.
అధ్వానమైన ఆటతీరుతో ఈసారి ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు చతికిలపడిపోయిన ముంబై టీమ్ చచ్చీచెడీ మరో మ్యాచ్ గెలిచి, పాయింట్ల పట్టికలో కాస్త పైకి చేరింది…
నిన్న ఢిల్లీ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ దశలో ముంబై మళ్లీ ఓడిపోయినట్టే అనుకునే స్థితి… ప్రత్యేకించి కరుణ్ నాయర్ దంచుడు విస్మయాన్ని కలిగించింది…
Ads
తను ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే, ముంబైకు మరో దారుణమైన ఓటమి తప్పకపోయేది… ఢిల్లీ ఇప్పటివరకు కోల్పోయింది ఇదొక్కటే మ్యాచ్, మిగతావన్నీ గెలిచి పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉంటోంది…
నిజానికి ఎప్పుడూ కప్పు గెలవనివి, గెలుస్తాయని ఆశలు లేనివి, అండర్ డాగ్సే బాగా ఆడుతున్నాయి ఈసారి… ఢిల్లీ, గుజరాత్, లక్నో, పంజాబ్… రాబోయే రోజుల్లో వీటి ఆటతీరు ఇంకా చూడాల్సి ఉంది… హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న చెన్నై పూర్, పూరర్, పూరెస్ట్ పర్‌ఫామెన్స్ ఈసారి… అఫ్‌కోర్స్, హైదరాబాద్ టీమ్ కూడా…
కొంతలోకొంత బెంగుళూరు బెటర్ పర్‌ఫామెన్స్ చూపిస్తోంది… కరుణ్ నాయర్ విషయానికి వస్తే తను వేలంలో అమ్ముడుపోలేదు… కానీ తన బెస్ట్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్ తనను 50 లక్షలకు జట్టులో చేరేలా సాయం చేశాడు… తను ప్రూవ్ చేసుకున్నాడు, తనకు అండగా ఉన్న తన స్టేట్ టీమ్ ఆటగాడు రాహుల్ నమ్మకాన్ని, మాటను నిలబెట్టాడు…
నిజానికి అన్ని దేశీయ ట్రోఫీల్లో టాప్ స్కారర్, బోలెడు రికార్డులు కరుణ్ నాయర్‌వే… కానీ భారత జట్టులోకి మాత్రం రానివ్వలేదు తనను… ఏవో పాలిటిక్స్… విసిగిపోయి, ఎంత ఆవేదనతో ఈ ట్వీట్ పెట్టాడో చూడండి ఓసారి… 2022 లో…
ప్రపంచంలో ప్రస్తుతం మేటి బౌలర్లలో ఒకడైన బుమ్రా బౌలింగును కూడా కరుణ్ నాయర్ ఓ రేంజులో ఆడుకున్న తీరు నిజంగా విశేషమే,.. మొన్నటి అభిషేక్ శర్మ కథ మరో ఇంట్రస్టింగ్ కదా… 14 కోట్లతో తనను హైదరాబాద్ జట్టు రిటెయిన్ చేసుకుంది…
కానీ పూర్ పర్‌ఫామెన్స్, ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి దంచికొట్టాడు కదా మొన్న… జేబులో నుంచి ఓ నోట్ తీసి This one is for orange army అని అందరికీ చూపించాడు కదా… అయితే మొదటి మ్యాచ్ నుంచీ ఆ నోట్ తన జేబులో ఉంచుకునే ఆడుతున్నాడనీ, ఈరోజు 141 రన్స్‌తో మొమరబుల్ ఇన్నింగ్స్ ఆడి, ఫామ్‌లోకి వచ్చాక ఆ నోట్ ప్రదర్శించాడని తోటి ఆటగాడు ట్రావిస్ హెడ్ వెల్లడించాడు… భలే ప్లేయర్లు దొరికారబ్బా ఈసారి..!!
Share this Article