IDF-ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్! IDF మునపటి లాగా లేదు! ఇజ్రాయెల్ గతంలో లాగా శక్తివంతంగా ఇప్పుడు లేదు…73 ఏళ్ల మాజీ IDF అధికారి వ్యాఖ్య ఇది…. ఈ 73 ఏళ్ల IDF అధికారి 2006 లో లేబనాన్ లోని హెజ్బొల్లా తో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి సర్వీస్ నుండి రిటైర్ అవ్వాల్సి వచ్చింది! సదరు IDF అధికారి గతంలో ఉన్న IDF కి ఇప్పటి IDF కి తేడా ఏమిటో చెప్పాడు… ఆయన మాటల్లో…
1948-ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడ్డ రోజులు! 1948 నాటికి ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రాంతంలో యూదులు కొద్ది సంఖ్యలో స్వంత ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డాక అమెరికాలో ఉన్న ధనవంతులు అయిన యూదులు డబ్బులు పంపించారు స్థలాలు కొనమని. కానీ యూదు జనాభా తక్కువగా ఉండడంతో ప్రపంచములో వివిధ దేశాలలో ఉన్న యూదులకి ఇజ్రాయేలీ ప్రభుత్వం ఇజ్రాయేలీ పొరసత్వం ఇస్తామని ప్రకటించగానే యూదులు తిరిగి ఇజ్రాయెల్ రావడం స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నారు.
*******************
Ads
1948 ఇజ్రాయెల్ – అరబ్ యుద్ధం! యూదులకి ఒక దేశం ఏర్పడడాన్ని సహించలేని జోర్డాన్, సిరియా, ఈజిప్టు, ఇరాన్ ఇలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి! అప్పట్లో మా దగ్గర అమెరికా, బ్రిటన్ దేశాలు ఇచ్చిన కొద్దిపాటి ఆయుధాలే ఉన్నాయి కానీ అందరం కలిసి ఎదుర్కొని అరబ్ దేశాలని ఓడించాము. ఇదంతా నేను యుక్త వయసుకి వచ్చాక మా నాన్న చెప్పాడు నాకు.
సంఖ్యలో కానీ, ఆయుధాల విషయంలో కానీ యూదులు తక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ మమ్మల్ని ఏ శక్తి నడిపించింది? “3000 సంవత్సరాల అణిచివేత తరువాత మళ్ళీ మా దేశాన్ని మేము పునర్మించుకుంటున్న సమయంలో ఈసారి వదులుకోకూడదు అనే పట్టుదల మాత్రమే మమ్మల్ని విజయం వైపు నడిపించింది”
******************
IDF ఏర్పడిన తరువాత 1960, 1970 లలో మేము మరింత బలపడ్డాము. మాకు ఏవి కావాలన్నా మేమే తయారు చేసుకోవడం మొదలుపెట్టాము. ఎడారి లో పంటలు పండించడం నేర్చుకున్నాము. క్రూడ్, సహజవాయువు నిక్షేపాలని వెతికి మా అవసరాలకి ఎవరి మీదా ఆధారపడకుండా చేసుకున్నాము. ఇదంతా మమ్మల్ని 3 వేల ఏళ్లుగా అణిచివేసిన కసి నుండి స్ఫూర్తిని పొంది చేశాము.
******************
ఇజ్రాయెల్ ప్రజలు కానీ IDF కానీ అంకిత భావంతో ఉన్నారు. 2000 సంవత్సరం నుండి క్రమంగా అలసత్వం మొదలయ్యింది. ఆ అలసత్వం ప్రభావం 2006 హెజ్బొల్లా తో జరిగిన యుద్ధంలో బయటపడింది. మొత్తం 600 మంది IDF సైనికులు మరణించారు 2006 లో. నేను తీవ్రంగా గాయపడ్డాను. ఆయుధాల పరంగా చాలా నష్టమే జరిగింది ఇజ్రాయెల్ కి. అసలు కారణమేమిటో చెప్పనా? 2006 నాటి యువకులలో మనదే పైచేయి అనే అతి విశ్వాసంతో సన్నద్ధంగా లేకపోవడమే!
