.
అసలు అన్ని టీవీ చానెళ్లకన్నా… ఆహాలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ సినీసాంగ్స్ కంపిటీషన్ బాగా ఉండేది…. ఫస్ట్, సెకండ్ సీజన్స్… థర్డ్ సీజన్ కాస్త భ్రష్టుపట్టడం మొదలైంది… విజేత ఎంపిక దాకా జడ్జిల రాగద్వేషాలు కనిపించాయి…
ఇప్పుడు వస్తున్న షోను మాత్రం పూర్తిగా నేలటికెట్ స్థాయికి దిగజార్చాడు థమన్… తను ఇప్పుడు నందమూరి థమన్ కాదు… థమన్ కల్యాణ్ అయిపోయాడు… తనలో పెద్ద అపరిచితుడు, కమర్షియల్ కేరక్టర్… తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఈ షోను అద్భుతంగా వాడుకుంటున్నాడు…
Ads
ఈటీవీ పాడుతా తీయగా ఓ సంప్రదాయిక షో… జీతెలుగు సింగింగ్ షో, సగటు టీవీ ఫన్ షో రేంజు… ఆహాలో ఇది కాస్త బాగుందని అనుకున్నామో లేదో నేల మీదకు …. కాదు, కాదు… పాతాళంలోకి తీసుకుపోయారు వేగంగా…
మరీ వ్యక్తిపూజ… మూర్ఖ ఫ్యానిజానికి, సమాజనష్టానికి ఇదుగో ఇలాంటి షోలే కారణం… అఫ్‌కోర్స్ ఒక థమన్‌కు ఇది అర్థమయ్యేంత పరిణతి, విజ్ఞత ఉన్నాయని, ఉండాలని మనం ఆశించడం కూడా మూర్ఖత్వమే… ఎంత దారుణం అంటే… ఈవారం షో పూర్తిగా ఓజీ పార్టీ అట… ఫుల్లు ప్రమోషన్ ఆఫ్ ఓజీ సినిమా…
అదీ పవన్ కల్యాణ్‌ది… ఎన్ని పెడపోకడలు అంటే… ప్రతి కంటెస్టెంటు అక్కడ పెట్టిన పవన్ కల్యాణ్ కటౌటుకు దండం పెట్టడమో, షేక్ హ్యాండ్ ఇవ్వడమో, సెల్ఫీ దిగడమో, దండం పెట్టడమో చేయాలట… సరే, అల్లు అరవింద్ వంటి పక్కా కమర్షియల్ సినిమా మనిషి ఇంతకుమించి కూడా దిగజార్చగలడు… అది వేరే కథ… ఆ కటౌట్ దగ్గర అందరూ కొబ్బరికాయలు కొట్టించలేదు, సంతోషం…
ఒక సింగర్ కు మొత్తం షోలో తన సొంత ట్యూన్లు, పాటలు మాత్రమే ఉండాలని షరతు పెట్టారు… ఇప్పటికే అది ఎగిరిపోయింది…
హోస్ట్ శ్రీరామచంద్ర పత్తాలేడు… ఇదే థమన్ నాకు ఓజీ ప్రమోషన్ పనులున్నాయి అని జంప్… చూసే ప్రేక్షకులు మాత్రం ఎడ్డోళ్లు… ఇంకా ఉంది… శ్రీరామచంద్ర లేకపోయినా సమీరా భరద్వాజ్ బాగా హోస్ట్ చేసింది… ఆమె ఏకు అనుకున్నాడేమో శ్రీరామచంద్ర, కాదు, ఆమె మేకు… అర్థమైందా మిస్టర్..?
ప్రతి కంటెస్టెంటుకూ ఏదో గిఫ్ట్ హ్యంపర్ ఇస్తూ… పాటకూ పాటకూ నడుమ ఎవరో స్పాన్సరర్ యాడ్ హోస్ట్ ద్వారా ప్రమోట్ చేస్తూ… అసలు ఇది యాడ్స్ ప్రమోషన్ షోయా లేక మ్యూజిక్ షోయా అనే డౌట్ క్రియేట్ చేశారు…
ఫ్లిప్‌కార్ట్ ప్రమోషన్ కోసం కంటెస్టెంట్లతో పాటలు పాడించిన తీరు మాత్రం చిల్లర… కంటెస్టెంట్లు పాటలు పాడుతుంటే గ్రూపు డాన్సర్ల వేషాలు చుట్టూరా… ఓజీ భజన, థమన్ భజన, పవన్ కల్యాణ్ భజన… ఈవారం తెలుగు ఇండియన్ ఐడల్ అంటేనే జస్ట్, ఓ కమర్షియల్ యాడ్… అంతే… ప్చ్, ఈ చెత్త కోసం అనవసరంగా ఆహా సబ్‌స్క్రయిబ్ చేశానా, ఛ… ఈటీవీ పాడుతా తీయగా ఎన్నో వందల రెట్లు బెటర్..!!
Share this Article