ఏదో ట్వీట్లో కనిపించింది… మొన్నటి వారం బిగ్‌బాస్ కు ఎలిమినేషన్ల అంశంలో 9.5 కోట్ల వోట్లు వస్తే, అందులో 3.85 కోట్ల వోట్లు అభిజిత్‌కే పడ్డాయట… నిజం కావచ్చు, కాకపోవచ్చు కానీ… ప్రతివారం తను నామినేట్ అవుతూనే ఉంటాడు… ప్రేక్షకుల నుంచి ప్రతివారం తన వోట్లు పెరుగుతూనే ఉంటయ్… అది తను ముందస్తుగా బయట ఏర్పాటు చేసుకున్న వోటింగ్ బ్యాచుల వల్ల కావచ్చు, నిజంగానే అభిజిత్ ఆటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండటం వల్ల కావచ్చు…
అయితే విషయం ఏమిటంటే..? ఇప్పుడు ఆ అభిజిత్ బ్యాచులన్నీ ఒక కర్తవ్యంగా మోనాల్‌కు వోట్లు వేసి సేవ్ చేయాలి… అదేమిటి..? మొదట్లో లవ్ చేసినట్టు నటించి, వదిలేసి, అభిజిత్‌ను బాగా ద్వేషించే అఖిల్‌తో లవ్ ట్రాక్ నడిపే ఆ మోనాల్‌ను మేం ఎందుకు సేవ్ చేయాలి అంటారా..? ఎందుకంటే..? అభిజిత్ కోసం హారిక మోనాల్‌ను బలిపెట్టింది కాబట్టి… ఎలిమినేషన్ వైపు నెట్టేసింది కాబట్టి… నిజానికి హారిక అభిజిత్‌ను నామినేషన్ నుంచి తప్పించాల్సిన అవసరమే లేదు… అభిజిత్ ఎలాగూ సేవ్ అవుతాడు, తనకున్న బలమైన సపోర్ట్ అది… అది విస్మరించి, మొన్న కెప్టెన్‌గా తనను గెలిపించిన మోనాల్‌ను హారిక బలిపెట్టడం కరెక్టు కాదు…
Ads
మోనాల్ ఒకప్పటి ఏడుపు గొట్టు, పనిదొంగ మోనాల్ కాదు… మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తోంది… ఒక్కసారిగా తనలో చాలా తేడా కనిపిస్తోంది… అఖిల్ ఆమెతో ఈరోజు పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాడు… ఎందుకు..? ఓ పిచ్చి వాదన… అఖిల్ మరోసారి ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్ అయిపోయాడు… మొన్న హారికను గెలిపించినందుకు మోనాల్ మీద కసిగా రగిలిపోయాడు… తనను ఎత్తుకోవాల్సి ఉండిందా..? లేక హారికను మధ్యలోనే పడేయాల్సి ఉండిందా..? ఈరోజూ అలాంటి వాదనే… నన్ను సేవ్ చేసి, నువ్వు నామినేట్ అయిపో అంటాడు… అదెలా..? ఆమె వీక్ కాబట్టి, ఆమె రక్షింపబడాలీ అంటే… తనను స్వాపింగ్ అడగకూడదు… అడిగి, వెటకారంగా వెక్కిరించి, ఇక అన్నీ మరిచిపో అని విడాకులిస్తున్నట్టుగా మగ అహాన్ని ప్రదర్శించాడు… తను స్ట్రాంగ్ అనుకున్నప్పుడు, మోనాల్ వీక్ అనుకున్నప్పుడు అలా అడగకూడదు కదా…
ఇక హారిక కూడా అంతే మెంటల్… నేను ఎవరినీ స్వాపింగు అడగడం లేదు బిగ్‌బాస్ అంటూ అభిజిత్ తిరస్కరించాడు… అందులో బలవంతం ఏమీ లేదు… సేమ్, హారిక కూడా అదే టైపులో నేను ఎవరినీ స్వాప్ చేయను, ఆ చాన్స్ నేను ఉపయోగించుకోవడం లేదు అని చెప్పేస్తే హారిక ఓ అయిదారు మెట్లు పైకి ఎక్కేది… మోనాల్ పట్ల కృతజ్ఞత చూపించినట్టూ అయ్యేది…
సో, ఏరకంగా చూసినా మోనాల్ బాధితురాలు… పైగా మోనాల్ తల్లి కూడా అభిజిత్ నా ఫేవరెట్ అని వేదిక మీద బాహటంగా మెచ్చుకుంది… మోనాల్‌తో ఎన్ని గొడవలున్నా సరే, ఆమె తల్లి అభిజితే మై ఫేవరెట్ అన్నందుకు… దాంతో కనెక్టయిపోయిన అభిజిత్ ఇక మోనాల్‌ను స్వాపింగ్ అడగలేదు… అదీ కనెక్టయ్యే విధానం… ఆ ప్రేమను తిరిగి ప్రదర్శించాడు అభిజిత్… ఈ ఫీల్ హారికకు అర్థం కాదు, కాలేదు… అందుకే మోనాల్ ని బలి ఇస్తోంది… సో, ఏరకంగా చూసినా మోనాల్‌ను సేవ్ చేయాల్సిన కర్తవ్యం ఏదో అభిజిత్ బ్యాచులపైనే పడింది ఇప్పుడు… కుమ్మేయండి ఇక…
అవునూ, రేపు ఇంకొకరిని నామినేషన్ల నుంచి బయటపడేందుకే బిగ్ బాస్ ఏదో కొత్త పోటీ పెట్టినట్టున్నాడుగా… చూద్దాం… Flowers వెతికి పట్టుకునే పోటీలో అవినాష్ ఈసారికి గట్టెక్కాడట… అదే నిజమైతే ఇక ఈసారి డేంజర్ జోన్ లో అరియానా ఇరుక్కున్నట్టే… అఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి… మోనాల్‌కు అభిజిత్ బ్యాచ్ సపోర్ట్ దొరకాల్సిందే కాబట్టి…
ఏమాటకామాట… అఖిల్, సొహెయిల్ నడుమ మంచి భావోద్వేగ, స్నేహబంధం కనిపించింది ఈరోజు ఆటలో… గుడ్… ఎటొచ్చీ బిగ్‌బాస్ చెప్పిన ట్రాప్‌లో పడి, తమ మెదళ్లతో ఆడకుండా, బిగ్‌బాస్ చెప్పినట్టు పరుగులు తీస్తూ అరియానా, అవినాషే అటూఇటూ గాకుండా కనిపిస్తున్నారు… చివరకు ఇప్పుడు అరియానా దొరికిపోయినట్టుగా ఉంది…!!
చివరగా :: ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న కుమారసాయి ఏ క్షణంలోనైనా హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వవచ్చు… అబ్బే, గెలుపు కాదు, అంత సీనూ లేదు… మరీ ఆరేడుగురే మిగిలిపోతున్నారు కదా, షోలో మజా ఉండాలి కదా… అందుకోసం అన్నమాట… మళ్లీ ఆటలో అరటిపండు… అంతే…
Share this Article