.
మీడియా ముందు ఇళయరాజాను కూర్చోబెట్టడంతోనే జన్మలు ధన్యమయ్యాయట… రీసెంటుగా ఇళయరాజా పాల్గొన్న ఏదో సినిమా ఫంక్షన్‌లో ఎవరో మీడియా పర్సన్ చెబుతున్నాడు అలా…
ఆహా, ఏం చెప్పావు బ్రదర్..? నిజంగానే నీ జన్మ ధన్యమైపోయిందిపో పాపం… ఫంక్షన్‌లో తనేదో చెబుతున్నాడు, తన తత్వంలాగే ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… తీరా హోస్ట్ ఎవరో ఆమె మీడియాతో ఇంటరాక్షన్ అనేసరికి చేతులు అడ్డంగా ఊపేశాడు,.,
Ads
కష్టమ్మీద అర్థమైనంతవరకు… ‘‘నేను ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్లలో కనిపించానా..? వీళ్లు కొత్తవాళ్లు కాబట్టి ఎంకరేజ్ చేద్దామని వచ్చాను… వీళ్లే కాదు వంశీ, మణిరత్నం, భారతీరాజా ఇలా చాలామంది…’’ నేను ఎంకరేజ్ చేశాను కాబట్టే అంత పెద్దోళ్లయ్యారు అన్నట్గుగా…
సరే, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చెప్పగలిగాడో వదిలేస్తే… అదేదో తనకు తెలిసిన తమిళంలోనే చెప్పొచ్చు కదా, పక్కనే కీరవాణో, రాజేంద్రప్రసాదో తెలుగులోకి తర్జుమా చేసేవాళ్లు కదా… (రాజేంద్ర ప్రసాద్, కీరవాణి మాటలూ ఇలాగే ఉంటాయి, అది వేరే సంగతి)…
పైగా తను అంటున్నాడు… నాకు మ్యూజిక్ తెలియదు, మ్యూజిక్‌కే నేను తెలుసు… ఎందుకు తెలుసో నాకు అర్థమైనప్పుడు కంపోజ్ చేయడం ఆపేస్తాను అని… నాకు మ్యూజిక్ తెలియదు, నేనే మ్యూజిక్‌కు తెలుసు అని బహుశా ప్రపంచంలో పేరొందిన ఏ సంగీత ప్రముఖుడు అన్నట్టు గుర్తులేదు…
(ఈమాటలు అంటూ కీరవాణి వైపు చూస్తాడు, ఆయన అభావంగా చూస్తుండిపోయాడు, తనకైనా ఏమైనా అర్థమైతే కదా… అదేదో తనకు బాగా అర్థమైనట్టు రాజేంద్రప్రసాద్ నవ్వులు, ప్రశంసలు… ఏం దొరికార్రా బాబూ…)
సంగీతపరంగా ఇళయరాజా గ్రేట్, అందులో ఎవరికీ డౌట్ లేదు… ఓ కొత్త ఒరవడి తను… కానీ వ్యక్తిగా అత్యంత వివాదాస్పదుడు… కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలు, వివాదాలే దాన్ని స్పష్టంగా చెబుతున్నాయి… ఎస్, ఇళయరాజా కొన్నాళ్లుగా డబ్బు కక్కుర్తి వేషాలతో విపరీతంగా బదనాం అవుతున్నాడు కదా… మీడియా ఇంటరాక్షన్ అనగానే ఈ ప్రశ్నలు వస్తాయి కదా, అందుకే దాటవేత… తెలుసు లేవయ్యా ఇసై జ్ఞానీ,..
Share this Article