Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్పోర్ట్స్ యాప్స్ విజృంభణ… టీవీ స్పోర్ట్స్ ఛానల్స్‌కు మరింత గడ్డు కాలం..!

August 20, 2024 by M S R

 

చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. ఇల్లెందులో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం చర్చి కంటే ముందు ఒక ఆంటి వాళ్ల ఇంటికి వెళ్లి టామ్ అండ్ జెర్రీ చూసేవాడిని. ఇక రామవరంలో చర్చి కాంపౌండ్‌లోనే ఒక తాతయ్య ఉండేవారు. పేరు గుర్తుకు రావడం లేదు కానీ.. ఆయన్ని మేము టీవీ తాతయ్య అని పిలిచేవాళ్లం. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే వచ్చేది. తాతయ్య వార్తల చూసేవారు. ఇక క్రికెట్ వస్తే రోజంతా టీవీ ఆన్‌లో ఉండేది. నేను క్రికెట్ ఫస్ట్ టీవీలో చూసింది అప్పుడే. దూరదర్శన్‌లో క్రికెట్ లైవ్ వచ్చేది. వార్తలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం లైవ్ ఆపేసేవాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు గల్లీ క్రికెట్ కూడా లైవ్ చేసే స్థాయికి స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ ఎదిగింది.

ఫ్యాన్‌కోడ్ అనే యాప్ తీసుకుంటే.. మీ ఊర్లో జరిగే మ్యాచ్‌లను కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తూ కనిపిస్తుంది. ఈ బ్రాడ్‌కాస్టింగ్ వెనుక బెట్టింగ్ మాఫియా ఉందనే రూమర్లు కూడా ఉన్నాయి. అది వేరే విషయం. కానీ రెండు మూడేళ్ల నుంచి స్పోర్ట్స్ ఛానల్స్‌లో చూసే వాళ్ల కంటే స్ట్రీమింగ్ యాప్స్‌లో చూసే వాళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది. చవకగా లభించే డేటా, ఫ్రీగా లైవ్ మ్యాచ్‌లు ఇచ్చే స్ట్రీమింగ్ యాప్స్ ఉండటంతో స్పోర్ట్స్ ఛానల్స్‌లో క్రీడలను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ట్రెండ్‌ను గమనించే జియో యాజమాన్యం ఐపీఎల్‌కు సంబంధించి కేవలం స్ట్రీమింగ్ హక్కులనే కొని.. శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్‌కు వదిలేసింది. ఇప్పుడు ఆ స్టార్ గ్రూప్‌ కూడా జియోలో కలిసి పోయింది.

Ads

ప్యారీస్‌లో జరిగిన ఒలింపిక్స్ వ్యూయింగ్ గేజ్ డేటాను నీల్సన్ గ్రూప్ తాజాగా స్టడీ చేసింది. యూఎస్ఏలో సాధారణంగా సాకర్ వరల్డ్ కప్, రగ్బీ మ్యాచెస్, ఒలింపిక్స్ జరిగినప్పుడు సాధారణం కంటే ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉంటుంది. టీవీల్లో క్రీడలను లైవ్‌గా చూసే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ సారి టీవీ వ్యూయింగ్ ట్రెండ్స్ దారుణంగా పడిపోయాయని ఆ రిపోర్టులో తేలింది.

యూఎస్ఏలో జూలైలో 3.5 శాతం మంది ఎక్కువగా టీవీ చూడగా.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒలింపిక్స్‌ను చూసిన వారి సంఖ్య 41.4 శాతానికి పెరిగింది. యూఎస్ఏలో కేబుల్ టీవీ, డీటీహెచ్, యాంటెన్నాల ద్వారా చూసిన వారి కంటే స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా క్రీడలను వీక్షించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+లు కూడా స్పోర్ట్స్ కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో సాంప్రదాయ టీవీ వ్యూయింగ్ అనేది తగ్గిపోతోంది. టీవీల కంటే స్ట్రీమింగ్ యాప్స్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తుండటం కూడా క్రీడాభిమానులను అటువైపు మరలేలా చేస్తోంది.

ఇక స్కోర్స్ చెక్ చేయడానికి గూగుల్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. కేవలం మ్యాచ్‌ను సెర్చ్ చేస్తే.. గూగుల్ దానికి సంబంధించిన లైవ్ స్కోర్ స్క్రీన్ మీద ఇస్తున్నది. ఇది కూడా టీవీ వ్యూయింగ్‌పై దెబ్బ వేస్తోందని స్టడీలో తెలిసింది. రాబోయే రోజుల్లో టీవీలకు సంబంధించిన హక్కులను కొనడానికి కూడా బ్రాడ్‌కాస్ట్ సంస్థలు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని.. వందలాది స్పోర్ట్స్ ఛానల్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని అధ్యయనంలో తేలింది.

ఇండియాలో కూడా జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్‌లు క్రీడల లైవ్ విషయంలో పోటీ పడుతున్నాయి. జియో, డిస్నీ కలిసిపోవడం.. సోనీ, జీ టీవీలు కూడా కలిసిపోవడంతో ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో ఈ రెండు గ్రూప్‌ల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొన్నది. రాబోయే రోజుల్లో శాటిలైట్ హక్కుల కంటే.. స్ట్రీమింగ్ హక్కుల కోసం మరింత పోటీ నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  సోర్స్ : రాయ్‌టర్స్  #భాయ్‌జాన్ (John Kora)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions