Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నా ఫోన్ దొంగ నా చేతికే చిక్కాడు… ఈలోపు ఇద్దరు బలిష్టులు ఎంటరై…

May 26, 2024 by M S R

Mahesh Babu…… పోయి దొరికిన ఫోను

not so pleasant but pleasant experience
~~~~~~~~~~~~~~~~
ముంబైలో అందరూ తాము carry చేసే bagpacks ముందుకు వేసుకోవడం చూస్తుంటాము,
కారణం ఈ బిజీ నగరంలో దొంగలు కుడా ఎక్కువే,
అందుకే అన్నీ బ్యాగులో పెట్టేసి వెనకకు కాకుండా ముందుకు వేసుకుని కాపలా కాస్తుంటారు
valuables ఏం లేవులే అని వెనకకు వేలాడేసుకుంటే water bottle కూడా వదలరు , bagpack
వెనకకు వేసుకుంటే కొట్టేయమని పర్మిషన్‌ ఇచ్చినట్టే

ముంబైలో ఎక్కువగా లోకల్ ట్రైన్లలోనే ప్రయానిస్తుంటారు, its crucial part of mumbaikars lifestyle
infact లోకల్ ట్రైన్ల facility ఉండడం వల్లే 100 పైగా కిమీల దూరం నుండి రోజూ సిటీకి‌ వచ్చి పనిచేస్తుంటారు ,ఎంత దూరమైనా 5,10,20 రూపాయిల్లో వెళ్ళిపోవచ్చు, ట్రైన్ ఆగినప్పుడు ఏదోటి‌చేసి ఎక్కేస్తే చాలు ట్రాఫిక్ బెడద లేకుండా డెస్టినేషన్ చేరుకోవచ్చు,
కానీ పీక్ హవర్స్ లో ఈ ట్రైన్స్ లో సీటు కాదు కదా కనీసం నిలబడడానికి చోటు దక్కించుకోవానికి మినీ యుద్దమే చేయాలి
లోపలికెళ్ళలేం, వెళితే నలిగిపోయి ఫుల్‌బాడీ మసాజ్ అయ్యి బయటకు వస్తాం
మామూలుగా 20 సెకన్లు ఆగుతాయ్ లోకల్ ట్రైన్స్, ప్రతి స్టేషన్ లో ఆగేవే కాకుండా కొన్ని స్టేషన్స్ లో మాత్రమే ఆగే Fast local trains కూడా ఉంటాయ్, వీటికి డిమాండ్ ఎక్కువ
వీటిలో ఎక్కడానికే slow trains ని ignore చేస్తుంటారు speed గా వెళ్ళిపోవచ్చని
Next ఏ train వస్తుందో తెలుసుకోడానికి apps ఉన్నాయ్,
వీటిలో ఎప్పుడూ బిజీగా ఉండే కొన్ని స్టేషన్స్ ఉన్నాయ్
ఆ స్టేషన్స్ నుండి వేరే స్టేట్స్ కి కనెక్టివిటీ , starting point ఉండడం వల్ల ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయ్
ఆ rushy స్టేషన్లే జేబు దొంగలకు business points

సిటీకి కొత్తగా వచ్చి, లేదా ఇంకా దొంగలకు బోణీ అవ్వని, mumbai meter కి ఇంకా సెట్ అవ్వని new to city people ,కాలు పెట్టే సందు లేని కిక్కిరిసిన ట్రైన్ లో 20 seconds లో చోటు దక్కించుకోబోయే Process లో తమ జేబుల్లోంచి పర్సులు ఫోన్లూ పోగొట్టుకునేవారు ముంబైలో రోజూ వందల్లో ఉంటారు,
పోయాక కంప్లెయింట్ ఇచ్చినా ట్రేస్ చేసినా ఎన్ని దొరుకుతాయో తెలీదు ,‌ పోయింది మనది కాదు, జాగ్రత్తపరుచుకున్నదే మనది

ఇదంతా ఎందుకు‌ చెప్తున్నానంటే
మొన్న 20 తారీఖున ముంబైలో ఎలక్షన్స్ డే, official గా holiday, నాకెలాగూ లోకల్ ఓటు లేదు, సోమవారం సెలవు కలిసొచ్చింది కదా అని నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని evening ముంబై కి రిటర్న్ వచ్చాను
దాదర్ స్టేషన్‌లో asusually రద్దీగా ఉన్న Fast train ఎక్కుతుండగా
