అనిల్ రావిపూడి… ఈ దర్శకుడు కృష్ణమ్మ అనే సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్నాడు… హీరో సత్యదేవ్… దీనికి రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని ఎట్సెట్రా హాజరయ్యారు… అందులో రావిపూడి మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ మ్యాచ్‌లు 2-3 రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవు… ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి… క్రికెట్ స్కోర్‌ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు…’’ అని చెప్పుకొచ్చాడు…
ఏదో సినిమా ప్రమోషన్ ప్రోగ్రాం కాబట్టి, తనను పిలిచారు కాబట్టి, నాలుగు మంచిమాటలు చెప్పాలి కాబట్టి, ఏదో చెప్పాడు… అందరూ థియేటర్లకు వెళ్లి చూడండి, సినిమా బాగుంటుంది అని చెబితే సరిపోయేది… ఐపీఎల్ మ్యాచులతో ముడిపెట్టడంతో కంట్రవర్సీ… నిజంగానే ఐపీఎల్ దెబ్బ థియేటర్ల మీద బాగానే పడింది… అయితే ఆ వ్యాఖ్యలు అనాలోచితం, నెటిజనం కూడా అలాగే నెగెటివ్‌గా రియాక్టయ్యారు…
నెటిజనం కౌంటర్లలో కూడా పాయింట్ ఉంది… ఐపీఎల్ మ్యాచులు రెండుమూడు చూడకపోతే నిజంగానే కొంపలేమీ మునగవు, అంగీకరిద్దాం, అసలు మొత్తమే చూడకపోయినా ఏమీ మునగవు… కానీ ఈ సినిమా చూడకపోతే ఏం మునిగిపోతుంది..? ఫస్ట్ షోలు, సెకండ్ షోలు చూడకపోతే ఏమవుతుంది..? థియేటర్ వెళ్తే నిలువు దోపిడీయే కదా… పైగా అన్నీ సోది, రొటీన్ ఫార్ములా సినిమాలే కదా… సినిమాలు ఎంత పెద్ద దందాయో, ఐపీఎల్ కూడా అంతే దందా…
Ads
అన్నీ స్క్రిప్టెడ్, ఫిక్స్‌డ్… ఐనా ఆట చూడటంలో ఓ మజా ఉంటుంది… మన సినిమాల్లో ఏముంది..? అవే పిచ్చి డైలాగులు, స్టెప్పులు, ఫైట్లు, హీరోయిజం, బిల్డప్పులు… పైగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూస్తేనే థ్రిల్… సినిమాదేముంది..? రేప్పొద్దున ఓటీటీలో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు… అసలు చూడకపోయినా వీసమెత్తు నష్టం లేదు, నీకు సినిమాలు ముఖ్యం కావచ్చు, కానీ సగటు ప్రేక్షకుడికి ఆ రుద్దుకునుడు అంత అవసరం లేదు…
సరే, అనిల్ రావిపూడి మాటల్ని అలా వదిలేస్తే… ఈమధ్య ది ప్రూఫ్ అనే ఓ సినిమా ఫంక్షన్ జరిగింది… అందులో సాయి ధన్సిక లీడ్ రోల్… దానికి హాజరైన డైరెక్టర్ మిష్కిన్ ఏవేవో పిచ్చి కామెంట్లు చేశాడు… నిజంగా ఇలాంటి చెదలు పట్టిన బుర్రలు సినిమాలు తీస్తుంటే మనం చూస్తూ, పర్సులు ఖాళీ చేస్తూ, మన చెత్తా హీరోలు వందలు, వేల కోట్లు పోగేసుకునేలా చేస్తున్నాం, నిజంగానే మనదే మూర్ఖత్వం
‘‘సినిమా ఒక దైవం లాంటిది… ఆ దైవాన్ని ప్రార్థించాలి. ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులుంటే కనీసం ఐదుగురు నెలలో ఒకరోజైనా సినిమాకు వెళ్ళాలి…. ప్రతి ఒక్కరూ ఆలయాలకు కాకుండా, సినిమాలకు వెళ్ళాలి… తప్పు చేసేవారు, చేయబోయేవారు మాత్రమే ఆలయాలకు వెళ్తుంటారు… ఏ తప్పూ చేయనివారు, హాయిగా నవ్వుకుంటూ కొన్ని గంటల పాటు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు సినిమాలకు వెళ్ళాలి…’’ ఇవీ ఆయన వ్యాఖ్యలు… సినిమా దైవం లాంటిదేమిటో, గుళ్లకు వెళ్లకుండా జనం థియేటర్లకు వెళ్లాలనే పిలుపు ఏమిటో, తప్పులు చేసేవాళ్లే గుళ్లకు వెళ్తారు, తప్పులు చేయనివాళ్లు థియేటర్లకు వెళ్తారనే ప్రేలాపన ఏమిటో… తనకైనా తెలుసా తనేం కూస్తున్నాడో… డౌటే…
‘సినిమా అనేది దైవం వంటిది. సినిమా ఒక కళ. మూడు గంటలపాటు హాయిగా కాలాన్ని గడిపేయొచ్చు’
అసలు గుళ్లకు వెళ్లడానికీ, సినిమాలకు వెళ్లడానికి లింకేమిటి..? తప్పులు చేసేవాళ్లే గుళ్లకు వెళ్తారనే కూతలు దేనికి..? ఈ చెదలు తినేసిన బుర్రలు సినిమాలు తీస్తాయి, మనకు రుద్దుతాయి, మనం పిచ్చోళ్లం కదా, వీళ్లందరి నీతులు, కూతలు వింటూ, వీళ్ల పైత్యాలకు మన జేబులు ఖాళీ చేసుకుంటాం… అవునూ, అకస్మాత్తుగా దర్శకుల చిత్తప్రకోపం ఏమిటిలా..?!
Share this Article