కోకాకోలా సీక్రెట్లు పెప్సీకి బేరం పెట్టిన ఉద్యోగులు
ఇల్లీగల్ పద్దతుల్లో ట్రేడ్ సీక్రెట్లు అమ్మడం.. కొనడం అనేది ప్రపంచ మార్కెట్లో జరుగుతుంటుంది. ప్రత్యర్థి కంపెనీ సీక్రెట్లు తెలుసుకోవాలని ప్రతీ కంపెనీ భావిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ సీక్రెట్ ‘కోక్ రెసిపీ’ అని చెప్తుంటారు. కోకాకోలా కంపెనీ దగ్గర అనేక రెసిపీలు సీక్రెట్‌గానే ఉంటుంటాయి. అలాంటి ట్రేడ్ సీక్రెట్లను అమ్మకానికి పెట్టారు కోకాకోలాలోని ఉద్యోగి ఒకరు.
కోకాకోలాలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జోయా విలియమ్స్ అనే మహిళ.. కోక్ ట్రేడ్ సీక్రెట్లను ప్రత్యర్థి పెప్సీ కంపెనీకి అమ్మాలని ప్రయత్నించింది… కోకాకోలా వద్ద ఉన్న డ్రింక్స్ రెసిపీలతో పాటు, భవిష్యత్‌లో తయారు చేయబోయే డ్రింక్స్, వాటి రిలీజ్ డేట్స్‌తో కూడిన డాక్యుమెంట్లను అమ్మాలని ప్రయత్నించింది. ఇందుకోసం పెప్సీ కంపెనీని సంప్రదించింది. కోకాకోలా ట్రేడ్ సీక్రెట్లను 1.5 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.11 కోట్లు) అమ్మేస్తానని బేరం పెట్టింది. అయితే పెప్సీ కంపెనీ మాత్రం ఈ విషయాన్ని కోకాకోలా యాజమాన్యానికి, ఎఫ్‌బీఐకు చేరవేసింది.
Ads
ఎఫ్‌బీఐ చాకచక్యంగా అండర్ కవర్ ఏజెంట్లను పెప్సీ ప్రతినిధులుగా పంపించి.. జోయా విలియమ్స్‌తో బేరమాడారు. ఆమె అడిగిన 1.5 మిలియన్ డాలర్లలో సగం మొత్తాన్ని కూడా అండర్ కవర్ ఏజెంట్లతో పంపించారు. ఈ తతంగాన్ని మొత్తం రికార్డు చేసి.. చివరకు ఆమెను అట్లాంటాలో అరెస్టు చేశారు. జోయా విలియమ్స్‌తో పాటు ఆమెకు సహకరించిన బాయ్‌ఫ్రెండ్ ఇబ్రహీం డైమిసన్, మరో వ్యక్తి ఎడ్మండ్ దుహానేను కూడా ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది.
కోర్టు ట్రయల్‌లో ఎఫ్‌బీఐతో ఆమె బేరమాడిన వీడియోను మొత్తం జడ్జి ముందు ఉంచారు. అంతే కాకుండా కోకకోలా కంపెనీలోని సీక్రెట్ రూమ్ కంప్యూటర్ల నుంచి డౌన్‌లోడ్ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసిన వీడియోను, ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాలు మొత్తం కోర్టులో సమర్పించారు. మొత్తం కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు జోయా విలియమ్స్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాకుండా 40 వేల డాలర్ల జరిమానా కూడా కట్టమని ఆదేశించింది.
ఈ మొత్తం వ్యవహారంలో పెప్సీని అభినందించింది. తన ప్రత్యర్థి ట్రేడ్ సీక్రెట్లను కొనే అవకాశం ఉన్నా.. కొనకుండా.. ఆ డీల్‌ను తెలియజేసినందుకు అభినందించింది. ఈ ఘటన 2007లో జరిగింది. అయితే ఆ తర్వాత పెప్సీ రిలీజ్ చేసిన ఏ డ్రింక్ కూడా మార్కెట్‌లో క్లిక్ కాకపోవడం గమనార్హం.
