Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘అప్పట్లో మీకు అమ్మిన సరుకు అలాగే ఉందా..? మేమే తిరిగి కొంటాం ప్లీజ్…’’

October 15, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……. మధ్య ప్రాచ్యం మంట పార్ట్ 3… రష్యాకి శత్రువు అక్కడ నెలకొన్న అవినీతి మాత్రమే! అధ్యక్షుడు పుతిన్, రక్షణ మంత్రి షోయ్గు ((shoigu),అతని సైనిక జెనెరల్స్ అవినీతి వల్ల రష్యా గత పదేళ్ల నుండి ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది…

*****************

ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టగానే అమెరికా, EU, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి. అంటే సరిగ్గా ఫిబ్రవరి 23, 2022 నుండి అన్నమాట. అప్పటివరకు అవినీతి అనేది 50% ఉంటే ఆంక్షల తరువాత అది 80% కి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించి అమ్మకాలని అమ్మడం మొదలు పెట్టిన తరువాత ఏ దేశానికి ఎంత ఆయిల్ అమ్ముతున్నదీ, వచ్చిన డబ్బు ఎంత అనేదానికి లెక్కలు ఉన్నా అవి కాకి లెక్కలు.

Ads

ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుని రక్షణ మంత్రి అతని జెనెరల్స్ తో పాటు టాప్ FSB అధికారులు కలిసి పంచుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ! ఈ విషయం పుతిన్ తో నేరుగా చెప్పాలని ప్రయతించాడు వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్! నిజానికి ప్రిగోజిన్ దుర్మార్గుడే కావొచ్చు కానీ దేశభక్తి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు.

ఉక్రేయిన్ నుండి 15% భూభాగం రష్యా ఆధీనంలోకి రావడానికి ప్రధాన కారణం వాగ్నర్ గ్రూపు ! ప్రిగోజిన్ అలానే కొనసాగితే తనకి ముప్పు అని భావించిన షాయగు ప్రిగోజిన్ ని నమ్మించి దొంగ దెబ్బ తీసాడు. FSB షాయగు కి సహకరించింది. ఫలితంగా ప్రిగోజిన్ కి అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు పుతిన్.

విసుగు చెందిన ప్రిగోజిన్ నేరుగా తన అనుచరులని తీసుకొని మాస్కోకి వెళ్ళడానికి ప్రయత్నించగా అది తిరుబాటుగా భావించాడు పుతిన్. తరువాత ప్రిగోజిన్ ని చంపేశాడు పుతిన్. SO! పుతిన్ మూర్ఖత్వం వలన నిజం తెలుసుకునే అవకాశం కోల్పోయాడు. ఒకసారి ప్రిగోజిన్ తో మాట్లాడి ఉంటే వెంటనే తన రక్షణ మంత్రిని తీసేసి, ప్రిగోజిన్ ని అక్కడ కూర్చోబెట్టేవాడు పుతిన్.

**********************

నిన్న టర్కీలో రష్యాకి చెందిన టాప్ డిప్లొమాట్ అయిన నికోలాయ్ కార్బ్రీనేట్స్ హత్యకి గురయ్యాడు. టర్కీ రాజధాని అంకారాలోని టక్సిమ్ అనే ప్రాంతంలో నికోలాయ్ కాబ్రీ నెట్స్ మృత దేహాన్ని హోటల్ సిబ్బంది చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. రష్యా విదేశాంగ శాఖ తమ డిప్లొమాట్ అంకారాలో చనిపోయినట్లు ప్రకటించింది కానీ వివరాలు తెలపలేదు. టర్కీలోని రష్యా రాయబారితో చర్చలు జరపడానికి అనే నెపంతో నికోలాయ్ ని మాస్కో నుండి టర్కీకి పంపించి అక్కడ హత్య చేయించాడు పుతిన్.

**********************

రష్యాకి నార్త్ కొరియా సహాయం. ప్రస్తుతం రష్యన్ రక్షణ రంగ సంస్థలు తన ఆర్టిలరీకి కావాల్సిన షెల్స్ (shells) ని వేగంగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. దాంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు అయిన కిమ్ ని రష్యాకి ఆహ్వానించాడు పుతిన్. కిమ్ రైలు మార్గం ద్వారా మాస్కోకి చేరుకున్నాడు వారం కిందట. కిమ్ పుతిన్ మధ్య ఒక సహకార ఒప్పందం జరిగింది.

ఉత్తర కొరియా రష్యాకి సహాయం చేయడం ఏమిటీ?

**********************

152 mm, 155 mm shells కావాలని అడిగాడు పుతిన్. కిమ్ ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇంతకీ 152 mm,155 mm షెల్స్ ఉత్తర కొరియా తయారు చేస్తుందా? అబ్బే, కిమ్ కి అంత దృశ్యం లేదు. ప్రస్తుతం ఉత్తర కొరియా దగ్గర లక్షలాది షెల్స్ స్టాక్ ఉన్నాయి కానీ అవి ఒకప్పుడు రష్యా అమ్మినవే!

So! ఇప్పుడు మీరేమీ యుద్ధం చేయట్లేదు కదా? గతంలో మేము అమ్మిన షెల్స్ ఇస్తే మేము ఉక్రేయిన్ లో వాడుకుంటాము అని పుతిన్ అడిగాడు. కిమ్ ఇస్తానని ఒప్పకున్నాడు. పోయిన సంవత్సరం ఉక్రేయిన్ కూడా పాకిస్థాన్ నుండి 152, 155 mm షెల్స్ కొన్నది. రష్యా కనీసం 152mm, 155mm ఆర్టిలరీ షెల్స్ తయారుచేసుకునే స్థితిలో లేదు.

***********************

రండి, కలిసి కుట్టించుకుందాము! అతడు సినిమాలో కోట డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి బాగా సరిపోలుతుంది! నెల క్రితం పుతిన్ భారత్, చైనాలకి పిలుపినిచ్చాడు ! అదేమిటంటే .. Su-57,Su-75 (chek mate) జెట్ ఫైటర్స్ ప్రాజెక్ట్ ని మనం కలిసి అభివృద్ధి చేద్దామంటూ!

****************

2018-19 భారత్ రష్యాతో కలిసి FGFA ప్రోగ్రాంలో భాగస్వామిగా ఉంది. డిజైన్ విషయంలో HAL, SUKHOI ఇంజినీర్లు కలిసి చర్చలు జరిపారు. సుఖోయ్ ఇంజినీర్ల డిజైన్ కి దాదాపుగా 45 నుండి 50 వరకు మార్పులు చేయాల్సిందిగా HAL ఇంజినీర్లు కోరారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ అప్పటికే 580 కోట్లు చెల్లించింది సుఖోయ్ కి. మొదట సుఖోయ్ భారత్ అడిగిన మార్పులు చెయ్యడానికి ఒప్పుకుంది. 6 నెలల తరువాత HAL ఇంజినీర్లు మళ్లీ రష్యా వెళ్లి FGFA డిజైన్ ని పరిశీలించగా ఎలాంటి మార్పులు చేయలేదు. వివరణ అడగగా మీరు చెప్పిన 50 మార్పులు చేయాలంటే మరి కొంచెం డబ్బు చెల్లిచాలి అని అడిగింది సుఖోయ్.

మరి ఈ విషయం 6 నెలల కింద ఆడిగినప్పుడే చెప్పి ఉంటే అప్పుడే మా నిర్ణయం చెప్పేవాళ్ళం కదా అని HAL ఇంజినీర్లు అడిగితే సుఖోయ్ నుండి సమాధానం లేదు. దాంతో HAL ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలగింది 580 కోట్ల నష్టంతో. అదే సమయంలో SU-57 లని కోనమని అడిగింది సుఖోయ్. అప్పటికే ఒక ప్రోటో టైప్ SU57 తయారుచేసింది. దానిని పరిశీలించిన మన ఇంజినీర్లు SU57 లో చాలా డిజైన్ లోపాలు ఉన్నాయని కొనడానికి నిరాకరించారు.

*****************

తరువాత భారత్ స్వయంగా AMCA ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. మొదట 5TH జెనెరేషన్ అనుకుంటే ఇప్పుడు 5.5 జెనెరేషన్ గా రూపుదిద్దుకుంది.

2030 కల్లా మొదటి AMCA ప్రోటో టైప్ బయటికి వచ్చే నాటికి అది 6TH జెనెరేషన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక SU75 చెక్ మేట్ అనేది కూడా మన అవసరాలకి పనికిరాదు! దాని బదులు రెండు ఇంజిన్లతో తేజస్ మార్క్ 2 బెటర్ ఆప్షన్ అవుతుంది.

2021 లో మొదటి Su-75 checkmate ప్రోటో టైప్ రిలీజ్ చేసినప్పుడు నేను పోస్ట్ పెట్టాను. Su57, Su75 లని ఇంతవరకు ఏ దేశం కూడా కొనడానికి ముందుకు రాలేదు. Su-57 అనేది అమెరికన్ F-22 కి పోటీగా అని రష్యా పేర్కొంది కానీ ఎవరూ కొనలేదు. ఇప్పటి వరకు 12 Su-57లని మాత్రమే రష్యా తయారుచేసింది. వాటిలో ఒకటి ఉక్రేయిన్ లో కూలిపోయింది. Su-75 అమెరికన్ F35 కి పోటీగా పేర్కొంది రష్యా కానీ ఏ దేశం కూడా కనీసం ఎంక్వయిరీ చేయలేదు.

ఇప్పుడు భారత్, చైనాలని భాగస్వాములుగా ఉండండి అంటూ పుతిన్ అభ్యర్ధిస్తున్నాడు! ఇదేదో 2018 లోనే మనతో కలిసి పని చేసి ఉంటే ఈ పాటికి 5th జెనెరేషన్ ఫైటర్ జెట్ బయటికి వచ్చి ఉండేది! So! రష్యా ఆర్టిలరీ షెల్స్ కోసం ఉత్తర కొరియాని అభ్యర్ధిస్తున్నది. 5th జెనెరేషన్ ఫైటర్ జెట్ కోసం భారత్ చైనాలని అభ్యర్ధిస్తున్న సమయంలో ఇజ్రాయెల్, అమెరికాలని రెచ్చకొట్టే పని ఎందుకు చెసినట్లు? ప్రస్తుతం రష్యాని చూసి ఎందుకు భయపడాలి అంటే సుదూరం వెళ్లగల న్యూక్లీయర్ ICBM లు ఉన్నాయి కాబట్టి! పార్ట్4 CONT…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions