.
ఆహా… ట్రంపుకి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంతో ప్రపంచమంతా చప్పట్లు చరిచింది… బహుశా వైట్ హౌజులో కూడా సౌండ్ రాకుండా కొట్టి ఉంటారు చప్పట్లు…
చాన్నాళ్ల తరువాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా జోకులు, మీమ్స్, సెటైర్లు, రీల్స్, షార్ట్స్, వెటకారాలతో నవ్వులు పండించింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే… నోబెల్ తిరస్కరణ, ఈ సోషల్ మీడియాా స్పందన ట్రంపు పట్ల పేద్ద అభిశంసన… విశ్వవ్యాప్తంగా ఓ అగ్రదేశ అధ్యక్షుడు పెద్ద లాఫింగ్ స్టాక్… షేమ్ షేమ్…
Ads
దొంగచాటుగా వెళ్లి ఆ నోబెల్ ఎత్తుకువచ్చే టాస్క్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వికి అప్పగించాడనే సెటైర్ సూపర్… (ఆసియా కప్ తన చేతుల నుంచి ఇండియా జట్టు తీసుకోకపోతే, తన హోటల్‌కు ఎత్తుకుపోయాడు కదా… దాని స్పూర్తి…)… అర్జెంటుగా నార్వే మీద 500 శాతం పెనాల్టీ టారిఫ్ విధిస్తున్నట్టు మరో జోక్ కూడా…
(నోబెల్ శాంతి బహుమతిని నార్వేలోని ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఈ బహుమతి విజేతను నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుంది, ఈ కమిటీని నార్వే పార్లమెంట్ (స్టోర్టింగ్) నియమిస్తుంది)
బాగా నవ్వించిన మరో ఆప్ట్ పోలిక… అత్తారింటికి దారేది సినిమాలో బద్దం భాస్కర్ పాత్ర… బ్రహ్మానందం పోషించాడు… నదియా ఇంటి నుంచి రెండు లక్షల కొట్టేసి, ఏదో దేశం పారిపోయి, అక్కడ తనకు లక్కీగా వజ్రాల గని దొరికితే… వేల కోట్లు సంపాదిస్తాడు భాస్కర్…
తనకేమో సినిమా పిచ్చి… గ్లాడియేటర్ తరహాలో రేడియేటర్ అని ఓ సినిమా తీస్తాడు హాలీవుడ్ టైపులో… హీరో, దర్శకుడు మాత్రమే కాదు, హీరోయిన్ పాత్ర కూడా తనే… ఆస్కార్ వాడు ఛీపోరా అంటే, తనే సొంతంగా భాస్కర్ అవార్డుల కమిటీా ఏర్పాటు చేసి, తనే ఇచ్చుకుంటాడు ఆ అవార్డులు… త్రివిక్రమ్ అల్టిమేట్ సృష్టి ఆ పాత్ర…
అచ్చం అలాగే 2022లో ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు తనకు వ్యతిరేకంగా మారాయని కోపంతో ట్రంపు సొంతంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు అని ఓ సంస్థ అర్జెంటుగా స్టార్ట్ చేసి, ట్రుత్ సోషల్ పేరుతో ఓ ప్రైవేటు సోషల్ మీడియా ప్రారంభించాడు… అఫ్‌కోర్స్, ఇతర సోషల్ మీడియాలతో పోలిస్తే దాని మార్కెెట్ షేర్ జస్ట్ 2 నుంచి 3 శాతం… అంతే… ఎవడూ దేకలేదు…
సో, ఇప్పుడు ఎంత మొత్తుకున్నా, ఏడెనిమిది యుద్ధాల్ని ఆపినట్టు ఎంత ప్రచారం చేసుకున్నా, తనకు నోబెల్ ఇవ్వకపోతే అమెరికానే అవమానించినట్టు అని వక్రబాష్యాలకూ దిగినా నోబెల్ జ్యూరీ ఛీపోవోయ్ అని చీదరించుకుంది… మాకంటూ కొన్ని విలువలున్నయ్ అని కుండబద్ధలు కొట్టేసింది…
ఇక ఇప్పుడు ట్రంపుకు మనశ్శాంతి కావాలంటే… తన సపరేట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలాగే… లేదా భాస్కర్ అవార్డుల్లాగే… అర్జెంటుగా నోబెల్ అని స్పురించేలా… ఓ అనుకరణ అవార్డులను నోబుల్ పేరుతో ప్రారంభించి.., ఫస్ట్ అవార్డు తనంతట తనే తనకే ఇచ్చుకోవడం… లేదంటే తన జాన్ జిగ్రీ దోస్త్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ద్వారా ఇలాంటి అవార్డుల సంస్థను అర్జెంటుగా సృష్టింపజేసి, తనకు ప్రకటింపచేసుకోవడం..!!
Share this Article