కోక్ రెసిసీ..
కోకాకోలా రెసిపీని జాన్ పెంబర్టన్ అనే వ్యక్తి తయారు చేశాడు. 1888లో ఆయన చనిపోవడానికి ముందు నలుగురు వ్యక్తులతో ఈ రెసిపీని షేర్ చేసుకున్నాడు. 1891లో ఆసా క్యాండ్లర్ అనే వ్యక్తి పెంబర్టన్ ఎస్టేట్ నుంచి ఆ ఫార్ములాను కొనుక్కున్నాడు. ఆ తర్వాత కోకాకోలా కంపెనీని ప్రారంభించాడు. అయితే కోకాకోలా రెసిపీని క్యాండ్లర్ చాలా సీక్రెట్‌గా ఉంచాడు. ఆ ఫార్ములా తెలిసిన నలుగురిరి చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు. ఆ నలుగురు చనిపోయిన తర్వాత.. ఆ ఫార్ములా తెలిసిన వ్యక్తిగా ఆసా క్యాండ్లర్ మిగిలిపోయాడు.
ఇక ఆ తర్వాత ఆసా క్యాండర్ల్ కోక్ రెసిపీకి అనేక మార్పులు తెచ్చాడు. అందులో వాడే ఇంగ్రీడియన్స్‌ను కూడా కాస్త మార్చాడు. ఫ్లేవర్ పెంచడానికి అనేక మార్పులు చేశాడు. జాన్ పెంబర్టన్ తయారు చేసిన ఒరిజినల్ రెసిపీ కేవలం క్యాండ్లర్‌కు మాత్రమే తెలుసు. కానీ అతను కూడా ఆ రెసిపీలో అనేక మార్పులు చేశాడు. అంతే కాకుండా క్యాండ్లర్ రెసిపీనే అసలు రెసిపీగా రికార్డు చేశాడు.
1919లో ఎర్నెస్ట్ వుడ్రఫ్ నేతృత్వంలోని కొంత మంది ఇన్వెస్టర్లు కోకాకోలా కంపెనీని క్యాండ్లర్, అతని కుటుంబం నుంచి కొనాలనుకున్నారు. ఆ సమయంలో కేవలం క్యాండ్లర్ రాసిన రెసిపీ ఫార్ములా కాపీని మాత్రమే ఇచ్చారు. అసలు రెసిపీ సాంపిల్ మాత్రం ఇవ్వలేదు. ఈ ఫార్ములా కాపీని తాకట్టు పెట్టి.. ఎర్నెస్ట్ వుడ్రఫ్ లోన్ తీసుకున్నాడు. కాగా ఆ కాపీని న్యూయార్క్‌లోని గారెంటీ ట్రస్ట్ కంపెనీకి చెందిన వాల్ట్‌లో భద్రపరిచారు. 1925లో లోన్ మొత్తం తీర్చేశాక.. వుడ్రఫ్ ఆ రాత కాపీని అట్లాంటాలోని ట్రస్ట్ కంపెనీలో భద్రపరిచారు. ఇక 2011 డిసెంబర్ 8న కోకాకోలా కంపెనీ ఆ రాత కాపీని అట్లాంటాలోని కోకాకోలా కంపెనీ ప్రధాన కార్యాలయంలో భద్రపరిచింది. ఆ కాపీ పబ్లిక్‌గా కనపడుతూనే ఉంటుంది.
కోకాకోలా కంపెనీ పాలసీ ప్రకారం.. కేవలం ఇద్దరు ఎంప్లాయిస్‌కి మాత్రమే ఈ కంపెనీ ఫార్ములాను తెలియజేస్తారు. ఆ ఇద్దరు ఎంప్లాయిస్ కలిసి ట్రావెల్ చేయడానికి అంగీకరించరు. ఇద్దరిలో ఎవరైనా ఒకరు చనిపోతే.. మిగిలిన ఇంకో ఉద్యోగి.. తనకు నమ్మకస్తుడైన మరో ఉద్యోగికి ఫార్ములాను చెప్తాడు. కాగా, కంపెనీలో ఈ ఫార్ములా తెలిసిన ఎంప్లాయిస్ ఎవరో.. టాప్ మేనేజ్‌మెంట్‌కు తప్ప ఎవరికీ తెలియదు. అంతే కాకుండా.. ఆ ఫార్ములా టాప్ మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియదు.
