ఆశ్చర్యం కలిగింది… నిజమేనా..? ఇలాంటి పత్రికలు కూడా ఉన్నాయా..? అసలు నేను చదివింది నిజమేనా..? పద్మ అవార్డుల వార్త లేకుండా వచ్చిందా ఓ పత్రిక..? అసలు అది పత్రికేనా..? పత్రిక అనాలా..? పైగా మెయిన్ స్ట్రీమ్ పత్రిక అట… ఈ డౌట్లతో సూర్య అనే పత్రిక ఈ-పేపర్లు ఓపెన్ చేసి చూస్తే… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని వేర్వేరు ఎడిషన్లున్నయ్… నిజానికి వేర్వేరు ఎడిషన్లు, సేమ్ వార్తలు… సేమ్ పేజీలు, ఏమీ తేడా లేదు… జాగ్రత్తగా ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ దాకా చూస్తే… నిజమే, పద్మ అవార్డుల వార్తే కనిపించలేదు… వారెవ్వా… ఏం పత్రిక..?
పద్మ పురస్కారాల వార్తను దేశంలోని ప్రతి పత్రిక, ప్రతి టీవీ హైలైట్ చేసింది… వివిధ రంగాల్లో ఆయా వ్యక్తులు చేసిన కృషికి గుర్తింపు అది… ఈ పురస్కారాల ప్రకటన సందర్భంగానైనా వాళ్ల కృషిని (రాజకీయ నాయకులు, వేక్సిన్ వ్యాపారులు గాకుండా…) గుర్తుచేసుకునే సందర్భం… ఈ అవార్డులకు సంబంధించి ఎన్ని వివాదాలున్నా సరే… వాటి విలువ వాటిదే… వాటి కోసం జీవితాంతం కలగనే కళాకారులు వేలాదిమంది… మరి అది ఆ పత్రికకు వార్తే ఎలా గాకుండా పోయింది..? మణిపూర్ రాజకీయాలకు ఒక పేజీ స్పేస్ ఉంటుంది, కానీ పద్మ అవార్డులకు సింగిల్ కాలమ్ దొరకలేదు… ప్చ్… దీన్నేమనాలి..?
Ads
అంటే అన్నామంటారు… మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ అంటారు… తీరా చూస్తే అనేకచోట్ల కేవలం వాట్సప్ ఎడిషన్లు, ఫ్రాంచైజీ అప్పగింతలు… ఎవరిష్టం వాళ్లు… ఏమైనా రాసుకోవచ్చు… తీరా మెయిన్ పేజీ చూస్తేనేమో ఇదీ పరిస్థితి… అసలు వార్తల జడ్జిమెంట్, అంటే ప్రయారిటీస్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు… ఏది హైలైట్ చేయాలి, ఏది అండర్ ప్లే చేయాలి, దేనికి అడిషనల్ వాల్యూ జతచేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి..? ఇవన్నీ ఆయా మీడియా తీసుకునే పొలిటికల్ ప్లస్ ఎడిటోరియల్ లైన్ ఆధారంగా ఉంటయ్… అంతేతప్ప ఇలాంటి వార్తల్ని పూర్తిగా తీసేసి చెత్తబుట్టలో పడేయరు… ఏమోలెండి… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది… జాలిగా, నిర్వేదంగా చూస్తూ ఉండిపోవడమే…
Share this Article