పార్ధసారధి పోట్లూరి ……… నేపాల్ దేశంని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ [FATF] Grey లిస్ట్ లో పెట్టబోతున్నది ! నేపాల్ కి చెందిన పృధ్వీ మన్ శ్రేష్ట [Prithvi Man Shrestha] అనే విలేఖరి ఖాట్మండు పోస్ట్ అనే పత్రికకి రాజకీయ, అవినీతి, శాసనపరమయిన విషయాల మీద ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటాడు. ఇటీవలే అదే పత్రికలో అతను ఒక వ్యాసం వ్రాశాడు దాని సారాంశం: అతి త్వరలో నేపాల్ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో పెట్టబోతున్నది. ఇదేమీ తేలికగా తీసుకునే వార్త కాదు. నేపాల్ దేశపు దశ, దిశని మార్చబోయే అంశం.
****************************************************
నేపాల్ ఇప్పటికే పీకల్లోతు కష్టాలలో ఉంది. దానికి తోడు గ్రే లిస్ట్ లోకి వెళ్ళిపోవడం అంటే అది ఆత్మహత్యతో సమానం అవుతుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏవైతే విధి విధానాలు సూచిస్తున్నదో వాటిని అమలు చేయడంలో నేపాల్ పార్లమెంట్ తరచూ విఫలం అవుతున్నది.
Ads
పారిస్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉగ్రవాదంకి దోహదం చేసే చట్టాలు, ఉగ్రవాదులకి తేలికగా ఇతర దేశాల నుండి నిధులు అందే విధంగా ఉన్న మనీ ట్రాన్స్ఫర్ విధానాలని కట్టడి చేయాల్సి ఉంటుంది. మనీ లాండరింగ్ కోసం ప్రత్యేకంగా FATF సూచించిన విధంగా చట్టాలు రూపొందించాల్సి ఉంటుంది. FATF విధి విధానాలని పాటించని దేశాలని FATF మొదట Grey లిస్ట్ లో పెడుతుంది ఆపై 6 నెలల గడువు ఇస్తుంది అప్పటికీ FATF సూచించిన వాటిని అమలు చేయకపోతే ఆయా దేశాలని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. దీనివలన అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలు గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలకి రుణాలు ఇవ్వాలంటే అత్యధిక రిస్క్ ఉన్నట్లుగా భావించి రుణాల మంజూరు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి. అదే బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఏ సంస్థ కూడా రుణం ఇవ్వదు పైగా ఏ దేశం కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్న దేశంతో వర్తక, వాణిజ్య లావాదేవీలు చెయ్యవు.
**********************************************************
ఆసియా పసిఫిక్ గ్రూప్ [APG] కి చెందిన ప్రతినిధులు ఇటీవలే రెండు వారాల పాటు నేపాల్ లో పర్యటించారు. ఆసియా పసిఫిక్ గ్రూపు అనేది FATF కి ఆసియా పసిఫక్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే నేపాల్ లో పర్యటించిన APG ప్రభుత్వ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మొత్తం 15 చట్టాలు FATF కి అనుగుణంగా లేవని గుర్తించింది. గత సంవత్సరం FATF తమ సూచనలని అమలు చేయాల్సిందని నేపాల్ దేశానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు FATF కి చెందిన రీజనల్ సంస్థ APG నేపాల్ లో పర్యటించి గతంలో FATF సూచించిన చట్ట సవరణలు మరియు మనీ లాండరింగ్ ని అరికట్టే విధంగా కొత్త చట్టాల రూపకల్పన వాటి అమలు లాంటి వాటిని పరిశీలించిన మీదట 15 నేపాల్ చట్టాలు మనీ లాండరింగ్ మరియు ఉగ్ర వాద కార్యకలాపాలకి అనువుగా ఉన్నాయని తేల్చి చెప్పింది అంతే కాదు FATF సూచించిన విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తించింది ! తాము కనుక్కున్న అంశాలని పారిస్ ప్రధాన కేంద్రంగా ఉన్న FATF కి తమ నివేదికని అందచేసింది. 2023 మార్చి నెలలో పారిస్ లో FATF సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో గడువు ఇచ్చినా లెక్క చేయకుండా ఉన్నందుకు నేపాల్ ని గ్రేలిస్ట్ లో పెడుతుంది FATF.
***********************************************************
గత నెలలో నేపాల్ లో పర్యటించిన APG గ్రూపు సభ్యులు 2022 డిసెంబర్ నెల 16 వరకు నేపాల్ ప్రభుత్వం ఎలాంటి చట్ట సవరణలు చేసిందో అన్నదానిమీదనే తన నివేదికని ఇస్తుంది అన్నది గమనార్హం ! గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్నది. మరీ ముఖ్యంగా చైనా, పాకిస్థాన్ దేశాలతో చెట్టా పట్టాలు వేసుకొని భారత్ ని దూరం పెడుతూ వచ్చింది. ఫలితంగా నేపాల్ భారత్ ల మధ్య సరిహద్దు వివాదాలని రేకెత్తించడంలో చైనా, పాకిస్థాన్ లు సఫలం అయ్యాయి. 2016 లో చైనా తమ దేశం నుండి నేపాల్ వరకు హై స్పీడ్ రైల్వే లైన్ వేయడానికి ప్రతిపాదనలు చేసింది నేపాల్ లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి. అయితే రైల్వే లైన్ వల్ల చైనాకి తమ వస్తువులని నేపాల్ డంప్ చేయడానికి పనికివస్తుంది తప్పితే నేపాల్ కి ఎలాంటి లాభం ఉండదు… కానీ రైల్వే లైన్ వేయడానికి అయ్యే ఖర్చులో 50% నేపాల్ భరించాల్సి ఉంటుంది. నేపాల్ నుండి చైనాకి ఎగుమతి అయ్యేవి ఏమీ ఉండవు. చైనా ఉచ్చులో నేపాల్ పడి ఇప్పటికే 7 ఏళ్లు అవుతున్నది.