అసలు రెసీపీ ఎప్పుడో మాయం..
కాగా.. కోకాకోలాను మొట్టమొదటిగా తయారు చేసిన జాన్ పెంబర్టన్ రెసిపీకి ఆసా క్యాండ్లర్ ఎప్పుడో మార్పులు చేసేశాడు. అసలు ఫార్ములా ఆసా క్యాండ్లర్‌తోనే అంతమైంది. ఆ తర్వాత అనేక సార్లు అనేక మంది ఆ ఫార్ములాను తెలుసుకున్నారు. ఇద్దరు ఎంప్లాయిస్‌కు మాత్రమే కోక్ సీక్రెట్ తెలుసనేది కూడా కంపెనీ ప్రచారమే కానీ నిజం కాదట. అయితే కోకాకోలా కంపెనీ మాత్రం టాప్ ట్రేడ్ సీక్రెట్‌గానే ఇప్పటికీ చెప్తుంది. దీనికి కారణం మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటారు. కోక్ సీక్రెట్ అత్యంత సీక్రెట్ కాకపోయినా.. టాప్ ట్రేడ్ సీక్రెట్‌గా కోకాకోలా ప్రచారం చేయడం వల్లే.. దాని అమ్మకాలు ఆ రేంజ్‌లో ఉంటాయని అంటారు.
ఇక ఎవరికైనా రెసిపీ తెలిసినా.. దాని ఇంగ్రీడియన్స్ భారీగా సంపాదించడం ఎవరి వల్లా కాదు. పైగా కోకాకోలా బాటిల్‌లో పోసి అమ్మితేనే జనాలు తాగుతారు తప్ప.. ఒరిజినల్ కోక్‌లా తయారు చేసి వేరే బాటిల్స్‌లో పోసి అమ్మినా తాగరని కోకాకోలా యాజమాన్యానికి తెలుసు. అందుకే కోక్ రెసిపీని పెప్సీకే కాదు.. ఇంకేదైనా కంపెనీకి అమ్మినా.. వాళ్లు కొనరు అని మార్కెట్ వర్గాలు చెప్తుంటాయి. 2007లో కోక్ ట్రేడ్ సీక్రెట్లు అమ్మడానికి జోయా విలియమ్స్ ప్రయత్నించిందని ఆమెను జైల్లో వేశారు. కానీ జోయా అమ్మాలనుకున్నది ఒరిజినల్ ట్రేడ్ సీక్రెట్లు కావట. కోక్ కంపెనీ తయారు చేయాలని అనుకున్న జీరా, వెనీలా ఫ్లేవర్ కోక్స్ అంటా. ఆ తర్వాత కాలంలో ఆ డ్రింక్స్ తయారు చేసి అమ్మినా.. పెద్దగా పాపులర్ కాలేదట.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్..
కోకాకోలా ఫార్ములాను ఏనాడూ పేటెంట్ హక్కుగా కంపెనీ నమోదు చేయలేదు. పేటెంట్‌గా నమోదు చేస్తే.. నిర్ణీత కాల వ్యవధి తర్వాత దాన్ని బహిరంగంగా వెల్లడించాలి. అందుకే.. పేటెంట్‌గా కాకుండా ట్రేడ్ సీక్రెట్‌గా నమోదు చేయించి.. 80 ఏళ్లుగా టాప్ సీక్రెట్‌గానే ఉంచింది. కాదు కాదు.. ఉంచుతున్నట్లు కంపెనీ చెబుతోంది. అదీ.. కోకాకోలా ట్రేడ్ సీక్రెట్ల కథ.. #భాయ్‌జాన్
Share this Article