Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు టీవీల్లో డాన్స్ షోలు అంటేనే… అవి జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్లు…

May 2, 2024 by M S R

అఖిల్ సార్థక్… పేరు గుర్తుందా..? బిగ్‌బాస్ ఫేమ్… కొన్ని టీవీ షోలలో కూడా చేశాడు… కుండబద్ధలు కొట్టేశాడు టీవీ డాన్స్ షోల తీరుపై..! ప్రత్యేకించి స్టార్ మాటీవీలో వచ్చే నీతోనే డాన్స్ షో మీద చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగు… తనేమంటాడంటే..?

‘ఇప్పుడే ఓ ప్రోమో చూశాను… చాాలా దారుణంగా ఉంది… డ్యాన్స్ చేస్తే మార్క్స్ ఇవ్వరు… స్టంట్స్ చేస్తే చాలంటా… జడ్జ్‌లు వాళ్ల స్థాయికి తగ్గట్టుగా లేరు… ఇలా అంటున్నందుకు క్షమించండి… స్టార్ మా ఈ సారి పరువుతీసుకుంటోంది… ఫుల్ సర్కస్ షో అయింది… కంటెస్టెంట్ల తప్పేమీ లేదు… వాళ్లని ఎంకరేజ్ చేస్తున్న జడ్జిలదే తప్పు… డ్యాన్స్ షో డ్యాన్స్ షోలానే ఉంటే బాగుంటుంది… ఈ సారి జడ్జ్‌లు ఏమీ బాగా లేరు… ఇది నా అభిప్రాయం…’

నిజానికి టీవీ షోల మీద ఆధారపడేవాళ్లు ఇలా నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పడం అత్యంత అరుదు… నిజాలున్నా సరే, అంగీకరించరు, అంగీకరించినా బహిరంగంగా వ్యాఖ్యలు చేయరు… ప్రత్యేకించి అఖిల్ సార్థక్ బిగ్ బాస్ తరువాత స్టార్ మా ఆస్థాన కళాకారుడు కదా… ఐనాసరే, నిజాన్ని చెప్పాడు… కానీ సగమే చెప్పాడు… ఇంకా లోతులోకి వెళ్లలేదు, ఎందుకో మరి…

Ads

నిజానికి అఖిల్ సార్థక్ ఇదే స్టార్ మా టీవీలో బీబీ జోడి డాన్స్ షోలో తేజస్వితో కలిసి ఒక కంటెస్టెంటుగా డాన్సులు చేశాడు… తరువాత ఏమైందో ఏమో ప్రాక్టీసులో గాయమైంది అని దూరం జరిగాడు… బహుశా ఆ షో మార్కులు వేసే తీరు గట్రా నచ్చక తనే దూరం జరిగి ఉంటాడు… తాజా వ్యాఖ్యలు పరిశీలించినా అదే అనిపిస్తోంది…

ఇప్పుడు సెకండ్ సీజన్… దీనికి తరుణ్ మాస్టర్, సదా, రాధ జడ్జిలు… తరుణ్ మాస్టర్ వోకే, సదా చాన్నాళ్లు ఈటీవీ ఢీ షో జడ్జి… రాధ అనుకోకుండా దీనికి జడ్జి ఎందుకైందో తెలియదు..? సదా ఈటీవీ ఢీ షో నుంచి తప్పుకున్నాక ఇటు వచ్చింది… ఢీ షోలో ప్రణిత జడ్జిగా వచ్చినట్టుంది… కొన్నాళ్లు మానేసిన శేఖర్ మాస్టర్ మళ్లీ వచ్చాడు…

akhil

అసలు టీవీల్లో డాన్స్ షోలు అంటేనే… అవి జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్లు… డాన్సులే కావు… అన్ని భాషల్లోనూ అంతే… ఎవరెంత రిస్కీ ఫీట్లు చేస్తే వాళ్లకు అన్ని మార్కులు… చప్పట్లు… పైగా సినిమా పాటల్ని రీమిక్స్ చేసి, ఖూనీ చేసి వాడేస్తున్నారు… కంటెస్టెంట్ల మొహాల్లో ఫీలింగ్స్ ఏమీ ఉండవు… ఏదో జిమ్‌లో సాము చేస్తున్నట్టు ఉంటారు… దాన్ని మనం డాన్స్ అనుకోవాలి…

అది ఢీ అయినా సరే, నీతోనే డాన్స్ షో అయినా సరే… మరీ ఈటీవీ ఢీషో అయితే డాన్స్ తక్కువ, ఆ పోటీల నడుమ వచ్చే కామెడీ స్కిట్సే ఎక్కువ… అదీ ఓ కామెడీ షో అయిపోయింది… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు సమానమే…

అఖిల్ చెప్పినట్టు జడ్జిలదే తప్పు, కంటెస్టంట్ల తప్పేమీ లేదు… నిజానికి అదీ సగం నిజమే… ఎందుకంటే..? ప్రోగ్రాం నిర్వాహకులే జడ్జిలు, వాళ్లు చెప్పినవాళ్లే విజేతలు, ఫాఫం, జడ్జిల తప్పూ ఉండదు, వాళ్లూ నిమిత్తమాత్రులే… పాపులారిటీ, పర్‌ఫామెన్స్, వోటింగు… టీవీ షోలకు సంబంధించి ఇవన్నీ ఉత్త హంబగ్… సదరు షో డైరెక్టర్లు ఏది చెబితే అదే… పోనీలే, ఇన్నాళ్లకు ఒక్కడు నోరు విప్పి ఆ షోల డొల్లతనం గురించి మాట్లాడాడు… గుడ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions