పెద్ద పెద్ద వివరణలు, వర్ణనలు అక్కర్లేదు… ఒక్కసారి ఈ వీడియో చూడండి… ఓ వంద నయాగారా జలపాతాలు కళ్లెదుట భీకరఘోషతో కిందకు దూకుతున్నట్టు అనిపిస్తుంది… ఎక్కడో కాదు… కర్నాటకలోని షిమోగా జిల్లాలో… జోగ్ జలపాతాలు… జోగ్ ఫాల్స్…
నిజానికి మామూలు రోజుల్లో పెద్దగా నీళ్లుండవు… బోసిగా కనిపిస్తుంది… అందుకే ఆ పరిసరాలు పెద్దగా కమర్షియలైజ్ కాలేదు… కాకపోతే జలపాతం సరిగ్గా చూడటానికి ఏర్పాట్లు బాగుంటాయి… ఇప్పుడు భారీవర్షాలు కురుస్తూ, జోగ్ ఫాల్స్ కన్నులపండువగా మారాయి…
Ads
ఎవరో మిత్రులు వీడియో తీసి పంపిస్తే, ఫేస్‌బుక్‌లోనే కొందరు మిత్రులు షేర్ చేసుకుంటున్నారు… ఐ ఫీస్ట్… సంక్షిప్తంగా ఈ ఫాల్స్ గురించి చెప్పాలంటే… షిమోగా జిల్లా, సాగర తాలూకా దీని లోకేషన్… శరావతి నది 829 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటుంది…
ఒకే దగ్గర జలపాతంలా గాకుండా… Raja, Rani, Roarer, Rocket అనే నాలుగు పేర్లతో నాలుగు చోట్ల నుంచి దూకుతుంటుంది… మొత్తం జలపాతం వెడల్పు కూడా 250 గజాల దాకా ఉంటుంది… కర్నాటక టూరిజం దిగువ దాకా వెళ్లి చూడటానికి వీలుగా 1400 మెట్ల దాకా నిర్మించింది… చూడటానికి వెళ్లేవాళ్లు సొంతవాహనాల్లో వెళ్లడం బెటర్…
మన రాష్ట్రం నుంచి ఉత్తర కర్నాటక టూర్ వెళ్తుంటారా చాలామంది… జోగ్ ఫాల్స్ టచ్ చేయకుండానే వచ్చేస్తుంటారు… మధ్యలోనే హోటళ్లలో, అక్కడిక్కడా అడిగితే నీళ్లు లేవంటూ డిస్కరేజ్ చేస్తుంటారు, అదీ కారణం…
బస్సు, రైళ్ల సౌకర్యాలున్నా సరే… అక్కడ వసతి సమస్యలు ఎదురు కావచ్చు… నిజానికి ఇంత అద్భుతమైన లొకేషన్‌ను కన్నడ సినిమా పరిశ్రమ మాత్రం పెద్దగా ఉపయోగించినట్టు అనిపించదు… బహుశా ఏడాదిలో చాలారోజులపాటు డ్రైగా ఉండిపోవడం ఒక కారణం కావచ్చు… తెలుగు రాష్ట్రాల్లో గనుక ఈ ఎత్తిపోతల ఉండి ఉంటే… ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చేది..!!
Share this Article