……. సాధారణంగా కేటీయార్ ఆచితూచే మాట్లాడతడు… ప్రత్యర్థులకు కౌంటర్లు వేయడంలో గానీ, తమ విధానాల్ని సమర్థించుకోవడంలో గానీ దూకుడు ఉంటుంది… కానీ ఈ విషయంలో ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియని తడబాటు ఏదో కనిపిస్తోంది… మొన్న దుబ్బాకలో హరీష్‌రావు పలుసార్లు ఫ్రస్ట్రేషన్‌కు గురైనట్టు కనిపించింది… సరిగ్గా కౌంటర్ పంచ్ వేయలేకపోతున్నట్టుగా… ఇప్పుడు కేటీయార్ కూడా…
ప్రమాదాలు జరిగినా, విషాదాలు సంభవించినా కేసీయార్ వెంటనే అక్కడ వాలిపోవడానికి ఇష్టపడడు… పరామర్శలు అనే కోణంలో తనపై ఎన్నాళ్లుగానో ఉన్న విమర్శే ఇది… నిజానికి రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే… ఏదైనా సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గానీ, రాజకీయ పార్టీల నాయకులు గానీ ఎందుకు వెంటనే వెళ్లాలి అక్కడికి..? దానివల్ల బాధితులకు తక్షణం ఒరిగేదేముంది..? అక్కడ జరగాల్సింది సహాయక చర్యలు… ఈ నాయకుల పర్యటనలతో నిజానికి అవి డిస్టర్బ్ అవుతాయి… ఒకరకంగా బాధితులకు అదనపు నష్టం… కానీ పార్టీలు అలా చూడవు కదా…
నువ్వెందుకు రాలేదు, ఆయనెందుకు రాలేదు…. ఈ విమర్శలు, బురద మొదలవుతయ్… మొన్నటి భారీ వర్షాలు, వరదలకు వందల కాలనీలు హైదరాబాదులో ఆగం ఆగం అయిపోయినయ్… పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలూ వచ్చినయ్… చివరకు వరదసాయం పంపిణీలో కూడా చాలా ఆరోపణలు వెల్లువెత్తినయ్… దీన్ని బీజేపీ వాడుకునే ప్రయత్నంలో పడింది… కేసీయార్ కు కనీసం వరద ప్రాంతాల పర్యటన కూడా పట్టలేదు, జనమంటే ప్రేమ లేదు అని మొదలుపెట్టింది విమర్శ…
దీనిపై ఎదురైన ప్రశ్నకు… ‘‘నాయకుల పర్యటనలు, పరామర్శలకన్నా… సహాయకచర్యల మీద, తక్షణ ఉపమశన చర్యల మీద ప్రభుత్వం కాన్సంట్రేట్ చేసింది’’ అనే ఏకవాక్య జవాబు చాలు కేటీయార్ వైపు నుంచి… కానీ ‘‘సీఎం మస్తు బిజీ ఉంటడు… బొచ్చెడు పనులుంటయ్… ఉత్తమ్, సంజయ్ ఏమైనా తిరిగిండ్రా’’ అనే వాదన వైపు అడుగులు వేశాడు కేటీయార్… కరెక్టు కాదు… మళ్లీ బీజేపీ నుంచి కౌంటర్‌కు తనే స్కోప్ ఇచ్చిండు… ‘‘ప్రజల కష్టాల్లో అండగా ఉండటంకన్నా సీఎంకు బిజీ పనులుంటయా..? అంటే ఇది పట్టించుకునే పని కాదా..?’’ అనే పొలిటికల్ రివర్స్ పంచులకు చాన్స్ ఇచ్చినట్టయింది…
అసలే బీజేపీ భాష మారిపోయింది… అర్వింద్, సంజయ్ తదితరులు వదులుతున్న బాణాలు పదునుగానే ఉంటున్నయ్… ఫామ్ హౌజ్ దాటని సీఎం అనే విమర్శకు టీఆర్ఎస్ వైపు నుంచి సరైన సమర్థన జనంలోకి వెళ్లడం లేదు… బీజేపీ నాయకుల కౌంటర్లను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద పబ్లిష్ చేయకపోయినా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నయ్… అసలే బీజేపీ సోషల్ మీడియా ప్రచారంలో తోపు… వరదసాయం అనే అంశాన్ని ఇంకా వాడుకునే ప్రయత్నం చేస్తుంది… కేసీయార్ జనాన్ని పట్టించుకోలేదు, గాలికి వదిలేశాడు, కనీసం పరామర్శ కూడా చేతకాలేదు అనే పాయింట్‌ను ఇంకా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో పడింది…
Ads
Share this Article