.
ఒకే జీవో… ఒకేసారి 6,729 మందిని పీకిపారేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… వాళ్లంతా సర్వీస్ నుంచి రిటైరయినా సరే… కీలక పోస్టులు సహా అలాగే కొనసాగుతున్నారు ఇన్నాళ్లూ… వాళ్లందరినీ ఈ జీవో ద్వారా ఇక చాలు మీ సేవలు అంటూ ఇంటికి పంపించేస్తున్నారు…
ఒక కోణంలో చూస్తే మంచి నిర్ణయమే… అధికార పార్టీతో ఉన్న సాన్నిహిత్యం, ఆ పార్టీ నాయకుల పైరవీలే వీళ్ల కొనసాగింపు వెనుక ప్రధాన కారణం… ఇలా కొనసాగించడం వల్ల నష్టాలు…
Ads
1. కీలక స్థానాల్లోకి అర్హులైన జూనియర్లు రాకుండా అడ్డంకులు… ప్రమోషన్లను ఆశించే ఉద్యోగులకు నిరాశ…
2. అవినీతి, అక్రమాలకు పేరొందిన ఉన్నతాధికారులు కొందరు అవే స్థానాల్లో అదే పోకడలతో పనిచేయడం వ్యవస్థకు నష్టం…
3. కేసీయార్ ప్రభుత్వం పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేసినవారిని కూడా ఏదో ఒక పేరుతో సర్వీస్ ఎక్స్‌టెన్షన్ ఇస్తూ పోయింది… వాళ్ల సర్వీసు వ్యవస్థకు శుద్ధ దండుగ… జస్ట్, ఏదో ఓ పేరుతో వాళ్లకు పునరావాసం కల్పించారు అలా…
4. మెట్రో, వైజీటీ, ట్రాన్స్‌కోె, డిస్కమ్స్, జెన్కో, పురపాలన సహా చాలా సంస్థల్లో అనేకమంది పాతుకుపోయారు… ఆ ఖాళీల్లోకి నిరుద్యోగులు రాకుండా ఇదొక అడ్డంకి…
5. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థోమత లేక, సర్దుబాటు చేయలేక కేసీయార్ మొత్తం పదవీ విరమణ వయస్సునే పెంచిపారేశాడు… అది నిరుద్యోగులకు మరో షాక్… రేవంత్ రెడ్డి కూడా మరింత పదవీ విరమణ వయస్సు పెంచబోతున్నాడు, ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు అనే వార్తలు వచ్చాయి కానీ తరువాత రేవంత్ రెడ్డి అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు… కానీ రిటైరైన వాళ్లకు డబ్బులు నెలలుగా బాకీలున్నాయి… అది రియాలిటీ…
మొత్తానికి కేసీయార్ పాలన లోపాలకు సంబంధించి ఇదొక సర్దుబాటు… ఐతే చిన్న మెలిక ఉన్నట్టుంది… ఏ పోస్టుకైనా ఏమైనా రిక్వైర్‌మెంట్ ఉంటే తాజా నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని… అంటే, ఈసారి ఆ పోస్టుల్లోకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు సిఫారసు చేసే వ్యక్తులు వస్తారన్నమాట… అంటే వాళ్లు పోతారు, వీళ్లు వస్తారు… అంతే…
మరీ కీలక స్థానాల్లో పోస్టులు మినహా… మిగతా అన్ని పోస్టుల్లోకి తాజాగా నియామకాలు జరపడం బెటర్… వ్యవస్థలోకి కొత్త రక్తం వస్తూ ఉండాలి… అర్హత కలిగిన జూనియర్లకు ఆపైస్థాయి పోస్టుల్లోకి ప్రమోషన్లు ఇవ్వాలి… దిగువ నుంచి పైవరకు ఈ ప్రక్షాళన అవసరం…
అదీ హేతుబద్ధంగా జరగాలి… అలా జరిగితేనే కేసీయార్ వ్యవస్థకు చేసిన నష్టానికి విరుగుడు… దీనికి రేవంత్ రెడ్డి కమిటై ఉంటేనే బెటర్ రిజల్ట్స్… అలాగే ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచబోను అనే మాటకు కూడా కట్టుబడి ఉండాలి, లేకపోతే నిరుద్యోగులకు నష్టం..!! ఎందుకో గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ప్రాధాన్యం దక్కలేదు ఈ వార్తకు…!!
Share this Article