జేబులో ఎవరో చేయిపెట్టినట్టనిపించి తడిమి చూసుకోగానే ఫోను మాయం, train కదిలే ఆ 20 seconds లోనే అరుస్తూ బయటకు దూకేసాను, బయటున్న crowd లో అనుమానితుడు cum దొంగెవరో 2 seconds లో కనిపెట్టేసాను (వారం ముందు ఢిల్లీ మెట్రోలో ఫోన్లు ఎలా కొట్టేస్తారు అని ఒకతను లైవ్ vlog చేసి చూపించాడు అది చూసి ఉన్నాను )


వాడి కాలర్ పట్టుకుని ముక్కు పగలగొట్టబోయేలోపే కుదమట్టంగా ఉన్న ఇద్దరు వాడ్ని పట్టేసుకున్నారు, ఎవర్రా వీళ్ళు వీడిని ఎందుకు పట్టుకున్నారు కొంపదీసి తోడు దొంగలా, వీడిని సైడ్ చేయడానికి వచ్చారా ? అని అనుమానిస్తూ వాడిని వదలండి అని అడుగుతున్నాను కానీ వాడు ఇద్దరు పట్టుకున్నా ఆగట్లేదు. ఇంతలో ఇంకో ఇద్దరు వచ్చారు వచ్చి రాగానే వాడి చేతికి బేడీలు వేశారు అప్పుడు అర్థమయింది వాళ్లు మఫ్టీ లో ఉన్న పోలీసులని ,
“వాడు నా ఫోన్ కొట్టేసాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు” అంటే “మీ ఫోన్ కొట్టేయడం మేము చూసాము, మాతో రండి” అని నన్ను కూడా వారితో పాటు తీసుకెళ్లారు ఫుల్లుగా గంజాయి మత్తులో తూగుతున్న వాడు “నాకేం తెలియదు నన్ను వదలండి” అంటూ నలుగురు పట్టుకున్నా గాని విడిపించుకుంటున్నాడు

రైల్వే పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ రూమ్ కి తీసుకెళ్లి నన్ను బయట కూర్చోబెట్టారు వాడిని లోపల ఐదు నిమిషాలు అడిగారు నాకేమీ తెలియదు అన్నాడు ఆరో నిమిషం నాకు దెబ్బలు సౌండ్ వినిపించింది ఏడో నిమిషం నా ఫోన్ రింగ్టోన్ వినిపించింది అప్పుడు కానీ నా మనసు కుదుటపడలేదు
ఎందుకంటే దొంగలు టీం వర్క్ చేస్తూ ఉంటారు, కొట్టేసి వేరే వాడికి పాస్ చేస్తారు అలా ఏమైనా నా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసాడా అందుకే అప్పటినుండి అంత కాన్ఫిడెంట్గా నా దగ్గర లేదు నాకు సంబంధం లేదు అని అంటున్నాడు అని డౌట్ వచ్చింది కానీ నా ఫోన్ రింగ్ టోన్ వినిపించగానే ఫోన్ వీడి దగ్గరే ఉంది, వీడే దొంగ అని ఈసారి కాంక్రీట్ అయ్యింది

అక్కడినుంచి దొంగను, బాధితుడినైన నన్ను ముంబై సెంట్రల్ స్టేషన్ కి తీసుకెళ్లారు అక్కడ DB రూమ్ డిటెక్షన్ బ్రాంచ్ రూమ్ లో ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేస్తున్నారు,
ఇవన్నీ కూడా వెంట వెంటనే అయిపోతున్నాయి ఏదో సినిమాలో స్క్రిప్టెడ్ సీన్ లాగా నాకు అర్థమయ్యే లోపే అన్ని చకచకా జరిగిపోతున్నాయి కొంచెం షాక్ లోనూ కొంచెం సర్ప్రైజ్ లోను కొంచెం అయోమయం లోనూ ఉన్నాను నా
దొంగను పట్టుకున్న ఆ నలుగురు GRP (government railway police) Detection
branch team రైల్వే స్టేషన్లో దొంగలు ఎవరో వాళ్ళని ముందుగానే డిటెక్ట్ చేసి అనుమానం వస్తే వాళ్లని పట్టుకొని విచారించే టీమ్ ఇది

Ads

local

లక్కీగా నా ఫోన్ కొట్టేసిన దొంగ ముందుగా మఫ్టీలో ఉన్న వీళ్ళ కంట్లో పడ్డాడు, గంజాయి మత్తులో ఫుల్లుగా తూగుతూ ఉండగా వీళ్ళకి ఎదురయ్యాడు వీడు కచ్చితంగా దొంగతనం చేయబోతాడు అని వారు నిర్ధారించుకున్నారు అందుకని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే దొంగ ఫోన్ కొట్టేయబోయాడు ఆ కొట్టేయబోయిన ఫోన్ నాదయింది
