ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే..? చిరంజీవి మెచ్చుకున్నాడా, బ్రహ్మానందం మెచ్చుకున్నాడా, ఇంకెవరో మెచ్చుకున్నాడా అని కాదు… ఇండస్ట్రీలో హిపోక్రటిక్ పొగడ్తలుంటయ్, పైగా గెటప్ శ్రీను కొన్నాళ్లుగా చిరంజీవితో కొంత జర్నీ ఉంది, జనసేనకు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశాడు… ఆ కథ వేరు…
అబ్బే, నేను పాత్ర కోరుకున్నాను తప్ప, హీరో కావాలని కోరుకోలేదు అనే స్టేట్‌మెంట్ కూడా తన అణకువను చెబుతోంది, గుడ్… కానీ ఎప్పుడైతే ఒక పార్టీకి, ఒక నాయకుడికి అనుకూలుడని ముద్ర పడుతుందో, వెంటనే ఆ ప్రత్యర్థి వర్గానికి టార్గెట్ అవుతారు ఎవరైనా… అసలే ఏపీ పాలిటిక్స్ కులజాఢ్యంతో కుళ్లిపోతున్న దశ ఇది… జనసేన ఫాలోయర్ అనేసరికి వైసీపీ బ్యాచ్ అంతా నెగెటివ్ అయిపోతారు, థియేటర్‌కు వెళ్లరు, పైగా నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తారు…
పైగా జబర్దస్త్ వేరు, ఏడెనిమిది నిమిషాల స్కిట్‌లో ఏవేవో వేషాలు వేయడం వేరు… పేరడీ స్కిట్లు వేరు… కానీ మొత్తం తానై ఓ సినిమాను భుజాలపై మోయడం వేరు… తేడా ఉంది… పైగా ఒకసారి హీరో అని ఫోజులు కొడితే ఏం జరుగుతుందో కమెడియన్ సునీల్ దగ్గర నుంచి చాలామంది చెబుతారు… అంతెందుకు ఇదే గెటప్ శ్రీను జాన్ జిగ్రీ దోస్త్ సుడిగాలి సుధీర్‌ను అడిగినా చెబుతాడు…
Ads
సుధీర్ తను స్వయంగా హీరో అయినా సరే… ఆహా ఓటీటీ, ఈటీవీ వంటి చానెళ్లలో హోస్టింగ్ మాత్రం వదలడం లేదు… తన రూట్స్ తెలుసు, ఫోజులు కొడితే ఫ్యూజులు ఎగిరిపోతాయనీ తెలుసు… రాజు యాదవ్ అనే సినిమాకు వస్తే… గెటప్ శ్రీను చూసుకోలేకపోయింది ఏమిటంటే… ఈ సినిమా కథ, కథనం గట్రా మొన్నామధ్య హిట్టయిన బేబీ సినిమాలాగే ఉంటోందని…
నిజమే, ఎంత విగరస్ ప్రమోషన్లు చేసినా సరే, సరుకులో దమ్ముండాలి కదా, పైగా మొన్నమొన్ననే హిట్టయిన సినిమాలాగే ఉందంటే ఎవరు థియేటర్‌కు రావాలి… ఓ కమెడియన్‌గా మెప్పించడం వేరు, ఓ హీరో పాత్రలో అన్నిరకాల ఎమోషన్లు పలికించడం వేరు… ప్చ్, నిరాశపరిచావు శ్రీను… Sorry to say, you are not up to the mark…
డాక్టర్ల పొరపాటో, మన హీరో గారి గ్రహపాటో… (సరిగ్గా కుట్లు వేయకపోతే ఎప్పుడూ నవ్వుతూ కనిపించేలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా… అబ్బ ఛా…) హీరో గారికి ఎప్పుడూ నవ్వు మొహం తప్పదు కథ ప్రకారం… దాంతో వచ్చే కష్టాలు, పరిష్కారాలే ఈ సినిమా కథ…
సరే, ఏదో ఓ కథ… జనానికి బాగా తెలిసిన కమెడియన్‌ను హీరోను చేస్తున్నాం కదా, కాస్త ఎలివేట్ చేసేలా సీన్లు గట్రా చూసుకుందాం అనే సోయి దర్శకుడికి లేకపోయింది… పైగా ఓవర్ డ్రామా సరేసరి… క్లైమాక్స్ అయితే మరీ పేలవం… హీరో గెటప్ శ్రీనుకన్నా తండ్రి పాత్ర చేసిన ఆనంద చక్రపాణి మొత్తం నటసిబ్బందిని డామినేట్ చేశాడు…
వెరసి స్థూలంగా గెటప్ శ్రీనుకు ఓ తీవ్ర నిరాశ… అవునూ, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌ల్లో ఇద్దరు హీరోలైపోయారు, ఇక రాంప్రసాద్ డైరెక్టర్ కాబోతున్నాడట… రాంప్రసాద్ ఒకటే సలహా… సినిమా తీయాలి, కానీ ఖచ్చితంగా ఈ రాజుయాదవ్‌లా మాత్రం కాదు… బెస్టాఫ్ లక్… హీరోయిన్ అని చెప్పబడిన ఆమె పేరు చస్తే గుర్తుకురావడం లేదు… సారీ..,!!
Share this Article