అనుష్కను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఈ ప్రశ్న వేస్తే… ఆమె ఎంత హంబుల్ జవాబు చెప్పిందంటే… ‘‘మా బంట్ కులస్థులు అందంగానే ఉంటారు, కానీ కూర్గ్ ఏరియాలో ఉండేవాళ్లు ఇంకా బాగుంటారు… నాకన్నా నా చుట్టాలందరూ బాగుంటారు… నిజానికి మెరిట్, లుక్, అందం విషయాల్లో మలయాళీలను బీట్ చేయడం కష్టం…’’ వీసమెత్తు స్వీయపొగడ్త లేదు…
Ads
ఇవన్నీ సరే, జూనియర్ ఎన్టీయార్ మావాడే… అందుకే కాస్త ప్రాంతీయాభిమానం ఉంటుంది నాకు అంటున్నాడు రిషబ్ శెట్టి…. అదెలా..? జూనియర్ తల్లి పేరు శాలిని… ఆమె పుట్టింది మంగుళూరు నుంచి ఉడుపి మీదుగా భత్కళ్ వైపు వెళ్లే రోడ్డులో ఉండే కుందపుర అనే చిన్న పట్టణం… సేమ్, ఈ శెట్టిలు ఎక్కువగా ఉండే ఏరియా… కానీ ఆమె బ్రాహ్మిణ్… ఎర్లీ ఏజ్‌లోనే హైదరాబాద్ వచ్చింది… పెద్దగా బయటికి వచ్చేది కాదు… హరికృష్ణ బ్లడ్డు అండ్ బ్రీడు ఆమెను ఫోకస్‌లోకి రానిచ్చేవి కావు… జూనియర్ బాగా ఎదిగాక ఆమె ‘కనిపించింది’…
ఆ కుందపురకు చెందినవాడే రిషబ్ శెట్టి కూడా… సో, ఎన్టీయార్ తల్లి, రిషబ్ శెట్టి ఒకే ఊరు… అదీ తన అభిమానం… అంతే మరి… బంధాలు ఎక్కడి నుంచి ఎటెటో కలుస్తూనే ఉంటాయి… ఇంతకీ జూనియర్ కాంతారా మూవీ చూశాడా..? తెలుగులో ఆ పాత్ర చేయగల దమ్ము, మెరిట్ ఉన్న ఏకైక హీరో తను… సరైన దర్శకుడు దొరికితే… వంశ కీర్తనలకు కథను దూరంగా ఉంచితే… కానీ ఏం ఫాయిదా..? రేపు తెలుగులో ఆ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేసేస్తున్నాడుగా….!!
Share this Article