అందుకనే వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వాడిని పట్టుకోవడం ఆ తర్వాత ఇంకా ఇద్దరని పిలవడం వాళ్లొచ్చి వెంటనే బేడీలు వేయడం చకచగా జరిగిపోయాయి

డీటెయిల్స్ తీసుకుని హిందీలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు “వీడికి శిక్ష వేయాలి లేకపోతే వీడు దీన్ని మళ్లీ రిపీట్ చేస్తాడు మీకు కోపరేషన్ కావాలి ” అని అన్నారు తప్పకుండా చేస్తాను అని నేను అన్నాను
అవతల దొంగకి మెల్లిగా కొంచెం మత్తు దిగుతోంది
నార్కో టెస్ట్ కి రెస్పాండ్ అవుతున్న వాడిలాగా ఒక్కో డీటెయిల్ చెప్తున్నాడు అప్పుడు తెలిసింది వాడి పేరు
“మొహమ్మద్ జాకీర్ హుస్సేన్” అని ఆల్రెడీ బెయిల్ పైన బయటికి వచ్చాడు అని
ఎఫ్ఐఆర్ సీరియస్నెస్ వాడికి అర్థమయ్యి బ్రతిమాడడం స్టార్ట్ చేశాడు
ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక ” వీడు ఇప్పుడు మత్తులో ఉన్నాడు రేపు పొద్దున నేను మత్తులో ఉండగా నన్ను ఎత్తుకు వచ్చారు అనే అవకాశం ఉంది కాబట్టి కోర్టుకి రేపు పొద్దున్నే వీడిని తీసుకెళ్తాము అందుకోసం మీ ఫోన్ ని ఇక్కడే వదిలి వెళ్లాలి its evidence ” అని చెప్పారు అదే ప్రూఫ్ కాబట్టి సరే అని సిమ్ కార్డ్స్ తీసి అక్కడే పెట్టి వచ్చాను
నెక్స్ట్ డే మధ్యాహ్నం 11:00 కి మళ్ళీ ముంబై సెంట్రల్ స్టేషన్ కి వెళ్ళాను,
అక్కడ ఆల్రెడీ train లో company laptop బ్యాగ్ పోగొట్టుకున్న‌ ఒక‌ emoloyee complaint register చేస్తున్నాడు

రాత్రి మత్తు పూర్తిగా దిగినట్టుంది ఆ దొంగని అక్కడే చైన్లతో కట్టేశారు
నాతో బాండ్ పేపర్ పైన సంతకాలు చేయించుకొని నాకు‌ ఫోన్‌ అప్పజెప్తున్నట్టు proof picture తీసుకుని
నా ఫోన్ నాకు అప్పచెప్పారు
ఇదంతా కూడా 18 గంటల్లో జరిగిపోయింది,
నా present project work coordination అంతా 80% phone coordination, mails తో జరుగుతుంది
ఇది జరిగింది‌ రాత్రి సమయం అవ్వడం వల్ల నా ఫోన్ నా దగ్గర లేక work ఆగిపోవడం లాంటిదేమి జరగలేదు

local

ఈ ఎంటైర్ episode లో ముంబై పోలీసుల అలర్ట్నెస్ అండ్ కమిట్మెంట్ , friendly policing ని మెచ్చుకోవాలి
మామూలుగా ఇద్దరు సరిపోతారు ఒక దొంగకి కానీ ఒక్కోసారి వాళ్లు చిన్నచిన్న కత్తులతో తమను తాము కోసుకోవడం లేదా అవతలవారి పీక కోసేయడం లేదా‌ ఎక్కడైనా ఒక‌ గాటు‌వేసి తప్పించుకోవడం జరుగుతుందట,
అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే full టీమ్ ని అలర్ట్ చేసి పిలిపించి , తదుపర జరగాల్సిన ప్రొసీజర్ ని వెనువెంటనే process చేసి victim ఫ్రెండ్లీగా బిహేవ్ చేశారు , fir registration సమయంలో చాలా Comfortable గా treat చేసారు , వాళ్లకి చాలా థాంక్స్
Last లో వీళ్ళు చేసిన Service కి 1-10 digits online feedback కూడా తీసుకున్నారు
Thank you Mumbai GRP….  త్రయంబకేశ్వర‌ం‌ నుంచి తెచ్చిన ప్రసాదం Police team కి‌ ఇచ్చేసాను

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions