ప్రజాప్రయోజనాల కోణంలో గాకుండా… ఏదో ఉద్దేశంతో నమోదు చేయబడిన దరఖాస్తులుగా భావించి… ఈమధ్య తెలంగాణ సమాచార కమిషనర్ బుద్ధా మురళి తన పదవీవిరమణకు ముందు అవన్నీ ఒక్కచోట క్లబ్ చేసి, ఒకే తీర్పు చెప్పినట్టు వార్త చదివాను… నిజానికి చాలా ఇంపార్టెంట్ వార్త… వినియోగదారుల చట్టాన్ని భ్రష్టుపట్టించినట్టే సమాచార హక్కు చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది… ఆ స్పిరిటే ఇప్పుడు కనిపించడం లేదు… మొదట్లో కాస్త సున్నితత్వం ప్రదర్శించిన అధికారుల చర్మాలు కూడా ఇప్పుడు మొద్దుబారిపోయాయి…
ఈనాడులో ఎక్కడో చిన్న వార్త కనిపించింది… నిజానికి ఆ పత్రికలో కనిపించిన ఇంట్రస్టింగు వార్త అదే… మిగతావన్నీ సోసో… నిన్న సోషల్ మీడియాలో చదివినవే, చద్ది వార్తలు… కాదు, పాచిపోయిన వార్తలు… ఆ వార్త ఏమిటయ్యా అంటే… కర్నాటక రాష్ట్రం… కోలార్ జిల్లా… ముళబాగి ఏరియా… మండికల్ నాగరాజు అనే వ్యక్తి ఓ తహసిల్దారు పెళ్లిళ్ల విషయంలో సమాచారం అడిగాడు… తను అడిగిన ప్రశ్నలు ఏమిటంటే…
ఆ మహిళా తహసిల్దారుకు ఎన్నిసార్లు పెళ్లిళ్లయ్యాయి..? ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారు..? ప్రస్తుతం ఎవరితో సంసారం చేస్తున్నారు..? చివరి వివాహం ఎక్కడ జరిగింది..? ఎవరితో..? చివరి వివాహానికి సంబంధించి శుభలేఖలు ఉన్నాయా..? కల్యాణ మండలం వివరాలున్నాయా..? ఇవీ ప్రశ్నలు… నిజానికి నాన్సెన్స్… ఇవన్నీ ఆమె వ్యక్తిగతం… ఇందులో ప్రజాప్రయోజన కోణం ఏముంది..? అధికార కార్యకలాపాలతో ఆమె పెళ్లిళ్లకు సంబంధం ఏముంది..?
Ads
ఆమె ఇష్టం… ఏడాదికి ఓ పెళ్లి చేసుకుంటుంది… దానివల్ల జనానికి నష్టం ఏముంది..? కష్టం ఏముంది..? ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడేదేముంది..? ఈ వివరాలు తీసుకుని సదరు దరఖాస్తుదారు సాధించేదేముంది..? ఆమె ఫిర్యాదు చేసింది, ముళబాగి పోలీసులు సదరు నాగరాజును అరెస్టు చేశారు, విచారిస్తున్నారట… ఇక్కడే వార్త అసంపూర్ణంగా, అపరిపక్వంగా ముగిసిపోయింది… ఆమె ఏ కారణంతో ఫిర్యాదు చేసింది..? ఇదీ అసలు ప్రశ్న… ఎందుకంటే…
తను కోరిన సమాచారం దేనికోసం అని దరఖాస్తుదారుడు చెప్పాల్సిన పనిలేదు… ఒకవేళ ఆ చట్టం స్పూర్తికి భిన్నంగా ప్రశ్నలు ఉంటే వెంటనే సదరు సమాచార అధికారి నిరాకరించి, వెంటనే ఆ దరఖాస్తును తిరస్కరించే అవకాశముంది… అంతేతప్ప, తప్పుడు ప్రశ్నలకు, ఈ చట్ట దుర్వినియోగ ప్రయత్నాలకు శిక్షలు, జరిమానాలు బహుశా నాకు తెలిసి సమాచార చట్టంలో లేవు… (subject to correction)…
కాకపోతే సదరు చట్టాన్ని అడ్డుపెట్టుకుని, తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆమె ప్రైవేటు కేసు ఏమైనా పెట్టి ఉండవచ్చు… దీనిపై నిజంగా విచారణ కాస్త ఎలాబరేట్‌గా జరిగితే బాగుండు… అకారణంగా పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేస్తే జరిమానాలు వేస్తున్నట్టే… ఇలాంటి ప్రశ్నలతో చట్టం స్పూర్తిని భ్రష్టుపట్టించే ప్రయత్నాలకూ శిక్షలు అవసరం… ఆ భయం లేకపోవడమే ఇలాంటి ప్రశ్నలకు కారణం… మిగతా మీడియాకు అసలు ఇది వార్తలాగే కనిపించలేదు ఎందుకో మరి…!!
Share this Article