Hari Krishna MB…………… అయ్యప్పనుమ్ కోషియుమ్.. మలయాళం కాబట్టి అన్నీ బాగుండాలని ఏం లేదు.. చాలా చెత్తగా తీసిన ‘మరక్కార్’ మూవీ ఆస్కార్ కి వెళ్ళింది… పరమ బోరింగ్ మూవీ… ఆస్కార్ అనేదేమీ గొప్ప స్థాయి కాదు… just చెప్తున్నా…[అమెరికా వాళ్ళు తీసే ప్రతి చెత్త war movie కి దండిగా awards వస్తాయి]..
అయినా మరక్కార్ లాంటి మూవీ అక్కడి వరకూ ఎలా వెళ్లిందా అని.. last year వెళ్లుంటే The Great Indian Kitchen వెళ్లి ఉండాలి.. అదైతే universal subject.. చాచి కొట్టి ఉండేది మనోభావాల్ని..
—
Ads
అయ్యప్పనుమ్ కూడా గొప్ప మూవీ ఏం కాదు.. కేవలం ఆ ఇద్దరి mannerisms వల్ల బాగుందన్న ఫీలింగ్ వస్తుంది.. ఇలాంటి sensitive story ని handle చెయ్యడం చాలా కష్టం.
ego clash అన్న point మీద ఇద్దరినీ బాలన్స్ చేస్తూ పోవడం మన regular సినిమాల్లో చూడము.. జల్సా అనే సినిమా లో ఇలాంటి లైన్ ఉన్నా అది protagonist – antagonist fight కాబట్టి డ్రామా తీసుకురావం easy … ఒకరు మంచి ఒకరు చెడు కాకుండా ego ను establish చేసి screen play build చెయ్యడం డ్రామా పండించడం చాలా శ్రమ తో కూడుకున్న పని..
అయ్యప్పనుమ్ లో ఒకరు మంచి ఇంకొకరు చెడు కాదు… ఇద్దరు సామాన్యుల మధ్య ego clash…
పృథ్వీ రాజ్ పర్సనాలిటీ లేకుంటే ఆ క్యారెక్టర్ కి life లేదు.. అసలు సినిమా నే లేదు.. వీధి లో పులి లా కనిపించే మనిషి ఇంట్లో పిల్లి లా నాన్న చేత తిట్లు తినడం ఆ క్యారెక్టర్ ని low చెయ్యడమే.. అంత మహా మనిషి ని నాన్న అంతలేసి మాటలు అంటుంటే ఇతని reciprocation కానీ consequential drama కానీ ఏమీ ఉండదు… అసలు వాళ్ళ నాన్న అతన్ని ఎందుకు తిడుతుంటాడో కూడా establish చెయ్యలేదు..
అదే police క్యారెక్టర్ కి కొంత establishment అయినా ఉంది… అతని వైఫ్ character లో intensity ఉంది… ఆ intensity కోషి కి miss అయ్యింది… ఇన్ని సమస్యల మధ్య కోషి బ్రేక్ అయిపోయి ఎప్పుడైనా బాధ పడతాడా అంటే అదీ లేదు..
(ధీరోదాత్తుడు break అవ్వడం చూడాలి అంటే.. Saving Private Ryan లో టామ్ హాంక్స్ ను చూడాలి… కడుపారా ఏడ్చే సీన్ వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది)
పోలీస్ పాత్ర ఎక్కడ కూడా down కాదు.. కానీ కోషి పాత్ర మాత్రం చాలా చోట్ల down అవుతుంది… అసలేం establish చెయ్యాలనుకున్నారో ఒక్క ముక్క అర్థం కాలేదు..
అయ్యప్ప మీద మనకూ ఎప్పుడూ సానుభూతి ఉంటుంది ఈ సినిమా లో.. కానీ కోషి మీద ఆ సానుభూతి రాకపోవడం story deparment mistake … ఏదో కారణం వల్ల అతను అలా ప్రవర్తిస్తున్నాడు అని మనకు చెప్పలేకపోవడం ఈ cinema లో drawback ..
ప్రతి పాత్ర కూ ఒక base ఉండాలి కదా… ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఎవరైనా ఎందుకు ఒకలా, ఇంకోలా ప్రవర్తిస్తారు..
—
పైగా ఒక చిన్న station లో ఒక చిన్న SI ని అంత పెద్ద రాజకీయ నాయకుడు manage చేయలేకపోవడం అది రెండుగంటల సినిమా మొత్తం ego war లా నడవడం very thin line of game … ఎత్తు కు పై ఎత్తు పడుతూ పోవాలి fast గా…
ఇలాంటి డ్రామా నే మృగరాజు అనే కాపీ సినిమా లో ప్రయత్నించారు తెలుగు లో.. సినిమా పోయింది.. సరిగ్గా తీయలేదు.. పైగా చిరంజీవి అంతటి మనిషి ఒక పులి ని చంపడానికి రెండున్నర గంటల డ్రామా అంటే ఎలా? ఏదో ఒక fight లో అంటే ఒకే కానీ..
—
రెండు సమాన స్థాయి characters మధ్య ego clash నడపాలి అనే subject మీద Chris Nolan అద్భుతం ఆవిష్కరించాడు.. The Prestige రూపం లో… ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి ఆ పాత్రలు తొక్కే దారులు, చేరే low levels .. ఎలా అయినా అవతలి వ్యక్తి ని తొక్కెయ్యాలనే కసి… ఆ కసి కి తోడు వారు పడే ఆవేదన, కష్టం .. అన్నీ అద్భుతం గా establish చెయ్యడం.. అలాంటి movies చూసైనా నేర్చుకోవాలి మనవాళ్ళు..
—
AK లాంటి సినిమా ను తెలుగు లో తీయడం అంటే foolishness .. పైగా రానా లాంటి diction, screen presence ఉన్న మనిషిని పెట్టడం అంటే చాలా రిస్క్…అవతలి మనిషి ఇంకా బలంగా ఉండాలి.. లేకుంటే పేలిపోతారు.. ఈ సినిమా OTT లో వస్తే ఎప్పుడైనా చూస్తానేమో.. but remake కి చాలా bad pick .. రీమేక్ చెయ్యాలకుంటే మామూలు good bad conflict గా మార్చుకుని తీసుకుంటే అయిపోయేది..
అయినా ఇదేం పోయే కాలం.. already తెలుగు లో కి dub ఐన సినిమాలను, OTT ల్లో subtitles తో వచ్చే సినిమాల్ని, మళ్ళీ remake చెయ్యడం.. ఇదెలా ఉందంటే… పోకిరి అనే తెలుగు సినిమాను ని Wanted అని హిందీ లో remake చేస్తే, దానికి మళ్ళీ తెలుగు dubbing చేయించి తెలుగు టీవీ channels లో వేసినట్టు… మళ్ళీ దాన్ని తెలుగు లో సినిమా గా తీస్తారా.. originals లేవా…
Share this Article