************************************************************
చైనా జోక్యం వలన గత 6 ఏళ్లుగా నేపాల్ లో రాజకీయ అనిశ్చిత నెలకొని ఉన్న కారణంగా అక్కడ పరిపాలన కుంటుపడింది. నిజానికి FATF నేపాల్ ని గ్రే లిస్ట్ లో ఉంచే ప్రమాదం పొంచి ఉన్నా, అక్కడి రాజకీయ నాయకులు ఒకరితో ఇంకొకరు కొట్టుకోవడంలో తలమునకలు అయి ఉన్నారు తప్పితే రాబోయే ప్రమాదం గురించి ఏ మాత్రం భయపడట్లేదు ! 2008 నుండి 2014 వరకు నేపాల్ FATF గ్రే లిస్ట్ లో కొనసాగింది. దాంతో ఆరేళ్ళ పాటు నేపాల్ ఆర్ధికంగా నష్టాల పాలు అయ్యింది కానీ ఈ పరిస్థితిని చైనా బాగా వాడుకున్నది.
***************************************************************
2008-2014 గ్రే లిస్ట్ అనుభవాల దృష్ట్యా మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి నష్ట నివారణ చర్యలో భాగంగా FATF చెప్పిన వాటిని అమలు చేయడానికి తాత్కాలికంగా ఆర్డినెన్స్ తెచ్చింది. కానీ దానికి నేపాల్ అధ్యక్షుడి ఆమోద ముద్ర పడాల్సి ఉండగా అధ్యక్షుడు రాజకీయపరమయిన కారణాల చేత ఆ ఆర్డినెన్స్ కి ఆమోద ముద్ర వేయలేదు… ఈ లోపు నేపాల్ పార్లమెంట్ రద్దు అవడంతో ఆ ఆర్డినెన్స్ కాస్తా తనంత తానే రద్దు అయిపోయినట్లయింది !
************************************************
గతంలో ఒకసారి గ్రే లిస్ట్ లోకి వెళ్ళి 6 ఏళ్ల పాటు అది కొనసాగింది కాబట్టి ఈసారి ఏప్రిల్ నెలలో బ్లాక్ లిస్ట్ లో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. శ్రీలంక లాగానే నేపాల్ కూడా పూర్తిగా టూరిజం మీద ఆధారపడి డాలర్లు సంపాదిస్తున్నది. మరో వైపు విదేశాలలో ఉన్న నేపాల్ పౌరులు తమ దేశానికి పంపే డాలర్ల విలువ చాలా తక్కువ. ఎక్కువ మంది నేపాల్ పౌరులు భారత్ లో పనిచేస్తూ తమ దేశానికి డబ్బు పంపిస్తూ ఉంటారు. శ్రీలంక లాగానే నేపాల్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ కోసం భారత్ మీదనే ఆధారపడుతున్నది ! కోవిడ్ వల్ల దాదాపుగా రెండేళ్ళు టూరిజం పూర్తిగా ఆగిపోవడం వలన నేపాల్ దగ్గర డాలర్ రిజర్వ్ పెద్దగా లేదు కానీ ఎక్కువ శాతం భారత్ నుండే దిగుమతి చేసుకుంటున్నది కాబట్టి ఇన్నాళ్ళూ నెట్టుకొస్తూ వచ్చింది. ఇప్పుడు FATF గ్రే లిస్ట్ లో పెట్టినా అది మరింత ఆర్ధిక నష్టానికి దారి తీస్తుంది.
చైనాకి కావలసింది ఇదే ! పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఎంత ఆర్ధికంగా నష్టపోతే చైనాకి అంత సంతోషం ! ఏదో ఒకరంగా మభ్యపెట్టి అప్పులు ఇచ్చి, అవి తిరిగి కట్టలేక చైనా సైనిక స్థావరాల కోసం తమ భూములని ఇచ్చే పరిస్థిని తీసుకొస్తుంది చైనా. శ్రీ లంక, పాకిస్థాన్ దేశాలు అదే పనిచేశాయి కదా ! బంగ్లాదేశ్ కూడా చిట్టగాంగ్ రేవుని అధికారికంగా చైనా వాడుకోవడానికి అనుమతి ఇచ్చే సమయంలో మోడీ అభ్యంతరం చెప్పడంతో ప్రమాదం తప్పిపోయింది !
Share this Article