.
ఫాఫం సింగర్ స్మిత… తెలుగులో అప్పట్లో తొలి పాప్ గాయని… తెలుగు సినిమా పాటల్ని తనదైన స్టయిల్‌లో రీమిక్స్ చేస్తూ, తనే ఆడుతూ, తనే పాడుతూ వీడియోలు చేసేది… అప్పట్లో పాపులర్… మసకమసక చీకటిలో పాట మరీ హిట్…
కానీ క్రమేపీ కొన్ని బ్యూటీ క్లినిక్కులు, ఫిట్‌నెస్ వ్యాపార కేంద్రాలు తెరిచింది… అలా బిజీ అయిపోయింది… ఆమధ్య టాక్ షోలు కూడా చేసింది… అలా సొంత వీడియో ఆల్బమ్స్‌కు గ్యాప్ వచ్చింది… మొన్న చెప్పింది ఏమనీ అంటే..?
Ads
‘నేనెక్కడ ఆపానో తెలుగు ఇండిపెండెంట్ పాప్ సంగీతం అక్కడే ఆగిపోయింది… నేను మళ్లీ స్టార్ట్ చేస్తున్నాను, దేశవిదేశాలు తిరుగుతాను..’’ సేమ్, తనే ఆడాలి, తనే పాడాలి, తోడుగా నటుడు నోయల్… అప్పటికన్నా ఈసారి ర్యాప్, పాప్ జుగల్‌బందీ… భారీ వెస్టరన్ ఆర్కస్ట్రయిజేషన్…
ఓ పాట కూడా రిలీజ్ చేసింది… సర్లే, అదేమీ ఇంప్రెసివ్ ఏమీలేదు… ఇది గతంలో విన్న మసకమసక రీమిక్సేనా అనిపించింది… అదంతా కట్ చేస్తే… ఈసారి మన్నేల తింటివిరా కృష్ణా పేరిట భీమవరం సంక్రాంతి స్పెషల్ అని మరో వీడియో రిలీజ్ చేసింది…
ఇదైనా కాస్త బాగుంటుందేమో అనుకుంటే… అసలు ఆ పదాలు అర్థం కావడమే గగనం… భారీగా డాన్సర్లు కమ్ ఎక్సట్రా ఆర్టిస్టులు… చిత్రవిచిత్ర వేషధారణ… అసలు మన్నేల తింటివిరా కృష్ణా అనే వాక్యాన్ని ఈ పేకాట పాటకు వాడుకోవడమే అబ్సర్డ్…
మధ్యలో రఘురామ కృష్ణంరాజు వచ్చి, స్టెప్పులేశాడు, మీసం మెలితిప్పాడు… హేమిటో… తనే స్పాన్సర్ చేశాడా ఈ పాటను..? అసలు మధ్యలో తనెందుకు దూరాడు..? స్మితను చూసి నవ్వుకోవడం తప్ప మరేమీ లేదు…

అన్నట్టు స్మితా… ఈ పిఠాపురం సంక్రాంతులు, ఈ భీమవరం సంక్రాంతులు అంటే పేకాటలు, కోళ్ల పందేలు… ఈ ఆర్ఆర్ఆర్ మీసాలు కాదమ్మా… సంక్రాంతి అంటే ఏమిటో నీకు ఇంత వయస్సొచ్చినా అర్థమైనట్టు లేదు…
నీ మలి పాప్ ప్రయాణం మొదట్లోనే ఈ తప్పుటడుగులు వేస్తే… రాబోయే రోజుల్లో ఆదరణను ఎలా ఆశించగలవ్… చిన్న చిన్న ఆర్టిస్టుల జానపద గీతాల వీడియోలే మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తున్న రోజుల్లో… నీ వీడియోకు ఎన్ని వ్యూస్ రావాలి అసలు..?
జస్ట్ 4 లక్షలు… నేను చూసేటప్పటికి నే వీడియోకు వ్యూస్… అర్థమైందా..? నీ మలి జర్నీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటున్నదో……, ఈ రోజుల్లో పాప్, ర్యాప్, రీమిక్స్ అంటే… ఇది మాత్రం కాదు అని ప్రేక్షకులు చెబుతున్నారు…
Share this Article