Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!

September 17, 2025 by M S R

.

మన తెలుగు సినిమా జర్నలిస్టుల సంగతి తెలిసిందే కదా… అఫ్‌కోర్స్, అన్ని భాషల సినిమా జర్నలిస్టులూ అంతే అనుకొండి… అప్పుడప్పుడూ మనవాళ్లు వేసే ప్రశ్నలు ఎంత హాస్యాస్పదంగా మన పరువే ఎలా తీస్తుంటాయో మనం చెప్పుకున్నాం కదా పలుసార్లు…

కానీ పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల జోలికి పోరు… చిన్న నటులు, చిన్న నిర్మాతలపైనే మన ప్రతాపం… మంచు మోహన్‌బాబు వంటి పెద్దతలకాాయల జోలికి వెళ్లమనండి… నో… నెవ్వర్…

Ads

తమకు సంబంధం లేని అంశంలో వేణుస్వామిపై మహిళ కమిషన్‌కు ఫిర్యాదు, ఆమధ్య ఏదో సినిమాలో వారణాసిలో విలనీ సీన్లు చిత్రించడంపైనా తప్పుపట్టే, నిగ్గదీసే ప్రశ్నలు… ఇలాంటి వివాదాల్లో ఓ జర్నలిస్టు కనిపిస్తాడు…

తను మంచు లక్ష్మిని ఓ ప్రశ్న అడిగాడు… 50 ఏళ్లు దగ్గరపడుతున్న మహిళ, పన్నెండేళ్ల బిడ్డ కూడా ఉన్న ఓ తల్లి డ్రెస్ సెన్స్, డ్రెస్ మీద విమర్శ రాదా అని నేరుగా అడిగాడు… ఆమెను ఉద్దేశించే… ‘మంచు లక్ష్మే అలా డ్రెస్ చేసుకుంటే ఇతరులూ అనుసరిస్తారు కదా’ అనే అర్థమొచ్చే వివరణ కూడా… ఆమె వస్త్రధారణ శైలిని, ధోరణిని నేరుగా తప్పుపట్టడం…

వెంటనే ఆమె స్ట్రెయిట్, దీటైన ఘాటు జవాబు… ‘ఒక మగాడ్ని ఈ ప్రశ్న వేయగలరా..? ఈ ప్రశ్న వేయడానికి ఎంత ధైర్యం..? మీలాంటి జర్నలిస్టులే ఇలా అడిగితే బయట జనమూ చూసి నేర్చుకుంటారు… ఒక జర్నలిస్టుగా రెస్పాన్సిబుల్‌గా వ్యవహరించాలి కదా…’’ అని దడదడా దులిపేసింది…

ఈ ధాటికి సదరు జర్నలిస్టు విధేయత, అణకువ, వినమ్రతతో ఏదో చెప్పబోయాడు… చివరకు మగవాళ్లను ఆ ప్రశ్న అడగను అని చేతులెత్తేశాడు అంతటి సీనియర్ జర్నలిస్టు… ఆమె నేరుగా అడిగిన ప్రశ్న ‘‘ ఇదే ప్రశ్న మహేష్ బాబుకు వేయగలరా..? 50 ఏళ్లు వచ్చాయి, చొక్కా విప్పుకుని తిరుగుతావా అని అడుగుతారా..?’’

మగవాళ్లను ఈ ప్రశ్న వేయలేడట… మంచు లక్ష్మి కాదు, కంచు లక్ష్మి… సో, వాట్… ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నే తప్పు అనుకున్నప్పుడు నిస్సంకోచంగా ఏమటీ ప్రశ్న అని దులిపేసింది… ‘‘అయ్యో, నా సినిమా వస్తోంది, వీళ్లంతా పగబడితే ఎలా’’ బాపతు సందేహాలేమీ పెట్టుకోలేదు… (అప్పట్లో ఇలాంటి ప్రశ్నకే వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్ మగ క్రికెటర్లకు ఈ ప్రశ్న వేస్తారా అనడిగిన తీరు గుర్తొచ్చింది…)

అయినా కోట్లు ఇచ్చినా మహేష్ బాబు చొక్కా విప్పి తిరగడు , అది వేరే సంగతి…

‘‘అసభ్య వస్త్రధారణ అనిపిస్తే మహేశ్ బాబునైనా ఈ ప్రశ్న అడగగలను’’ అనే సమాధానం గనుక ఆ జర్నలిస్టు ఇచ్చి ఉంటే జర్నలిజం పరువు కాపాడినవాడయ్యేవాడు..!! కానీ అంత సీన్ ఉందా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…
  • రేప్పొద్దున విలేకరులకు ఇంకేం జరిగినా ఇంతేనా ఈనాడూ..?!
  • చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions