చాన్నాళ్లయింది కదా తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్ గురించి చెప్పుకుని… ఎన్నికల సీజన్ కదా… అన్ని చానెళ్లూ బిజీ బిజీ… ఇప్పుడు గిరాకీ ఎక్కువ కదా…! కొన్ని ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్స్ కనిపిస్తున్నాయి…
ఈమధ్య ఎన్టీవీ, టీవీ9 గుంపు ఇంటర్వ్యూల మీద మోజు చూపిస్తున్నాయెందుకో… ఒకటేమో తన వారితోనే ప్రశ్నలు అడిగిస్తుంటే మరొకటి వేరేవాళ్లనూ తీసుకొచ్చి అడిగిస్తోంది… ఎందుకోగానీ జర్నలిస్టు సర్కిళ్లలో కూడా దీనిపై పెద్ద పాజిటివ్ టాక్ వినిపించడం లేదు…
ఇంటర్వ్యూయర్ గట్టివాడైతే ఒక్కడు చాలు, అవసరమైన అన్ని ప్రశ్నలూ సంధించడానికి..! సరే, అందరూ రాధాకృష్ణలు కాలేరు… రవిప్రకాష్‌లూ కాలేరు… రవిప్రకాష్ అనగానే గుర్తొచ్చింది, ఆర్టీవీ తెర మీద రవిప్రకాష్ మళ్లీ కనిపిస్తున్నాడు… వస్తున్నా వస్తున్నా అంటూ ఇన్నాళ్లూ చెప్పాడు, ఇక వచ్చేశాడు… ఆ పాత రవిప్రకాష్ కనిపిస్తాడో లేదో కొంత వెయిట్ చేసి చూడాలి…
Ads
ఈ జాబితాలో హెచ్ఎంటీవీ పేరుంది గానీ జీరో రేటింగ్స్ చూపిస్తున్నారు… ఈమధ్య ఈ చానెల్ లేడీ సీఈవో కూడా రిజైన్ చేసిందని సమాచారం… ఐనా బార్క్‌కు డబ్బు కూడా కట్టలేదేమో, అందుకేనా ఈ జీరోలు.,. మరీ పదిలోపు రేటింగ్స్ ఉన్న మహాన్యూస్ ఐన్యూస్, రాజ్ న్యూస్ సంగతి ఎలా ఉన్నా… అంతటి ఈటీవీ తెలంగాణ చానెల్ సైతం వాటితోనే పోటీపడుతోంది ఫాఫం…
ప్రస్తుత భవనం ఖాళీ చేయాలనే ఒత్తిళ్లతో టీన్యూస్ వేరేచోటకు వెళ్తుందన్నారు, వెళ్లిందో లేదో తెలియదు గానీ… బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినట్టే, ఆ పార్టీ వాయిస్ టీన్యూస్‌ను కూడా జనం పెద్దగా ఆదరించడం లేదు… మరీ తొమ్మిదో ప్లేసులో కనిపిస్తోంది… రెండు రాష్ట్రాల్లోనూ ఉనికి ఉన్నా సరే, ప్రధానంగా తెలంగాణ చానెల్ అని పేరున్న వీ6 మరీ ఏడో ప్లేసులో కనిపిస్తోంది…
మరీ హైదరాబాద్ మార్కెట్‌లో చూసినా అది ఆరో ప్లేసు… టీన్యూస్ నాలుగో ప్లేసు… ఇంట్రస్టింగు… ఎప్పటిలాగే నంబర్ వన్ ప్లేసు ఎన్టీవీ, టీవీ9 మధ్య దోబూచులాడుతోంది… ఓసారి అది, ఓసారి ఇది… మొత్తానికి భలే ఫైట్… కాకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో టీవీ9 చానెల్‌దే ఆధిపత్యం, ఎన్టీవీ అయిదో ప్లేసు అట…
టీడీపీ వాయిస్ టీవీ5 చానెల్‌ను వైసీపీ వాయిస్ సాక్షి టీవీ నాలుగో ప్లేసుకు పడేసి, తను మూడో ప్లేసులోకి రావడం కొంత ఇంట్రస్టింగే… జనం రాజకీయ వార్తలు ఎక్కువగా చూస్తుంటారు కదా… ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా పర్లేదు… వాటి ప్లేసులు ఏమిటనేది గాకుండా వాటిని జనం బాగానే చూస్తున్నారనేది ఇంపార్టెంట్…
చివరగా మరో ఇంపార్టెంట్ విషయం… ఆమధ్య చాలా ఏళ్ల తరువాత తప్పనిసరై కేసీయార్ టీవీ9 మెట్లు ఎక్కి 240 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా… అవసరం, అనివార్యం… యూట్యూబ్ రికార్డుల్ని బద్దలు కొట్టింది అని ధూంధాం సోషల్ మీడియాలో హోరెత్తించారు కదా… సింహం ఇంటర్వ్యూ అసలు లెక్కలు వచ్చేసరికి తుస్ అన్నట్టుంది… పైగా అంతా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అన్నట్టుగా సాగింది… రజినీకాంత్ ఎప్పుడూ రాధాకృష్ణ కాలేడు, రవిప్రకాష్ కాలేడు కదా…
ఈ ఇంటర్వ్యూకు టీవీఆర్ జస్ట్, 0.22 మాత్రమే… జీఆర్పీ లెక్కల్లో 1.74… రెండింటి కాలిక్యులేషన్స్ వేరు, స్థూలంగా… జర్నలిస్టులు, పొలిటిషియన్స్, బ్యూరోక్రాట్లు కొందరు ఎలాగూ చూస్తారు, కానీ సగటు ప్రేక్షకుడు దీన్ని పెద్దగా పెట్టించుకోలేదు అని అర్థం చేసుకోవాలా..!!
Share this Article