.
బాలకృష్ణ జగన్‌ను సైకో గాడు అని దారుణంగా తూలనాడి ఉండవచ్చుగాక… తన భాష, తన ధోరణి, తన తత్వం అదే… తన బ్లడ్డు బ్రీడు కూడా అదే… కానీ ఒకరకంగా జగన్‌కు మేలు చేశాడు… అనాలోచితంగా..! ఎందుకంటే..?
ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ఏం చెబుతూ వచ్చాడు..? జగన్ మా అన్న చిరంజీవిని అవమానించాడు అనే కదా… టీడీపీ కూడా వంతపాడింది కదా… నందమూరి, నారా ఫ్యాన్స్, జనసేన, మెగా ఫ్యాన్స్ అందరూ అదే కదా అందుకున్నది…
Ads
ఇప్పుడు సాక్షాత్తూ చిరంజీవే చెబుతున్నాడు… ‘‘జగన్ ఇంటికి వెళ్లినప్పుడు నన్ను సాదరంగా ఆహ్వానించారు’’ అని… అంటే, తనను జగన్ అవమానించాడని పవన్ కల్యాణ్ చేసిన ప్రచారాన్ని చిరంజీవే ఖండించినట్టు అయిపోయింది…
అంతేకాదు, చిరంజీవి తన లేఖలో బాలకృష్ణకు చురకలు తగిలించాడు కూడా… ‘‘నా చొరవ కారణంగానే నీ వీరసింహారెడ్డి సినిమాకు టికెట్ ధరలు పెరిగాయి… సామాన్యుడైనా, ముఖ్యమంత్రయినా నేను ఇలాగే గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే మాట్లాడతాను… బాలకృష్ణకు కూడా ఫోన్ చేశాను, దొరకలేదు, కుదరలేదు…’’
1) బాలకృష్ణ భాషను, మాట్లాడిన ధోరణిని కౌంటర్ చేశాడు… 2) ఇండస్ట్రీ విషయంలో తను చొరవ తీసుకున్నా బాలకృష్ణ సహకరించలేదు, తిరస్కరించాడని కార్నర్ చేశాడు… 3) నన్ను జగన్ అవమానించాడనేది అబద్ధమనే విషయాన్ని తనే చెప్పాడు…
నిజానికి చిరంజీవి సహజ ధోరణిని బట్టి ఇంత వేగంగా తను స్పందిస్తాడని ఎవరూ అనుకోలేదు… పైగా తన విషయంలో తన తమ్ముడు ఇన్నాళ్లూ చేసిన ప్రచారాన్ని తనే ఖండిస్తాడని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు… ఇప్పుడు బాలకృష్ణకు పోయేదేమీ లేదు, తను అంతే, మారడు… తనసలే అఖండ బాపతు…
మరి ఇప్పుడిక పవన్ కల్యాణ్ ఏం చేయాలి..? తను ఇరుకునపడ్డాడు… ఏం స్పందించాలో అర్థం కావడం లేదు… చిరంజీవి చెప్పినదాన్ని ఖండించలేడు… తనే అప్పట్లో ప్రచారం చేశాడు కాబట్టి ప్రస్తుత చిరంజీవి వ్యాఖ్యల్ని ఆమోదించలేడు… (అప్పట్లో ఎవరి దగ్గరా ప్రాధేయపడాల్సిన పనిలేదని, అది ఇండస్ట్రీ హక్కు అనీ, చిరంజీవి అండ్ టీం జగన్ వద్దకు వెళ్లినప్పుడు కామెంట్ చేశాడు…)
పోనీ, బాలకృష్ణ సభలో చెప్పిందంతా నిజమే అని కూడా అనలేడు… అందుకే ఎప్పుడూ సీరియస్‌గా రియాక్టయ్యే పవన్ ఫ్యాన్స్ సైలెంటుగా ఉండిపోయారు ఈ వివాదంలో..! ప్చ్, ప్రస్తుతం ఓజాస్ గంభీర్‌కు ఎటూ తోచడం లేదు…!! జగన్ ఫ్యాన్స్ మాత్రం కాగలకార్యం బాలకృష్ణే తీర్చాడు సుమా అన్నట్టుగా హేపీ…! ఎందుకంటే… తనను జగన్ అవమానించిందేమీ లేదని చిరంజీవే చెప్పేట్టు చేశాడు కదా..!!.
.
చివరగా… ఏదో ఇష్యూలో FDC లిస్ట్ ప్రిపేర్ చేస్తే అందులో తన పేరు నైన్త్ ప్లేసులో పెట్టారని అన్నాడు బాలయ్య… అంటే ఈ ప్రభుత్వంలో తనను లైట్ తీసుకుంటున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదని తనే చెప్పుకున్నాడు ఫాఫం… కందుల దుర్గేష్ ను సభలోనే అడగడం అంటే , పరోక్షంగా దుర్గేష్ బాస్ పవన్ కళ్యాణ్ ను అడగడం..,!!
Share this Article