Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుమా… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు కదా…

January 7, 2023 by M S R

వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్య ట్రెయిలర్ బాగుందని చిరంజీవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు గానీ, సుమ అడ్డా అనే ఈటీవీ షో ఆ సంతోషానికి పంక్చర్ చేస్తుందేమోననే కొత్త భయం పట్టుకుంది వాళ్లకు… ఓవైపు ప్రిరిలీజ్ వార్తలు, తరుముకొస్తున్న రిలీజ్ తేదీ, ఈలోపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల హడావుడి నడుమ చిరంజీవి సుమ అడ్డా అనే షోకు చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే కదా… ఆ చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో చూస్తే బాగానే ఉంది…

చిరంజీవి తనదైన శైలిలో కాస్త హ్యూమరస్‌గా షో రక్తికట్టించినట్టు కనిపిస్తోంది… కానీ ప్రోమోలకూ ఎపిసోడ్లకూ సంబంధం లేని కాలమిది… అదీ భయం… ఎందుకంటే… ఫస్ట్ ఎపిసోడ్ కల్యాణం కమనీయం సినిమా నటులతో చేసింది సుమ… అందులో దర్శకుడు, హీరో, హీరోయిన్‌తోపాటు అందులో నటించిన సద్దాం కూడా పాల్గొన్నాడు… స్థూలంగా బాగానే ఉంది గానీ… వీసమెత్తు కొత్త క్రియేటివిటీని చూపలేకపోయాడు ఆ షో దర్శకుడు ఎవరో గానీ…

క్యాష్, వావ్, స్టార్ మహిళ తదితర ప్రోగ్రాములను మిక్సీలో వేసి… బయటికి తీసి, ఫిల్టర్ చేసి… దానికి శ్రీదేవి డ్రామా కంపెనీని, జబర్దస్త్‌ను కలిపితే ఎలా ఉంటుందో… సుమ అడ్డా కూడా అలాగే ఉంది… స్థూలంగా చూస్తే కపిల్ శర్మ కామెడీ షోను కాపీ కొట్టే ప్రయత్నం భంగపడినట్టే కనిపిస్తోంది… అదీ చిరంజీవి ఫ్యాన్స్ భయం… ఆ మొదటి ఎపిసోడ్‌లాగే చిరంజీవి ఎపిసోడ్ చిత్రీకరించారేమో అని ఆ భయం… ఆ భయానికి మరో కారణం ఉంది…

Ads

suma

మామూలుగా తోటి నటీనటులతో కలిసి సుమ మార్క్ షోలలో అల్లరి చేయడం వేరు… ఆమె కూడా ఎక్కడా తొట్రుపడదు… ఎవరి గౌరవానికీ ఢోకా ఉండదు… కానీ ఇప్పుడు సుమ అడ్డా ఫార్మాట్ కాస్త ఇబ్బందికరంగా ఉంది… ఫస్ట్ ఎపిసోడే తీసుకుంటే… ప్రవీణ్ అనే జబర్దస్త్ కమెడియన్ వచ్చాడు… పొట్టి నరేష్‌కు తోడుగా మరో ఇద్దరు పొట్టి నటులు కనిపిస్తూ చికాకు పెడుతున్నారని మనం అనుకున్నాం కదా… సుమ అడ్డా షోలో కూడా వాళ్లు ప్రవేశించారు…

వస్తే వచ్చారు, ఒకడు ప్రవీణ్ లుంగీలో నుంచి బయటికి వస్తాడు… వాళ్లు మాట్లాడేది ఎవడికీ అర్థం కాదు… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్‌లో కూడా ఉంటారా వీళ్లు..? మరో సందర్భంలో మరో కమెడియన్ సత్యశ్రీ, ఇంకో మేల్ కమెడియన్ కలిసి వచ్చారు… చివరకు సుమ అడ్డాను శ్రీదేవి డ్రామా కంపెనీగా చేయబోతోందా సుమ… కపిల్ శర్మ షోలో కూడా ఇలా వేర్వేరు కమెడియన్లు వచ్చి షోను ముందుకు నెడతారు… వాళ్లెవరూ కపిల్ శర్మకు తీసిపోరు, కాబట్టి బోర్ కొట్టదు… మరి ఇక్కడ..?

చిరంజీవి ఎపిసోడ్‌లో వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు… లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్‌లా కనిపించింది ఒకావిడ… సుమా, పర్లేదు కదా, చిరంజీవి ఇజ్జత్ అయితే తీయలేదు కదా…! రానురాను హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఇందులో కూడా దూరరు కదా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions