.
కౌన్ బనేగా కరోడ్‌పతి… బుల్లితెర మీద ఓ యూనిక్ రియాలిటీ షో… దీన్ని కొట్టగలిగిన షో మరొకటి లేదు… సేమ్, అమితాబ్ బచ్చన్ ఓ యూనిక్ హోస్ట్… 25 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతీ అంటే జస్ట్, ఎ అమితాబ్ గ్రేట్ షో… ఇది Who Wants To Be a Millionaire ఓ అంతర్జాతీయ ఇంగ్లిషు టీవీ షోకు అనుకరణ…
తనను ఆర్థికంగా నిలబెట్టింది… ప్రతి ఇంటికీ తనను చేరవేసింది… ప్రతి ఇంట్లో సభ్యుడిని చేసింది ఈ షో… 82 ఏళ్ల వయస్సులో కూడా అదే పాతికేళ్ల క్రితం నాటి జోష్… ఒకవైపు సినిమాలు, మరోవైపు అలుపెరగని ఈ టీవీ షో… ధన్యజీవివయ్యా…
Ads
మొదట్లో స్టార్ ప్లస్… తరువాత అనారోగ్యంతో అమితాబ్ మానేస్తే షారూక్ ఖాన్ వచ్చాడు… ప్చ్, ఇలాంటి షోలను హోస్ట్ చేయడం అంత సులభం కాదు… తను మెప్పించలేకపోయాడు… షో సోనీ చేతికి వచ్చింది… మళ్లీ అమితాబ్ వచ్చాడు… 25 ఏళ్లుగా కథ నడుస్తూనే ఉంది…
దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రయత్నిస్తూనే ఉంటారు… వస్తుంటారు, పోతుంటారు… ప్రశ్నలు, జనరల్ నాలెడ్జి… పనిలోపనిగా వేలాది మంది అనేక వృత్తులు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక తత్వాలు, అనేక వయస్సులు… మహా జ్ఞాన సాగరం వంటి సబ్జెక్టు ఈ షో…
వినోదం ప్లస్ విజ్ఞానం… ప్రతి సీజన్‌లోనూ భిన్న రంగాలకు చెందిన గెస్టులు అదనం… కొన్నాళ్లుగా టీవీ, వెబ్ సీరీస్, సినిమాల ప్రమోషన్లు కూడా… చెబుతూ పోతే ఈ షో గురించి ఒడవదు, తెగదు… ఇటీవల 16వ సీజన్ అయిపోయాక ఇక నేను తప్పుకుంటాను అని అమితాబ్ చెప్పాడని, కొత్త హోస్టుగా ఐశ్వర్యారాయ్ లేదా మళ్లీ షారూక్ ఖాన్ రావచ్చునని ఊహాగానాలు… కొందరైతే ఎంఎస్ ధోనీ పేరూ రాసేశారు… ఈ ముగ్గురితోనూ షో నడవదు… ధోనీ అస్సలు కుదరడు…
మర్మగర్భంగా తాను మానేస్తున్నట్టు అమితాబే హింట్ ఇచ్చాడట… కానీ ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరపడింది… వచ్చే సీజన్ కూడా తనే హోస్ట్ చేస్తానని అమితాబ్ క్లారిటీ ఇచ్చాడు 16వ సీజన్ చివరలో… కూల్… ఐనా అమితాబ్ లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ..?!
దీన్నే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా వేర్వేరు పేర్లతో రన్ చేశారు… తెలుగులో స్టార్లు దీన్ని క్లిక్ చేయలేకపోయారు… మొదట నాగార్జున… తరువాత చిరంజీవి… అనేక కారణాలతో ఫ్లాప్… ఆ తరువాత జూనియర్ ఎన్టీయార్… అందుకే చెప్పింది టీవీ షో హోస్ట్ చేయడం ఈజీ కాదని… అన్నట్టు ఇదే అమితాబ్ బిగ్‌బాస్ ఒక సీజన్ హోస్ట్ చేశాడు…
తరువాత సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాడు… ఇక తనదే రాజ్యం… 4 నుంచి 18వ సీజన్ దాకా తనే హోస్ట్… తెలుగులో మొదట్లో జూనియర్ ఎన్టీయార్, బాగానే చేశాడు, కానీ ఒక సీజన్‌తోనే సరిపుచ్చాడు… తరువాత నాని, కష్టమ్మీద ఒక సీజన్ చేసి, చాలు బాబోయ్ అని దండం పెట్టేశాడు… తరువాత ఇక నాగార్జునే ఇప్పటిదాకా…
కన్నడంలో కిచ్చా సుదీప్, తమిళంలో కమలహాసన్, మలయాళంలో మోహన్‌లాల్, బెంగాలీలో మిథున్ చక్రవర్తి, మరాఠీలో మహేశ్ మంజ్రేకర్… తమిళంలో ఇప్పుడు కమలహాసన్ స్థానంలో విజయ్ సేతుపతి… టీవీ రియాలిటీ షో సెలబ్రిటీని జనంలోకి బాగా బలంగా తీసుకెళ్లగలదు… సరిగ్గా హోస్ట్ చేస్తే…
చాట్ షోలు బోలెడు మంది చేశారు… తెలుగులో కూడా… కానీ ఆహా ఓటీటీలో బాలకృష్ణ చేసే అన్‌స్టాపబుల్ సూపర్ హిట్… అన్నట్టు తెలుగు బిగ్‌బాస్ తరువాత సీజన్‌కు హోస్ట్ నాగార్జున బదులు ఇంకెవరో వస్తారని వార్తలు… కానీ, తనే వస్తాడు… కేబీసీ అంటే అమితాబ్, తెలుగు బిగ్‌బాస్ అంటే నాగార్జున… అంతే..!
Share this Article