Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!

June 7, 2026 by M S R

.

తిరుచ్చి… తమిళనాడులోని ఈ సీటు మీద అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది… ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రెండుచోట్ల నిలబడ్డాడు, రెండూ గెలిచాడు… ఈ తిరుచ్చి సీటు వదిలేసుకున్నాడు… దానికి ఉపఎన్నిక జరుగుతుంది… ఐతే అక్కడ ఎవరు విజయ్ పార్టీ తరఫున నిలబడతారు..? ఇదీ ప్రశ్న…

అందరూ అనుకుంటున్న పేరు త్రిష… విజయ్ ఇష్టసఖి… మరో జయలలిత కావాలని కోరుకుంటున్న నటి… యాస్పిరేషన్స్ ఉన్నాయి… వయస్సు మీద పడుతోంది, ఇంకా సినిమాలేవీ రావు, బాగా సంపాదించుకుంది, తోడుగా విజయ్ ఉండనే ఉన్నాడు, అధికారం ఉంది… దేనికీ కొరత లేని జీవితం…

Ads

కానీ ఆమెను నిలబెడితే విమర్శలు వస్తాయనే భయం విజయ్‌లోనూ ఉంది… కారు డ్రైవర్ కొడుకు వంటి తన చుట్టూ తిరిగే సామాన్యులనే నిలబెట్టిన విజయ్ త్రిషను నిలబెట్టడం పెద్ద కథేమీ కాదు… కానీ ఏదో జంకు… ఈలోపు తెరపైకి డాన్సర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ పేరు వచ్చింది…

తను టీవీకే నాయకుడిగా గానీ, సానుభూతిపరుడిగా గానీ పెద్దగా ప్రచారంలోకి రాలేదు గతంలో… హఠాత్తుగా ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది… తను కూడా ‘‘అందరూ అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెబుతాను, బెంజ్ సినిమా పని పూర్తవుతోంది, 11న ఏ విషయమూ ప్రకటిస్తాను’’ అని ఓ ట్వీట్ ప్రకటన జారీ చేశాడు… పోటీ లేదు, టీవీకే లేదు వంటి ఖండనలు లేకపోవడంతో… సానుకూలంగా ఉన్నాడనే అభిప్రాయం కలుగుతోంది…

(లారెన్స్ కూతురు రాఘవిని తిరుచ్చి నుంచి నిలబెడతారు అనే ప్రచారం కూడా ఉంది, కానీ ఆమె దృష్టి దర్శకత్వం మీద ఉంది… లారెన్స్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి భక్తుడు, ఆ మహిమ వల్లే బ్రెయిన్ ట్యూమర్ నుంచి బయటపడ్డాననే నమ్మకం ఉంది, అందుకే బిడ్డ పేరు రాఘవి అని పెట్టుకున్నాడు…)

అసలు స్టాలిన్ గానీ, అన్నామలై గానీ ఇక్కడ పోటీచేస్తే పోటీ రంజుగా ఉంటుంది… కానీ ముందు ఉద్యమం, తరువాతే కొత్త పార్టీ అనే భావనలో ఉన్నాడు కాబట్టి అన్నామలై ఇప్పుడు పోటీచేయకపోవచ్చు… ఆల్రెడీ మొన్నమొన్ననే జనం ఓడించారు కదా, ఇప్పుడు మళ్లీ మరో సీటు నుంచి నిలబడటం నామర్దా కాబట్టి స్టాలిన్ కూడా పోటీచేయకపోవచ్చు…

బీజేపీ కూడా అన్నాడీఎంకేకు వదిలేస్తుందేమో బహుశా… నిజానికి ఏ పార్టీకైనా ఇది టఫ్ సీటే… గత నాలుగు ఎన్నికలలో DMK ఒకసారి (2021) , AIADMK రెండుసార్లు గెలిచిన ప్లేస్ అది… 2021 ఎలక్షన్స్ లో DMK సీనియర్ లీడర్ 35 వేల మెజారిటీతో గెలిచాడక్కడ… మొన్న కూడా విజయ్ మెజారిటీ 27 వేలే అక్కడ… తిరుచ్చి వెస్ట్ లో KS నెహ్రూ అని DMK సీనియర్ లీడర్ మొన్నటి విజయ్ వేవ్ లో కూడా గెలిచాడు… కాబట్టి అంత ఈజీగా ఏమీ ఉండదు ఎవ్వరికీ… టీవీకే అడ్వాంటేజ్ అధికారంలో ఉండటం ఒక్కటే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గంగ చంద్రముఖిలా..! కాషాయ రాంచందర్‌ కాస్తా పింక్ హరీష్‌లా…!!
  • గ్లోబల్ ఎంఎన్సీల వైపు యువ గిరిజనం! సరికొత్త సక్సెస్ స్టోరీలు!
  • ఓహో… ఈ ‘ఇడుపు కాయితం’ రచ్చకు అక్కడ బీజం పడిందా..?!
  • ‘‘ఓహ్.., నేను ఇంకా టీచింగు నుంచి రిటైర్ కాలేదన్నమాట’’
  • కువిమర్శ! అయోధ్య విరాళాలతో బీజేపీ ఎంపీలను కొన్నదట!
  • ‘‘మీ పాలనలో 75 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగినట్టేనా హరీష్?’’
  • “అసలైన పాన్ రుచికి మీఠా… తుపాన్ నాట్యం చేస్తే – ఈఠా!”
  • Uniform Civil Code – ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు!
  • బుడ్డోడిని ఆడించలేదు – చివరకు ఐర్లాండ్ కూడా ఆడుకుంది – ఓడించింది
  • ‘ఇడుపు కాయితం’ ఇచ్చి పన్నెండేళ్లయినా… అదే వెక్కిరింపులు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions