Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… ఆ పిచ్చోడిని కాదా..? ఈ పిచ్చోడిని బయటికి పంపించేశారా..?

October 20, 2024 by M S R

ఆ పిచ్చోడు కాదు… ఈ పిచ్చోడు ఎలిమినేటయ్యాడు అని ఓ తాజా సమాచారం… అదేనండీ, బిగ్‌బాస్ హౌజు నుంచి మెంటల్ పృథ్వి ఎలిమినేట్ కాలేదు, తన బదులుగా మణికంఠను పంపించేశారు… కాదు, తనే కోరుకుని బయటికి వచ్చేశాడు అని ఆ సమాచారం…

నిజానికి ప్రాథమిక సమాచారం ఏమిటంటే… టేస్టీ తేజ, హరితేజలను కాపాడటానికి పృథ్విని ఎలిమినేట్ చేశారని..! బిగ్‌బాస్ న్యూస్ రాసే మెయిన్ స్ట్రీమ్ సైట్లు సహా అన్ని యూట్యూబ్ చానెళ్లూ పృథ్వికి మంగళం పాడేశాయి… నిజానికి బయటికి పంపించేయాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి తనకు…

కానీ, ట్విస్టు ఏమిటంటే..? నిన్నటి షోలో మణికంఠ నాగార్జునకు మొరపెట్టుకున్నాడు… నన్ను పంపించేయండి అని..! ‘నా శరీరం, నా మెదడు ఏమీ పనిచేయడం లేదు… హెల్త్ బాగోలేదు…’ అన్నాడు… హౌజులోకి వచ్చే ముందు నా పెళ్లాంబిడ్డలు నా దగ్గరకు రావాలంటే నేనాడాలి, గెలవాలి అని పదే పదే తన ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఏకరువు పెట్టి ఏడ్చిన మణికంఠ ఇప్పుడిలా మాట్లాడటం ఏమిటి..?

Ads

అందుకే బిగ్‌బాస్ టీం తనను మెడికల్ రూమ్‌కు పంపించింది… వాళ్లేమో మణికంఠ ఫుల్ ఫిట్ అన్నారట… ఇంకా సింపతీ కార్డును ఈ కోణంలో ప్రయోగిస్తున్నాడా అనే డౌట్ కూడా వచ్చింది అందరికీ… ఈమధ్య ఫిజికల్ టాస్కుల్లో పాల్గొనకుండా… నా కాళ్లూ చేతులు విరిగితే ఎలా అంటున్నాడు తను… ఈ మెంటల్ కేసు ఇలాగే హౌజులో ఉంటే ఏం అఘాయిత్యం చేసుకుంటాడో అని భయపడి బయటికి పంపించేశారా..? లేక సీక్రెట్ రూంలోకి పంపించారా..? తెలియదు..!

అటు వీకెండ్ షోల షూట్ జరుగుతూ ఉంటే ఇటు వార్తలు లీకవుతూ ఉంటాయి ఎప్పుడూ… కొన్నిసార్లు కావాలనే బిగ్‌బాస్ టీం కావాలనే తప్పుడు సమాచారాన్ని లీక్ చేసి, సోషల్ సైట్లను, వార్తా ప్రసార సాధనాల్ని మిస్ లీడ్ చేసి… అసలు ట్విస్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది బిగ్‌బాస్ టీం… గందరగోళాన్ని క్రియేట్ చేయడమే కాదు, ప్రేక్షకుల అటెన్షన్‌ను మరింత డ్రా చేయడానికి ఈ ప్రయాస…

అందులో భాగంగానే పృథ్విని కాపాడి, ఎలాగూ అడుగుతున్నాడు కదాని మణికంఠను పంపించేశారా అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్… అదే నిజమైతే ఈ మెంటల్ కేసును మరికొన్నాళ్లు బిగ్‌బాస్ ప్రేక్షకులు భరించాలన్నమాట… ఫాఫం ప్రేరణ..!! ఏది నిజమో తెలియాలంటే ఈరోజు రాత్రి దాకా వేచి చూడాల్సిందే అన్నమాట… కానివ్వండి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions