Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘జస్ట్, ఏటా కోటి సంపాదిస్తే సరి… ఐనా ఆలోచించి పెళ్లికి వోకే చెబుతాను…’’

April 7, 2024 by M S R

ది గౌహతి టైమ్స్… ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడితే 7800 లైక్స్, 2100 కామెంట్స్, 695 షేర్స్… అంటే ఏ రేంజులో ఈ వార్త మీద డిస్కషన్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు… రకరకాల అభిప్రాయాలు, ఖండనలు, పెదవి విరుపులు, సమర్థనలు, అభినందనలు, ఆల్ ది బెస్టులు ఎట్సెట్రా… అదేమీ పెద్ద వార్త కాదు…

‘‘ఏడాదికి రూ.4 లక్షలు సంపాదించే ముంబైకి చెందిన ఒక కుటుంబం… అందులో ఒక 37 ఏళ్ల మహిళ… కోటి రూపాయలు సంపాదించే వరుడి కోసం వెతుకుతోంది… ఆ మహిళ ఆశలు, ఆకాంక్షల జాబితాను చూపించే స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… వరుడు ఉన్నత విద్యావంతుడు అయి ఉండాలి… సర్జన్ లేదా సీఏకు ప్రాధాన్యం ఇస్తుందట… వరుడు మరేదైనా రంగానికి చెందినవాడైతే కనీసం సీనియర్ పొజిషన్ లో ఉండాలి… వరుడు ఏడాదికి కనీసం కోటి రూపాయలు సంపాదిస్తూ ఉండాలి…

యూరప్, ముఖ్యంగా ఇటలీకి చెందిన వరులైతే బెటరట… మరాఠీ నుంచి ఇంగ్లిష్ లోకి అనువాదంతో పాటు స్క్రీన్ షాట్ ను ఎక్స్ (గతంలో ట్విట్టర్) యూజర్ అంబర్ పోస్ట్ చేశాడు… ఆమెకు తల్లి, చెల్లి, సోదరుడు ఉన్నారు… ఆమెకు తండ్రి లేడు… ఉద్యోగం రీత్యా బాలిక గత పదేళ్లుగా ముంబైలో ఉంటోంది… ముంబై వరులైతే ప్రయారిటీ ఇవ్వబడును…’’

Ads



సరే, ప్రతి ఒక్కరూ నీతా అంబానీలు కాలేరు, ముఖేషులు దొరకరు… పైగా ఇదేమీ జోక్ కాదు, నిజంగానే ఆడపిల్లల ఆకాంక్షలు ఇలాగే ఉన్నయ్… ఓ నాసిరకం కాలేజీలో బీటెక్ ఎలాగోలా పూర్తి చేసిన ఓ హైదరాబాదీ అమ్మాయి మొన్న ఏదో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ… 50 కోట్ల ఆస్తిపరుడు అయితే చాలు అని సింపుల్‌గా చెప్పింది.,. ఆమె ప్రస్తుతం 4 లక్షల ప్యాకేజీతో ఏదో చిన్న కొలువు చేస్తోంది… యావరేజీ అందం, కాస్త బరువు ఎక్కువే, కట్నం కూడా పెద్దగా ఏమీ ఇచ్చే సీన్ లేదు…

ambani(neeta and mukhesh marriage photo)

మరి 50 కోట్ల ఆస్తిపరుడు నిన్నెలా నచ్చాలి అనడిగితే… వచ్చినప్పుడే చేసుకుంటాను, పెళ్లి కోసం నేనేమీ ఆవురావురుమని లేను, పెళ్లయ్యాక పని కూడా చేయను అనేసింది… అందరూ ఆ రేంజులోనే కోరుకుంటూ ఉండకపోవచ్చు… కానీ ఆడపిల్లల డిమాండ్స్ మాత్రం ఓ లెవల్‌లో ఉంటున్నాయనేది నిజం… 30- 35 ఏళ్ల వరకూ అసలు పెళ్లిళ్లే జరగడం లేదు… పేరెంట్స్ కూడా దాన్నేమీ ఓ సమస్యగా భావించడం లేదు… (నిజానికి 30 ఏళ్లు దాటితే సంతాన సాఫల్యత, ప్రసవాలు కొంచెం కష్టం అంటారు మరి…)

ష్… కొన్ని కులాల్లో అబ్బాయిలు బోలెడుమంది, అమ్మాయిలు సరిపడా లేరు… అనివార్యంగా వేరే కులాలకు చెందిన అమ్మాయిల్ని ఎంచుకుంటున్నారు… మగపిల్లల పేరెంట్సే ఖర్చులు భరించి, పెళ్లి చేసుకుంటున్నారు తమ అబ్బాయిలకు… దాన్ని ఓ చిన్నతనంగా కూడా భావించడం లేదు… పైగా మేమే అన్ని ఖర్చులూ భరించి, మా ఊళ్లోనే ఘనంగా పెళ్లి చేస్తున్నాం, అమ్మాయి తల్లిదండ్రులు జస్ట్ కట్టుబట్టలతో పెళ్లికి వచ్చినా సరే అంటున్నారు… (మరీ కన్యాశుల్కం దాకా పోలేదు…)…

నిప్పులతో నిష్టల్ని, సంప్రదాయాల్ని, కులాల్ని, గోత్రాల్ని కడిగే కుటుంబాలు కూడా అనివార్యంగా కులాంతరాల్ని ఆమోదించి అక్షితలు చల్లాల్సి వస్తోంది… వెరీ గుడ్… మార్పు అనివార్యం… మార్పు మంచికే… పైన చెప్పిన ఉదాహరణలో ఆమెకు ఆల్రెడీ 37 ఏళ్ల వయస్సు దాటిపోతోంది… సో వాట్… ఆమెకే ఆందోళన లేదు కదా, మనకెందుకు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions