.
ఇప్పుడు ప్రపంచం బ్రహ్మోస్ గురించి చర్చిస్తోంది… పలు దేశాలు మాకు కావాలి అంటే మాకు కావాలి అంటూ ఆర్డర్లకు రెడీ అయిపోతున్నాయి… ప్రస్తుతం బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రం… అది ఒక అస్త్రం మాత్రమే కాదు, భారత్ యుద్ధ సామర్థ్యానికి బలమైన సూచిక…
పాకిస్థాన్ గగనతల రక్షణకు ఉద్దేశించిన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS) ని భోలారి ఎయిర్ బేస్ లో బ్రహ్మోస్ ఎలా దెబ్బతీసిందో… పాకిస్తాన్‌కు చెందిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఇస్లామాబాద్ లో మాట్లాడుతూ అంగీకరించాడు… యుద్దం కోణంలో ఇండియా ఎగరేసిన గర్వపతాక అది…
Ads
అసలు ఏమిటి దీని స్పెషాలిటీ… ఒక ఉరుము ఉరిమి, పిడుగుపడితే ఆ శబ్దం ఎంత వేగంతో మన చెవులకు చేరుతుందో అంతకు మూడు రెట్ల వేగం ఈ బ్రహ్మోస్ క్షిపణిది… అంటే గంటకు ౩౭౦౦ KMPH … అంతేకాదు, ఖచ్చితత్వంలో టాప్… తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుతుంది… అందుకే ఫైర్ అండ్ ఫర్‌గెట్ అంటారు దీన్ని…
భూమి, సముద్రం, గగనం… ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు… 300 కిలోమీటర్ల నుంచి కొన్నిసార్లు 800 కిలోమీటర్ల రేంజ్… అంతేకాదు, శత్రుదేశాల రాడార్లు పసిగట్టకుండా గోప్యంగా, వేగంగా, ఖచ్చితత్వంతో టార్గెట్‌ను కొట్టేయగలదు… శత్రుదేశాలు గొప్పగా చెప్పుకునే గగనతల రక్షణ వ్యవస్థల్ని కూడా బ్రహ్మోస్ ఛేదించుకుని వెళ్తుంది…
ఈ మిస్సైల్‌ను ఇప్పటివరకు భారత నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ప్రవేశపెట్టారు… మిగ్-29, మిరాజ్ 2000, తేజస్ వంటి చిన్న విమానాలకూ ఇప్పుడు సరిపోయేలా బ్రహ్మోస్- నెక్స్ట్ జనరేషన్ (NG) వెర్షన్ అభివృద్ధిలో ఉంది…
ఈ బ్రహ్మోస్ మనల్ని ప్రపంచశక్తిగా నిలబెట్టగలదు అంటే అతిశయోక్తి కాదు… ఆల్రెడీ మనం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ… ఇక మన ఆకాశ్ తీర్, బ్రహ్మోస్, ఎస్-400 మనల్ని దుర్బేద్యమైన శక్తిగా నిలబెట్టడమే కాదు… ఆయుధాల అమ్మకపు మార్కెట్‌లోకి మనమూ బలంగా అడుగుపెట్టబోతున్నాం…
పాకిస్థాన్ మీద ప్రయోగించి, మన అస్త్రాల నాణ్యత ఏమిటో ప్రపంచానికి పరీక్షించి చూపించాం… అదీ చెప్పదలిచింది… ఒక రిపోర్ట్ ప్రకారం పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయడమే కాదు, 9 ఉగ్రవాద స్థావరాలు, 11 ఎయిర్ బేస్‌లను కూడా ధ్వంసం చేసిన ఇండియా మొత్తమ్మీద 47 మంది పాకిస్తాన్ మిలిటరీ అధికారుల్ని, 170 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది…
యుద్ధ సామగ్రి అమ్మకాల్లో, అభివృద్ధిలో ఇజ్రాయిల్, రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్ మాత్రమే కాదు… ఇక ఇండియా కూడా…! మన డీఆర్డీవో నైపుణ్యం అది… ఇండియాను మొన్నటి ఘర్షణ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది బ్రహ్మోస్ పుణ్యమాని…
ఫిబ్రవరి 1998లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం… మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ప్లస్ రష్యాకు చెందిన NPO షినోస్ట్రోయెనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ రెండు దేశాల మిత్రుత్వానికి ప్రతీక … దీని పేరు మన బ్రహ్మపుత్ర, రష్యాలోని Mashinostroyenia అనే రెండు నదుల పేర్ల నుంచి రెండు పదాలు తీసుకుని పెట్టారు…
ప్రపంచానికి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది… బివేర్ ఆఫ్ బ్రహ్మోస్… [[ గోపు విజయకుమార్ రెడ్డి ]]
Share this Article