*****************
నేను యువకుడిగా ఉన్నప్పుడు సైన్యంలో చేరిన రెండేళ్ల తరువాత అట విడుపుగా భారత దేశము వెళ్ళలేదు. నాతోపాటు పనిచేసిన వాళ్లలో ఎక్కువ మంది భారత్ వెళ్లారు విహారయాత్రకి! అయితే 2000 సంవత్సరం నుండి మొక్కుబడిగా రెండేళ్ల సైనిక శిక్షణ తీసుకోవడం వెంటనే భారత్ వెళ్లడం ఆనవాయితీగా మారింది. మా ఇజ్రేయిలీ లకి భారత్ సురక్షితమైన దేశం!
********************
ఇజ్రాయెల్-ఆధునిక టెక్నాలజీ! 60 వ దశకం నుండి అన్ని రంగాలలో టెక్నాలజీ పరంగా ముందు ఉన్నాము కానీ గత 20 ఏళ్ల నుండి టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ది చెందడంతో యువకులు శారీరకంగా బలహీన పడుతూ వచ్చారు కానీ ఈ విషయం ఎవరూ గుర్తించలేదు. ఇప్పటి తరం ఇజ్రాయేలీ యువకులు గత చరిత్ర తాలూకు బలిదానాల విషయంలో అలసత్వంగా ఉంటున్నారు! అదే 2023 అక్టోబర్ 7 విషాదానికి కారణం!ఆధునిక టెక్నాలజీ ఉండడం మంచిదే కానీ అదే సమయంలో సైనికుల దేహ దారుఢ్యమ్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ప్రస్తుతం అదే లోపించింది!
********************
IDF కానీ మొస్సాద్ కానీ అజేయ శక్తులు కాదు! మొస్సాద్ ఏజెంట్లు చాలా దేశాలలో చంపబడ్డారు! IDF కి ప్రస్తుత యుద్ధ అనుభవం లేదు! నాలెడ్జ్ ఉంది కానీ అనుభవం లేదు. అందుకే పెంటగాన్ అధికారులు గాజా మీద ఆర్మీ దాడుల విషయంలో తొందర్పడవద్దని గట్టిగా చెప్పారు. అమెరికాకి ఎక్కువ ప్రాణ నష్టం ఇరాక్ లో జరిగింది. అదీ అర్బన్ ప్రాంతాలలో ఎక్కువ మంది నాటో సైనికులు మరణించారు!
అమెరికన్ సైనికులని ఆకర్షించే విధముగా ఇరాక్ లోని తిరుగుబాటు దారులు రకరకాలుగా వ్యూహాలు పన్ని ఆ ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా విరుచుకుపడి నాటో సైనికులని చంపారు. ఇళ్లలో బూబి ట్రాప్ (Booby Trap) లని అమర్చి ఖాళీ చేసి వెళ్లిపోయేవారు ఇరాకీలు. నాటో సైనికులు ఇళ్లలోకి చొరబడి సెర్చ్ చేసే సమయంలో బాంబులు పేలి చనిపోయేవారు. బూబీ ట్రాప్ కి ఆ పేరు ఎలా వచ్చింది? 16 శతాబ్దంలో సముద్రంలో ప్రయాణించే నౌకలలో ఉండే నావికులు ఆహారం కోసం సముద్ర పక్షి అయిన బూబీని రకరకాల పద్దతులలో ఉచ్చు వేసి వాటిని పట్టి తినే వారు. బూబి పక్షి పేరుతో బూబి ట్రాప్ అనే పేరు స్థిరపడిపోయింది.
*****************
అక్టోబర్ 7 న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇంతవరకూ గాజా మీద IDF ఆర్మీ దాడి చేయకపోవడానికి కారణం అమెరికా ఇచ్చిన సలహా వలనే! అమెరికా కానీ ఇతర నాటో దేశాలకి కానీ భూమి మీద శత్రువుతో ముఖాముఖి తలపడిన సందర్భాలలో చేదు అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎయిర్ ఫోర్స్, నావీలతో యుద్ధం చేయడంలో బాగా అనుభవంతో పాటు విజయాలు ఉన్నాయి! గతంలో ఇజ్రాయెల్ విజయాలు సాధించి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ స్థితి లేదని స్పష్టంగా చెప్పగలను. ఇలా ఆ మాజీ IDF అధికారి చెప్పుకొచ్చాడు….. — పార్ధసారధి పోట్లూరి
Share this Article