.
బీఆర్ఎస్ అంతులేని కాళేశ్వరం ఫ్రస్ట్రేషన్‌లోకి కూరుకుపోతూ… జారిపోతూ… మునిగిపోతూ… యుక్తాయుక్త విచక్షణను కూడా మరిచిపోతుంది… ఇది రియాలిటీ… A party should not like this… అలా ఉంటే ఆ ప్రాంతానికే నష్టం… తెలంగాణ డెస్టినీ…
- నువ్వు ఎంత తిన్నావో, నీ ఇంజినీర్లు ఎంత తిన్నారో…. ఒక్కొక్క ఇంజినీర్‌ను ఏసీబీ తంతుంటే తెలుస్తోంది… ఉపగ్రహాలు, చిల్లరగ్రహాలే అంతగా కోట్లకుకోట్లు తిన్నాయంటే అసలు ప్రధాన గ్రహాలు, అనుబంధ గ్రహాలు ఏమేరకు తిన్నాయో… తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాల్సిన పని లేదా..?
తెలంగాణ ప్రజల సొమ్మును, ప్రయోజనాలను, ఆశల్ని, ఆకాంక్షల్ని బలితీసుకున్న ఈ సోకాల్డ్ ‘ అరివీర ఉద్యమ, భీకర పోరాట, మహా చైతన్య’ పార్టీ తెలంగాణ ఆర్తిక, రాజకీయ, స్వార్థ ప్రయోజనాలకు భ్రష్టుపట్టించింది ఎలా..?
Ads
థాంక్ గాడ్… ఏ ఉత్తముడో, ఏ పొంగులేటో, మరొకరో సీఎం కాలేదు…!! కేసీయార్ అహం రాజకీయాలకు బలైన బాధితుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టే ఈ అసలు కథలన్నీ బయటికి వస్తున్నాయి…
ఎవరెవరిని ఏం విమర్శించాలో తెలియక… సహేతుక విమర్శలనూ పక్కన పెట్టి… ఏదేదో ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్…. కాళేశ్వరం కమిషన్ పక్కాగా తెలంగాణ సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్లానింగు అట… తనే కాళేశ్వరం ఘోష్‌తో అనేకసార్లు భేటీ వేశాడట…. మోడీ, రేవంత్, చంద్రబాబు ఉమ్మడి కుట్ర అట, ఘోష్ కమిషన్..? ఇంకా ఇంకా దిగజారడానికి ఇంకేమైనా లోతు ఉందా కేసీయార్..?
తన ఫోన్ ట్యాపింగు అడ్డగోలు అశ్లీల, అనైతిక అరాచకం బయటికొస్తేనేమో నాకేం సంబంధం అంటావు… మరి సాగునీటి అక్రమాలకు, ఈ కాళేశ్వరం అవినీతి నిగ్గుతేల్చే కమిషన్ వేస్తేనేమో ఆదిత్యనాథ్ దాస్ బాధ్యుడా..? ఇంకా నయం, సాగునీటి మంత్రిత్వ శాఖ అటెండర్లు, పీఆర్వోలు కూడా బాధ్యులే, వాళ్లూ తెలంగాణ ద్రోహులే అని ముద్ర వేయలేదు…
అసలు తెలంగాణ ద్రోహులు ఎవరు..? తెలంగాణ సమాజం నమ్మకాల్ని పాతరేసి అడ్డగోలుగా తరాలకు సరిపడా సంపాదించేవాళ్లా..? ప్రభుత్వంలో ఎవరున్నా చెప్పినట్టు విని, చేసే అధికారులా..? సలహాదారులా..? ఇంజనీర్లా..? డప్పు కొట్టే టాప్ రేటెడ్ దరిద్ర పాత్రికేయులా..?
అసలు ఏమంటున్నది బీఆర్ఎస్ క్యాంపు..? ఇదుగో…
కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర!… తెరవెనక మోదీ, రేవంత్, బాబు పావులు!
1) కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని సాగునీటిరంగ నిపుణులు చర్చించుకుంటున్నారు…
2) రైతాంగానికి 365 రోజులు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసే కుట్ర కూడా ఇందులో దాగి ఉన్నదని అనుమానిస్తున్నారు… రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్‌దాస్ నియామకం అందులో భాగమేనని అంటున్నారు…
3) 1999 నుంచి 2003 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీ జలవనరుల శాఖ ఇన్‌చార్జిగా ఆదిత్యనాథ్‌దాస్ పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19 వరకు చంద్రబాబు విభజిత ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఇరిగేషన్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆ తరువాత జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడూ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.
ఉద్యోగ విరమణ అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. మొత్తంగా గడచిన పదేండ్ల పాటు ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. ఆ పదేండ్ల కాలంలో తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్‌దాస్ కీలకంగా పనిచేశారు. కాళేశ్వరంతో సహా కృష్ణా, గోదావరి బేసిన్‌లో తెలంగాణ నీళ్ల వాటాకు వ్యతిరేకంగా ఏపీ తరఫున పోరాడారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా ఆదిత్యనాథ్ వ్యవహరించారు.
