.
Nàgaràju Munnuru …….. == భారత్ నిజమైన స్నేహితుడు రష్యా ==
భారత్ చిరకాల స్నేహితుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన సందర్భంగా ఇండియా టుడే ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పుతిన్ భారతదేశం గురించి, ప్రధాని మోదీ గురించి చెప్పిన విషయాలు భారతీయులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పిన విషయాలు యధాతథంగా…
Ads
“అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ రష్యా మధ్య సన్నిహిత సంబంధాలను బూచిగా చూపి భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కారణాలతో కృతిమ అడ్డంకులు సృష్టిస్తున్నారు.
పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ఒత్తిళ్లు వస్తున్నా నేనుగానీ, మోదీగానీ మా బంధాన్ని ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించలేదు. భారత్, రష్యా బంధం ఏ ఒక్కరికి, ఏ దేశానికి వ్యతిరేకం కాదు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలకు కాపాడుకోవడానికే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన సొంత అజెండా, ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయి. మేము (భారత్, రష్యా) మా లక్ష్యాలపై దృష్టి పెట్టాం. అవి ఎవరికి వ్యతిరేకం కాదు. మా ప్రయోజనాల కోసమే.
భారత్ – రష్యా ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీల్లో 90 శాతం సొంత కరెన్సీలో జరుగుతున్నాయి. మిగిలిన 10 శాతంలో పలు మధ్యవర్తిత్వ సంస్థల కారణంగా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పరిష్కరించుకుంటాం.
భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం మీద అమెరికా అభ్యంతరాలు చెబుతున్నది కానీ అదే అమెరికా తమ అణు ఇంధన అవసరాల కోసం ఇప్పటికీ రష్యా నుంచి అణు ఇంధనాన్ని కొంటోంది. రష్యా ఇంధనాన్ని కొనడానికి అమెరికాకు హక్కు ఉన్నప్పుడు భారత్ కి ఎందుకు ఉండకూడదు?
ప్రపంచంలో గతంలో భారత్ వ్యహరించినట్టు ఇప్పుడు వ్యహరించలేదు. భారత్ బ్రిటిష్ కాలనీ కాదు. భారత్ ఇప్పుడు శక్తివంతమైన దేశం. ప్రధాని మోదీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదు. ఆయనను చూసి భారత ప్రజలు గర్వించాలి. ఆయన వైఖరి దృఢంగాను, ముక్కుసూటి ఉంటుంది. కానీ ఎవరితోనూ ఘర్షణ పడే తత్వం కాదు. మా లక్ష్యం ఘర్షణలను ప్రోత్సహించడం కాదు. మా దేశాల చట్టబద్ధ హక్కులను కాపాడుకోవడమే.
భారతదేశం కోసం మోదీ సవాళ్లతో కూడిన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో తాను మొదటి స్థానంలో ఉండి, అధికార వ్యవస్థను ఆ తరువాతే భాగస్వామిని చేస్తున్నారు”. అని పుతిన్ పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు……… – నాగరాజు మున్నూరు
ఇక్కడే మరో అంశమూ చెప్పుకోవాలి… పుతిన్- మోడీ పరిచయం, స్నేహం ఇప్పటిది కాదు… దాని వయస్సు పాతికేళ్లు… 2001లో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు, గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని రష్యా పర్యటనకు తన వెంట తీసుకెళ్లాడు… అప్పట్లో మోడీ చాలా చిన్న నాయకుడు… ఐనాసరే పుతిన్ తన పట్ల స్నేహాన్ని, గౌరవాన్ని చూపించాడని మోడీ చెప్పేవాడు… అఫ్‌కోర్స్, ఇప్పుడు ఇద్దరూ సమస్థాయి నాయకులు…

Share this Article