గోపీచంద్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం… నటనలో మెరిట్ ఉంది, మంచి నేపథ్యం ఉంది… కులముంది, గుణముంది, ఫిజిక్ ఉంది, అనుభవముంది… కానీ సరైన డైరెక్షన్ లేదు… ఫలితంగా నానాటికీ తీసికట్టులాగా రోజురోజుకూ కూరుకుపోతున్నాడు… ఫ్లాపుల్లోకి… ఫాఫం, ఇక లేవలేని దుస్థితిలోకి…
ఒకప్పుడు ప్రభాస్‌తో ఈక్వల్ ఇమేజీ… ఇప్పుడు ప్రభాస్ ఎక్కడ..? గోపీచంద్ ఎక్కడ..? ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు కూడా..! గోపీచంద్ సినిమా అంటేనే ఫ్లాప్… అదే ముద్ర… చాన్నాళ్లుగా… చాలా సినిమాలుగా…! కానీ లక్కీ ఫెలో… అవకాశాలు వస్తూనే ఉన్నాయి… ఒక రాజ్ తరుణ్‌కు కూడా వస్తున్నాయి, సో వాట్ అంటారా..? ఎస్, అదే నిజం…
ఒక్కటి… ఒక్క హిట్ చూసి ఎన్నేళ్లయింది గోపీచంద్..? దిక్కుమాలిన అవే పిచ్చి ఫార్ములా కథలు… అవే ఫైట్లు, అవే డాన్సులు… వీసమెత్తు ప్రయోగం లేదు, వైవిధ్యం లేదు… ఎవడో వస్తాడు, హీరో నువ్వే అంటాడు, ఏదో ఓ పిచ్చి కథ, ఏదో తిక్క ట్రీట్మెంట్… నటించామా, ఫినిష్ చేశామా..? అంతే… అదెలా నడిస్తే ఎవడికేం పట్టింది అన్నట్టుగా..!
Ads
అదే తలకుమాసిన జాబితాలో మరో సినిమా… పేరు విశ్వం… దర్శకుడి పేరు శ్రీను వైట్ల… ఒకప్పుడు సూపర్ హిట్ దర్శకుడు… తనకు వెన్నూదన్నుగా నిలబడిన ఎవరో కథ, డైలాగు రచయిత దూరమయ్యాడట కదా… అప్పటి నుంచీ శ్రీను వైట్ల జస్ట్, ఓ సాదాసీదా దర్శకుడు… పేరు గొప్ప… ఆ గోపీచంద్, ఈ శ్రీను వైట్ల… రెండూ ఫ్లాపుల పేర్లే… ఇద్దరూ కలిస్తే ఇంకేముంది..? మైనస్ ఇంటూ మైనస్ కాలేదు… మైనస్ ప్లస్ మైనస్ అయిపోయింది…
ఈ సినిమా మొత్తం అవుట్ డేటెడ్… ఒక గోపీచంద్ ఆలోచనలు, అడుగుల్లాగే… ఒక శ్రీను వైట్ల పతనావస్థలాగే… కావ్య థాపర్ ఉంటేనేం… అక్కడక్కడా పృథ్వి, వెన్నెల కిషోర్ స్కిట్స్ కాస్త పేలితేనేం… అసలు కథలో దమ్ముంటే కదా… జస్ట్, ఏదో పాత సినిమాలాగే ట్రీట్మెంట్… క్లైమాక్స్ చూశాక ప్రేక్షకులు ‘నీకేం ఖర్మ పట్టిందిరా గోపీచందూ’ అని తిట్టుకుంటూ వస్తుంటే… ఫాఫం అనాలినిపించింది…
ఇంకెన్నాళ్లు మిత్రమా..? హీరో బిల్డప్పులు, యాక్షన్ సీన్లు… రొటీన్ రొమాంటిక్ లవ్ స్టోరీ… ఇది థియేటర్‌కూ పనికిరాక… టీవీలు, ఓటీటీలకూ పనికిరాక ఎందుకు తీస్తున్నట్టు..? ఆ ఫ్లాప్ దర్శకులను పట్టుకుని ఇంకెన్నాళ్లు ఈ తిప్పలు..? నిజం చెప్పాలంటే ఇది విశ్వం అనే సినిమా రివ్యూ కానే కాదు… గోపీచంద్ విఫల ప్రస్థానం మీద ఓ లుక్… అంతే… ఏడ్వనీ, నవ్వనీ, అంగీకరించనీ, ఉడుక్కోనీ… రియాలిటీ మాత్రం ఇదే..!!
Share this Article