ఆదిత్యనాథ్‌కు రేవంత్ పగ్గాలు….. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆదిత్యనాథ్ ముద్రవేసుకున్నారు. గత ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం అయ్యాక ఆదిత్యనాథ్‌దాస్‌ను నీటిపారుదల సలహాదారుడిగా నియమించుకుంటారని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదిత్యనాథ్‌కు ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించింది. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండానే ఈ నియామకం జరిగిందని కూడా ప్రచారం జరిగింది.
జస్టిస్ పీసీ ఘోష్, ఆదిత్యనాథ్‌దాస్ కలిసి కోల్‌కతాలో నివేదికను వండివార్చారని నిపుణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబుకు నమ్మకస్తుడైన టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజును సైతం తెలంగాణ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. మేడిగడ్డకు వ్యతిరేకంగా నివేదికలు తెప్పించుకునేలా ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీతో లాబీయింగ్ చేయడంలో, చంద్రబాబు, రేవంత్, మోదీ మధ్య సమన్వయకర్తలా వ్యవహరించడంలో శ్రీనివాసరాజుదే కీలక పాత్రని చెప్తున్నారు…
తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి కోసమే….. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ చేసిన కుట్రే కాళేశ్వరం కమిషన్ అని నిపుణులు ఆరోపిస్తున్నారు. గోదావరి- కావేరి అనుసంధానం కోసం కాళేశ్వరాన్ని, తద్వారా తెలంగాణను బలిపెట్టే కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు….
చదివారు కదా… అసలు విషయానికి వద్దాం… అసలు తమిళనాడు ఎన్నికలకూ ఘోష్ నియామకానికీ లింక్ పెట్టడం అంటేనే..,.. మోకాలికీ బట్టతలకూ ముడిపెట్టే అజ్ఞానం…. ఫాఫం, బీఆర్ఎస్ అడుగుల్ని నమస్తే తెలంగాణ జర్నలిస్టులు నిర్దేశిస్తున్నారా..? ఆ పిచ్చి రాతల్లో పడి బీఆర్ఎస్ పంకిలంలో పడి పరుగులు తీస్తున్నదా.,.? ఫాఫం కేసీయార్…
ఆదిత్యనాథ్ దాసే కాదు, సలహాదారులు, ఇంజినీర్లు, కార్యదర్శులు…. ఎవరైనా ప్రభుత్వ ఆలోచనలను బట్టే వ్యవహరిస్తారు… అంతెందుకు..? కేసీయార్ సన్నిహిత, అస్మదీయ ఇంజినీర్లు పనిచేసి, సంపాదించిన కోట్టకుకోట్ల ఆస్తులు తాజాగా బయటపడలేదా..? ఎవరు ద్రోహులు..?
ఇదే ఆదిత్యనాథ్ దాస్‌కు ఐఏఎస్ సర్కిళ్లలో మంచి పేరే ఉంది… వరంగల్ కలెక్టర్ నుంచి… అక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రంలో పనిచేయడం దగ్గర నుంచి… తెలుగు రాష్ట్రాల సాగునీటి బాధ్యతల దాకా…! వైఎస్ జలయజ్ఞం నుంచి నేటి బనకచర్ల కుట్రల దాకా అన్నీ తెలుసు తనకు…!! కేసీయార్ మార్క్ దోపిడీ కూడా తెలిసినోడు…
తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల బాగోతాలన్నీ తెలిసినోడిని సలహాదారుడిగా పనిచేయించుకుంటే తప్పేమిటట..! అబ్బే, నిజాలు బయటపడితే ఎలా..? తస్కిన బరాజుల డొల్లతనం బయటపడితే ఎలా..? ఇదేనా బీఆర్ఎస్ ఆందోళన… ఫాఫం, తెలంగాణ… ఆ పదేళ్లూ ఎవడి పాలైందిరో..!!!
- కాంగ్రెస్‌లో పొసగక బీజేపీలో చేరతాడట,, అందుకే రేవంత్ రెడ్డి ఇవన్నీ మోడీ, బాబు చెప్పినట్టు చేస్తున్నాడట…. అవునూ, బీజేపీలో తన పార్టీని విలీనం చేయాలని రెండుమూడేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నది ఎవరు కేసీయార్..? గతంలో కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి దాన్నీ మోసం చేసింది ఎవరు..?
మోడీ కూడా కాళేశ్వరం విచారణ కుట్రలో భాగస్వామి అట… ఫాఫం, ఇదే కేసీయార్ ఏదో డ్రామా స్కిట్ ప్లాన్ చేసి, ఏకంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్‌ను అరెస్టు చేసి, జైలులోకి నెట్టేసే కుట్ర చేస్తే…. మోడీని లొంగదీసుకునే, వంగదీసుకునే కుటిల యత్నాలు చేస్తే….. ఈరోజుకూ బీజేపీకి సోయి లేదు… పైగా అదే బీఆర్ఎస్‌ను విలీనం చేసుకుని, కేటీయార్‌ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందట… ఫాఫం మోడీ, ఫాఫం బీజేపీ..!!
Share this Article