Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రీల్ లైఫు జంటగా ఢోకా లేదు… త్వరలో రియల్ లైఫ్ జంటగానూ కనిపిస్తారు…

February 11, 2023 by M S R

అయ్యో, ఇక ఈ జంట మళ్లీ తెరపై కనిపించదా అని బోరుమన్నాయి కొన్ని సైట్లు… ఒకడు ఏదైనా రాస్తే చాలు, ఇక కుప్పలుతెప్పలుగా అందరూ అదే గొర్రెదాటు… ఇంతకీ ఆ జంటపేరు చెప్పనేలేదు కదూ… విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన… కారణమేమిటీ అంటారా..? ఓ పొంతన లేని విషయానికీ దానికీ ముడిపెట్టేశారు…

విషయం ఏమిటంటే..? పరుశురాం అనబడే దర్శకుడు గీతా ఆర్ట్స్ వారికి, అనగా అల్లు అరవిందుడికి ఓ సినిమా చేయాల్సి ఉంది… అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట… సర్కారువారి పాట ఊపులో ఉన్న పరుశురాం అల్లు వారి మాట మరిచిపోయి, దిల్ రాజుకు ఓ సినిమా ఒప్పేసుకున్నాడు… అసలే దిల్ రాజు వేస్తున్న వేషాలతో మైత్రి మూవీస్ సహా చాలామంది మండిపడుతున్నారు కదా… కానీ బలమైన సిండికేట్ కావడంతో సమయం కోసం చూస్తున్నారు… అఫ్ కోర్స్, అరవింద్ గ్రిప్ కూడా తక్కువేమీ కాదుగా టాలీవుడ్ మీద…!!

తనకు సినిమా చేయాల్సి ఉన్నప్పుడు దిల్ రాజు దర్శకుడు పరుశురాంతో సినిమా చేయించడం ఏమిటి..? కొన్ని సినీమర్యాదల్ని దిల్ రాజు అతిక్రమిస్తున్నాడనేది అరవింద్ కోపం… అటు దిల్ రాజు, అటు అరవింద్ ఒకరిపైనొకరు లీకులు ఇచ్చుకుంటూ, వార్తలు రాయించుకుంటూ మంటలో ఎవరికితోచినంత పెట్రోల్ వాళ్లు పోస్టున్నారు…

Ads

నిజానికి అల్లు అరవింద్‌కు పరుశురాం గీతగోవిందం సీక్వెల్ తీసిపెట్టాల్సి ఉంది… గీతగోవిందం సినిమా సూపర్ హిట్, అందుకే దానికి సీక్వెల్ తీయాలని ప్లాన్… దాన్ని పక్కన పెట్టేసి, పరుశురాం దిల్ రాజు చంకలో జొర్రడం అరవింద్‌కు తేళ్లుపాములు పాకినట్టుగా ఉంది… ఇదీ కథ… దీనికి రష్మికకు ముడిపెట్టి… గీతగోవిందం ఒరిజినల్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక జంట కదా, ఆ సీక్వెల్ రావడం లేదు, ఒకవేళ వచ్చినా సరే సర్కారువారిపాటలో చేసిన కీర్తిసురేష్‌ను తీసుకోవాలని పరుశురాం ఆలోచన… బాగా ఇంప్రెస్ అయ్యాడు… అంటే ఇక ఆ విజయ్, రష్మిక జంట కనిపించదా అని ఎడాపెడా రాసేశారు మనవాళ్లు… అయితే..?

rashmika

విజయ్, రష్మిక గీతగోవిందం తరువాత కూడా ఓ సూపర్  ఫ్లాప్ సినిమాలో కనిపించారు… దిల్ రాజు, అల్లు అరవింద్ కొట్టుకుంటే ఈ జంటకు ఏమొచ్చింది సమస్య..? ఏమీ లేదు, ఇద్దరూ కలిసి ఎంచక్కా ఏ ప్రాజెక్టు దొరికినా చేసేస్తారు… జంటగా తీసుకుంటే రిబేట్లు కూడా ఇస్తారు… అంత బాగా కెమిస్ట్రీ కుదిరిందని కాదు… వాళ్లిద్దరూ డేటింగులో ఉన్నారని కదా ప్రచారం… పైగా పరుశురాం కాకపోతే మరో భార్గవరాం… బోలెడు మంది దర్శకులు, బోలెడు మంది నిర్మాతలు…

తరచూ మాల్దీవుల్లో కనిపిస్తున్నారు… కాయకష్టం చేసి తను సంపాదించిన సొమ్మంతా విజయ్ అప్పులు తీర్చడానికే ధారబోస్తోందని కూడా టాక్… లైగర్ దెబ్బ విజయ్ మీద మామూలుగా లేదు… సో రష్మిక నిజమైన ప్రేమికురాలిగా తనకు అండగా ఉంది… ఐనా విజయ్‌కు ఇచ్చిన దాంతో ఆమెకు అరిగేదేమీ లేదు, అయిపోయేదేమీ లేదు… ఈమధ్య తమిళం, హిందీ ప్రాజెక్టులతో బాగానే సంపాదించింది… సో, విజయ్‌కు ఫస్ట్ ప్రిఫరెన్స్ రష్మికే… అందుకని ఆ జంట తెరపై మళ్లీ కనిపించదు, అయ్యో, ఎంత పనైపోయింది అనే శోకాలు అక్కరలేదు… ఏమో, రీల్‌లోనే కాదు, రియల్ లైఫ్ జంటగా కూడా కనిపించే చాన్స్ ఉంది త్వరలో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions