ప్రభుత్వం ఇచ్చే జాతీయ సినిమా అవార్డులు రాజకీయాలకు, నానా పైరవీలకు, రాగద్వేషాలకు, ఇతరత్రా ప్రలోభాలకు బాగా ప్రభావితం అవుతుంటాయని చాన్నాళ్లుగా వింటున్నదే… అసలు ఆస్కార్ వంటి అవార్డులే లాబీయింగుకు ప్రభావితం అవుతున్నాయంటే ఆఫ్టరాల్ కలుషితమైన మన ప్రభుత్వ వాతావరణంలో ఇచ్చే అవార్డులకు విలువేముందీ అంటారా..?
కాదు, కాస్తో కూస్తో ఫిలిమ్ ఫేర్ అవార్డులకు కాస్త విలువ ఉండేది… మరి ఎన్నాళ్లుగా ఇవీ కలుషితమయ్యాయో గానీ ఈసారి 2023 సినిమాలకు ప్రకటించిన అవార్డులను చూస్తే ఫిలిమ్ ఫేర్ కూడా ఆ రొంపిలోనే దిగబడిపోయి ఉన్నట్టు అనిపిస్తోంది… నిన్న సాంకేతిక ఇతర క్రాఫ్ట్స్ విభాగాల్లో అవార్డులు ప్రకటించారు కదా, మిగిలిన జాబితాను ఈరోజు ప్రకటించారు…
ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే… యానిమల్ సినిమాలో నటనకు గాను రణబీర్ కపూర్‌కు అవార్డు అట… అసలు ఆ సినిమాయే ఓ వెగటు సినిమా… అదొక పిచ్చి పాత్ర… ఆ పాత్ర పోషణలో పెద్ద మెరిట్ లేదు, అంత ఇంప్రెసివ్‌గానూ లేదు… వోకే, మరీ అంత తీసిపారేయలేం అంటారా..? శామ్ బహదూర్ సినిమాలో మాణెక్ షా పాత్ర అనితరసాధ్యంగా పోషించిన విక్కీ కౌశల్ ఉన్నాడుగా… తనకు కదా దక్కాల్సింది… చాలామంది విక్కీకి ఈ అవార్డు వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు… పోనీ, ఈసారి అవార్డుల కోసం పంపించిన జాబితాలో లేదా అంటే ఉంది… టెక్నికల్ అంశాల్లో మూడు అవార్డులు కూడా ప్రకటించారు నిన్న…
Ads
ఈసారి ఏమైందో ఏమో గానీ… అదే రణబీర్ కపూర్ భార్య అలియా భట్‌కు కూడా కిరీటం పెట్టారు… భార్యాభర్తలిద్దరికీ ఒకే ఏడాది ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు రావడం ఇదే మొదటిసారి కావచ్చు బహుశా… అలియాకు రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ సినిమాలో నటనకు అవార్డు ఇస్తున్నారు… సరే, అలియా నటనకు వంకపెట్టలేం, ఈ సినిమాలో బాగా నటించింది కూడా… (నిజానికి మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమా చేసిన రాణి ముఖర్జీ కూడా బాగా చేసింది… ఆమెకు క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డు ఇస్తున్నారు…)
మరి విక్కీ కౌశల్ మాటేమిటా..? ఉత్తమ సహాయ నటుడు అట… డన్కీ సినిమాలో ఓ పాత్ర చేశాడు కదా, అందులో నటనకు అట… డిస్‌గస్టింగ్… వోకే, ఉత్తమ చిత్రం 12 ఫెయిల్… గుడ్, స్పూర్తిదాయక సినిమా… దర్శకుడు విధు వినోద్ చోప్రాకు ప్రకటించారు… గుడ్, ఇంకా నయం… అవీ యానిమల్ జాబితాలో వేయలేదు…
ఇక్కడ మరో ప్రశ్న… ఉత్తమ నటుడు లేదా ఉత్తమ నటి అంటే లీడ్ రోల్స్ చేసి ఉండాలా..? ఇదేం ప్రాతిపదిక..? అలియా, రాణి ముఖర్జీలు వోకే కానీ అదే అలియాకు అవార్డు వచ్చిన రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీలో నటించిన షబానా ఆజ్మీ ఇంకా బాగా చేసింది… ఆమెకు జస్ట్, ఉత్తమ సహాయ నటి అవార్డు ఇస్తున్నారు… ప్చ్… ఫిలిమ్ ఫేర్స్ కూడా చివరకు మన నంది అవార్డుల్లాగే మారిపోయినట్టున్నాయి…!!
Share this Article