.
నిజం… కాంత సినిమాలో దుల్కర్ నటన చాలా బాగుంది… జోడీగా భాగ్యశ్రీ బోర్సే దీటుగా చేసింది… ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది… సముద్రఖని గురించి చెప్పడానికి ఏముంటుంది..? వంకలేమీ ఉండవు… సినిమాలో రానా కూడా ఉన్నాడు…
గుడ్… 195-60 బాపతు చెన్నైని తెరమీద దింపారు… ఆ కాలంలో షూటింగులు, స్టూడియోలు గట్రా కళ్లకుకట్టాయి… (రానా మాత్రం వర్తమానంలో ఉంటాడు అదేమిటో)…
Ads
మరి ఏం బాగా లేవు..? మొదటి నుంచీ చెప్పుకున్నట్టు ఇది తమిళ తొలి సూపర్ స్టార్ ఎంకెటీ అలియాస్ ఎంకె త్యాగరాజ భాగవతార్ బయోపిక్ కాదు… అంటే తన జీవిత సమగ్ర చిత్రణ కాదు… గురువు వంటి దర్శకుడికీ (ఎస్ఎం శ్రీరాములు నాయుడు) తనకూ నడుమ అహాల ఘర్షణ…

ఈ ప్రేమకథ కూడా ఎక్కువగా కల్పనే… సినిమా మొదట్లో మళ్లీ మహానటి చూస్తున్నట్టుగా ఉంటుంది… తరువాత కథ ఎటెటో వెళ్లిపోయి… ఓ హత్య తాలూకు ఇన్వెస్టిగేషన్ ప్రధానమైపోతుంది… నిజానికి జైలు శిక్ష తరువాత దర్శక గురువు, శిష్య హీరో జీవితాల్లో పెయిన్ ఉంది… ఘర్షణ ఉంది… అవి లేక సినిమా అసంపూర్ణం…
ఒక ఫిలిమ్ జర్నలిస్టు లక్ష్మికాంతన్ హత్య కేసు… ఈ ఇద్దరి జీవితాలనూ అగాధంలోకి తోస్తాయి… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… తెలుగువాళ్లకు ఆ తమిళ తొలి సూపర్ స్టార్ గురించి (ఎంకేటీ) తెలియదు… మరెలా తెలుగు ప్రేక్షకుడు కనెక్టవుతాడు..?

అసలు తెలుగులోనే కాదు, సినిమా బాగా రాలేదనే టాక్ వచ్చి, తమిళంలోనూ పెద్ద బజ్ రాలేదు రిలీజుకు ముందు… కనీసం కోర్టు కేసుతో కాస్త నెగెటివ్ పబ్లిసిటీ అయినా వస్తుందని అనుకుంటే అదీ రాలేదు… సినిమా అంత పకడ్బందీగా రాకపోవడానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కారకుడు…
ఎక్కడా ఏ సీన్ ప్రేక్షకుడిని కనెక్టయ్యేలా రాలేదు… బీజీఎం పూర్… పాటల గురించి పక్కన పడేయండి… లక్కీ భాస్కర్ కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, దుల్కర్ సినిమాా అంటే అభిమానించే తెలుగు ప్రేక్షకులున్నారు… సో, ఈ కాంత సినిమా తన జోరుకు మైనస్…

నిజానికి సరిగ్గా తీసి ఉంటే ఇప్పటికీ ఆప్ట్ కథ…. ప్రేక్షకులు, అభిమానుల చప్పట్లు విజిల్స్ మాత్రమే సినిమాను గట్టెక్కిస్తాయి, అలాగే తీయాలి అనే శిష్య హీరో… కాదు, కథ ప్రకారం వెళ్దామనే గురు దర్శకుడు… హీరోల పాదాల మీద నడుస్తున్న ఇండస్ట్రీలో… ఈ కంటెంటును సరిగ్గా ప్రజెంట్ చేస్తే బాగానే ఉండేదేమో…
ఈ సినిమా కథలో ప్రధానలోపం దర్శకుడి అహానికి కారణం తెలియకపోవడం, చూపకపోవడం… అసమగ్రంగా ఉండిపోయింది… దీనికితోడు దాదాపు మూడు గంటల సుదీర్ఘ నిడివి కూడా విసిగిస్తుంది.. అవునూ, ఇంతకీ ఆ హత్య ఎందుకు చేయబడుతుంది..? నీకేమైనా తెలుసా దుల్కర్… పోనీ, సముద్రఖనీ నీకైనా తెలుసా..? సినిమా కథలో కీలకంగా భావించే ఈ అంశమే నీరసంగా, పేలవంగా ఉంటే, ఇక సినిమాకు ప్లస్ మార్కులు ఎక్కడ పడతాయబ్బా..!!
అవునూ, సినిమాకు కాంత అనే పేరెందుకు పెట్టినట్టు..? శాంత కాదు, కాంత అని పెడదాం అని హీరో ఓచోట పట్టుబడతాడు, అందుకేనా..? ప్చ్, ఇవి కాంతారా రోజులు దుల్కర్, కాంతల రోజులు కావు..!!

Share this Article