Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!

June 7, 2025 by M S R

.

ఓ వార్త… రాజకీయాల్లోకి శైలిమ… ఈ డౌటనుమానం ఎందుకొచ్చిందయ్యా అంటే… ఐసీయూలో ఉన్న ఎమ్మెల్యే మాగంటి ఫ్యామిలీకి దన్నుగా నిలుస్తూ, ఆరోగ్య స్థితిని కనుక్కుంటూ, వెండెంబడి కేటీయార్‌కు సమాచారం ఇస్తున్నది అని…

అంతేనా..,? ఆ ఒక్క ఉదాహరణతో ఆమె రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టు సూత్రీకరిస్తారా..? ఏమో.., ఆమె ఈరోజుకూ ఎప్పుడూ మీడియా తెర మీదకు రాలేదు… లైమ్‌లైట్‌లో లేదు… చిన్న ఇంటర్వ్యూ గానీ, వార్తాచిత్రం గానీ కనిపించవు… మరి ఏమిటిది హఠాత్తుగా..?

Ads

కావచ్చు, ఆ కుటుంబానికి కేటీయార్ ఫ్యామిలీతో అటాచ్‌మెంట్ ఉండవచ్చు… ఆపదలో మద్దతుగా ఉండవచ్చు… అంతేనా..? కేటీయార్ క్యాంపులో లక్షల మంది అనుయాయులు, ‘అన్ని పనులూ’ జాగ్రత్తగా చేసిపెట్టేవాళ్లు… వాళ్లెవరూ గాకుండా సాక్షాత్తూ కేటీయార్ భార్యే తెర మీదకు రావడం ఏమిటీ అంటారా..? అది పెద్ద విశేషమేమీ కాదు… దాన్ని వదిలేస్తే…

ఒక ఎమ్మెల్యేను విషమ స్థితి మీద కేసీయార్ చిన్న ఓదార్పు మాట ఏది..? సైలెంటు… అమానుషం కాదా..? నో, నో,  శైలిమ రాజకీయాలు అనేది అబ్సర్డ్… కేసీయార్ ఒప్పుకోడు, సొంత బిడ్డ రాజకీయాల్నే సహించడు, మహిళల రాజకీయాల్ని, అందులోనూ సొంత కుటుంబ మహిళల రాజకీయాల్నే ఒప్పుకోడు, స్వయంగా తన కోడలి రాజకీయ ఆకాంక్షల్ని సహిస్తాడా అంటారా..?

సరే, కావచ్చు, ఒక ఫ్యూడల్ ఆలోచన విధానమే అయిఉండవచ్చు… కానీ కుటుంబ పార్టీల్లో ఇదేమైనా విశేషమా..? ఏమో, కేటీయార్, కేసీయార్ గనుక జైళ్లకు వెళ్తే స్థితి ఉంటే… ఎందుకైనా మంచిదని శైలిమను ట్యూన్ చేస్తున్నారేమో… అదే సదరు వార్త రాసిన రిపోర్టర్ సందేహం… పరోక్షంగా…

కవిత మీద ఆల్రెడీ కేసు ఉంది, తండ్రిని ధిక్కరిస్తోంది, మగవారసత్వం ఏమిటి ఈ రోజుల్లో కూడా, నాకేం తక్కువ, నేనెందుకు అనర్హురాలిని అని ప్రశ్నిస్తోంది… కేసీయార్‌కు ఈ ధిక్కారాలు నచ్చవు కదా, దూరం పెట్టేశాడు… ఎవడైనా పార్టీవాడు కవితతో కనిపించాడా వాడి పని మూడినట్టే అనే ఇన్‌డైరెక్ట్ సంకేతాలు వ్యాపించాయి… సరే…

సంతోష్ బేసిక్‌గా ఓ పొలిటిషియన్ కాదు… ఫాఫం, ఓ హరిత ప్రేమికుడు, నాలుగు పిట్టలు, నాలుగు మొక్కల ఫోటోలతో సంతృప్తి చెందే అల్పసంతోషి… కేసీయార్ ఆరోగ్య పరిరక్షకుడు, టైమ్‌కు నాలుగు మందు గోళీలు ఇచ్చేవాడు…

ఇక ఉన్నది హరీష్ రావు, తను సొంత కుటుంబం కాదు కదా… కేటీయార్, శైలిమ, కవితలతో పోలిస్తే పరాయివాడే కదా… ఇప్పటికి నాలుగైదుసార్లు దూరం పెట్టినా సరే, వేరే దిక్కులేదు గనుక కేసీయారే తన బాస్… తప్పదు… (ఓ టైమ్ వచ్చేదాకా)…

సో, శైలిమను అందుకే ముందుచూపుతో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా..? ఎహె, ఇదంతా నాన్సెన్స్, ఇదేమైనా ఆర్జీడీ పార్టీయా..? ఒకరు కాకపోతే మరో కుటుంబసభ్యుడు రెడీగా పార్టీ పగ్గాలు పట్టుకోవడానికి అంటారా..? అసలు ఆలూ లేదు, చూలూ లేదు…. ఎవరూ అరెస్టు కారు, రేవంత్‌ ఎవరినీ జైలులో పెట్టడు… శైలిమకు రాజకీయాల్లోకి వచ్చేంత అవసరమూ రాదు… అదేనా మీ అంచనా..?

కావచ్చు… తనను జైలులో పెట్టారు కాబట్టి టైమ్ వచ్చింది కాబట్టి ఆ కుటుంబాన్ని జైలుపాలు చేయాల్సిందనే అనే కసితో ఉన్నాడా రేవంత్..? అదే పెద్ద డౌట్… ఫార్ములా-ఈ అక్రమాలపై గవర్నర్ పర్మిషన్ ఇచ్చినా సరే తన జోలికి పోలేదు కదా… కేసీయార్‌కు సానుభూతి వస్తుందేమోనని అసలే తన జోలికి పోడు… మరిక శైలిమ పొలిటికల్ ఎంట్రీ అవసరమేమిటి..?

మార్క్ వన్ నోట్… కేసీయార్ తన వారసుడిగా అంగీకరించేది కేటీయార్‌ను మాత్రమే, తప్పితే హిమాంశును మాత్రమే… నెవ్వర్, ఇంకెవరినీ తను అంగీకరించడు… కోడళ్లు, బిడ్డలు రాజకీయాలు, పెత్తనాలు చేస్తానంటే అస్సలు సహించడు… అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions