.
( గోపు విజయకుమార్ రెడ్డి
) …. ఒక పొడవాటి సూది ముక్కు కలిగిన ఒక యుద్ధ విమానం ఈ దేశ మూడు రంగుల జెండాను ప్రపంచం ముందు తల ఎత్తుకు ఎగిరేలా చేసింది… దాని పేరు MIG 21… ఈ యుద్ధ విమానానికి సెలవు… ఇంకా కచ్చితంగా చెప్పాలంటే… బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడటానికి, పాకిస్థాన్ వెన్నువిరవడానికి కారణం ఇదే యుద్ధ విమానం అంటే ఆశ్చర్యపోతాం…
ఒక్కసారి డిటైల్డ్ గా వెళ్దాం… అసలు ఏమిటి MIG కథా కమామిషు.., MIG అంటే Mikoyan- Gurevich” (మికోయాన్–గురేవిచ్) ఇది సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) లోని ఒక ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ బ్యూరో పేరు…
Ads
Artem Mikoyan (అర్టెం మికోయాన్) Mikhail Gurevich (మిఖాయిల్ గురేవిచ్) ఈ ఇద్దరు ఇంజినీర్లు కలిసి డిజైన్ చేసిన విమానాలకే MiG అనే పేరు వచ్చింది… MiG-21 1960ల్లో డిజైన్ చేయబడిన సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్…
- ఇప్పుడంటే దాన్ని అందరు ఫ్లయింగ్ కాఫిన్ (ఎగిరే శవపేటిక ) అంటున్నారు కానీ, ఒకప్పుడు ప్రపంచంలోని అత్యాధునిక ఫైటర్ జెట్లని తోక ముడిచేసింది… దాని పనితనం తెలుసుకోవాలంటే తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్ ) పుట్టుక టైంలో జరిగిన ఈ ఒక్క చిన్న స్టోరీ చాలు… మన జాన్ జిగిరి దోస్త్ రష్యా మనకిచ్చిన గిఫ్ట్ పవర్ ఏంటో తెలియాలంటే…
1971 డిసెంబర్… తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) గగనతలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) తన F-104 Starfighter జెట్లను మోహరించింది. ఇవి అమెరికా అందించిన సూపర్‌సోనిక్ ఫైటర్లు, ఆ కాలంలో చాలా ఆధునికమని పరిగణించేవారు…
అవి ఒక వైపు మన MIG 21 లూ ఒక వైపు... డాగ్ ఫైట్ (“Dogfight” అనే పదం యుద్ధ విమానాల మధ్య జరిగే సమీప గగనయుద్ధానికి వాడుతారు) మొదలయింది... ఒకరకంగా అమెరికా, రష్యా యుద్ధవిమానాల భీకర పోరాటం అది...
మన IAF ఫ్లైట్ లెఫ్టినెంట్ బిశ్ణు సింగ్ తన MiG-21లో పహారా కాస్తూ ఉండగా, రాడార్‌లో శత్రు Starfighter కనిపించింది… ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకుపోయారు.
Starfighter వేగంగా పైకి ఎగిరింది, MiG-21 వెనుకా దూసుకెళ్లింది… ఆకాశంలో రెండు మెరుపుల్లా ఒకదానికొకటి చుట్టుముట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాయి… అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మన విధుల్లో కుక్కలు పొట్లాడుకున్నట్టు.., అందుకే డాగ్ ఫైట్ అంటారు…
Starfighterకు వెనుకకు చేరి గన్ ఫైర్ చేయడం కష్టం… కానీ MiG-21కు ఒక పెద్ద ప్రయోజనం ఉంది — అత్యంత వేగంగా పైకి ఎగిరే సామర్థ్యం (Rate of Climb)…. బిశ్ణు సింగ్ తన MiG-21ని సడన్‌గా ఎత్తుకు లేపాడు. కొద్ది సెకన్లలోనే Starfighter కింద, తన టార్గెట్‌లో కనిపించింది. అతను R-3S ఎయిర్-టు-ఎయిర్ మిసైల్‌ను లాక్ చేశాడు…
- “Fox Two!” అని రేడియోలో చెప్పి బటన్ నొక్కాడు… మిసైల్ Starfighter వైపు దూసుకెళ్లింది… క్షణాల్లోనే పేలుడు శబ్దం ఆకాశాన్ని కుదిపేసింది… పాకిస్తాన్ ఫైటర్ అగ్నిజ్వాలల్లో కూలిపోయింది… ఈ విజయం కేవలం ఒక శత్రు విమానం కూల్చడమే కాదు — ప్రపంచానికి IAF శక్తిని చూపించిన ఘనత… అమెరికా ఇచ్చిన ఆధునిక ఫైటర్‌ను, సోవియట్ MiG-21 నడిపిన భారత పైలట్ ఓడించాడు… తూర్పు పాకిస్తాన్‌లో PAF వెన్ను విరిగిపోయింది.
భూసేనకు గగన సపోర్ట్ పూర్తిగా లభించింది… కేవలం 13 రోజుల్లో యుద్ధం ముగిసింది… ఒక కొత్త దేశం — బంగ్లాదేశ్ — పుట్టింది… ఇదే MiG-21 ఒక “ఫ్లయింగ్ కాఫిన్” అనే పేరుకి ముందుగా, “యుద్ధ విజేత” అనే గౌరవాన్ని సంపాదించిన నిజమైన కథ…
ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే… ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ తోపాటు పూర్వ ఎయిర్ చీఫ్ మార్షల్స్, మొన్ననే గగనతల యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లాతో సహా ఎందరో మహా మహా యుద్ధవీరులని అందించిన MIG 21, ఎక్కడైతే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందో (చండిఘర్ ఎయిర్ బేస్ లో శాశ్వత సెలవు తీసుకోవడం యాదృచ్ఛికం కాదు )
- నాణేనికి ఇంకోవైపు అప్పటి పాలకుల, మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ తర్వాత ప్రభుత్వాలు దేశ రక్షణ రంగం మీద చూపిన అలసత్వం ప్రపంచ మొనగాళ్లనే ఓడించిన MIG లను “Flying Coffin” / “Widow Maker” గా మార్చాయి…
1. 1963 నుంచి ఇప్పటివరకు దాదాపు 872 MiG-21 విమానాలు IAF వద్ద సర్వీస్ చేశాయి… వీటిలో 400+ కంటే ఎక్కువ క్రాష్‌లు జరిగాయి…
2. పైలట్ మరణాలు… సుమారు 200 కంటే ఎక్కువ పైలట్లు MiG-21 ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు… వీరిలో అనేకమంది యంగ్ ట్రైనింగ్ పైలట్లు కూడా ఉన్నారు, ఇవి సివిలియన్ మరణాలు కాక… అందుకే ఒకప్పుడు దేశ గగన తలాన్ని శత్రు దుర్బేధ్యంగా ఉంచిన మన MIG 21 లు ఇలా అప్రదిష్టతో సెలవు తీసుకోవడం ఒక విషాదం…
- కింకర్తవ్యం..? దాదాపు 200 MIG ఫైటర్ జెట్లను డిఫెన్స్ స్టార్టప్‌లకి ఇచ్చి, రక్షణ రంగంలో ఇన్నోవేషన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో అవసరం… అల్విదా పాంథర్ (ముద్దు పేరు)… జైహో MIG 21…
Share this Article