నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త కాబట్టి… దొరవారి అభీష్టమే అనుకుందాం… అఫ్‌కోర్స్, రాసుకోగానే అది జరుగుతుందని కాదు… ఎట్‌లీస్ట్, మాటవరుసకైనా అన్నాడు కాబట్టి చెప్పుకోవడం…! పత్రికలో బొచ్చెడు ఫోటోలొచ్చినయ్… యాదగిరిగుట్ట పునఃప్రారంభోత్సవం అచ్చంగా ఓ పార్టీ కార్యక్రమంలాగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు… వేరే పార్టీలవాళ్లు లేరు, లోకల్ ఎంపీకి పిలుపు లేదు, గవర్నర్‌కు ఆహ్వానం లేదు, ఓ ధార్మిక కార్యక్రమంలాగా గాకుండా స్వరాజకీయ ధర్మకార్యక్రమంలా గోచరించింది… వస్తారా, రారా జానేదేవ్… పిలిస్తే ఏం పోయింది..? నెవ్వర్, కేసీయార్ ఆ పనిమాత్రం చేయడు…
సరే, ఇలాంటి కొన్ని చివుక్కులు, కలుక్కులు ఉన్నా సరే… ఒక్కటి మాత్రం మెచ్చుకోవచ్చు… పునర్నిర్మాణ సంకల్పం… సెక్యులర్ పాతివ్రత్యం తొక్కాతోలూ వంటివేమీ ఆలోచించకుండా తను అనుకున్నది నెరవేర్చాడు… ఓ భవ్యమైన మందిరం సాకారమైంది… ఎవరొచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు అలిగారు వంటివి అప్రస్తుతం… కేసీయార్ మొండి పట్టుదల గురించి కాసేపు విస్మరిస్తే… భగవంతుడే అన్నీ అనుకునే ఆ విశాఖ స్వరూపుడు గానీ, ఈ ముచ్చింతల్ జియ్యరుడు గానీ… వాళ్లే స్వయంగా భక్తిగా గుడికి వెళ్తే అధికారులు అడ్డుపడి తలుపులు మూసేస్తారా ఏం..?
ఏమాటకామాట… గుడి వారు ప్రకటించిన రేట్లు రీజనబుల్‌గా ఉన్నయ్… మరీ ఆర్ఆర్ఆర్ స్థాయిలో మండిపోవడం లేదు… గుడ్… కానీ ఇవి ఎన్నాళ్లు అని మనం చెప్పలేం… శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం రేట్లు మరీ తక్కువగా ఉన్నయ్ సారూ… అత్యంతాతి వేగదర్శనమ్ పేరిట 500 రేటు పెట్టితే బాగుండేది… అన్నట్టు, ప్రసాదం ధరలు ప్రకటించడం లేదెందుకో…!!
Ads
అసలు ఇవి కావు… చర్చను రేకెత్తించిన వార్త మరొకటి… నర్సన్న సేవను పూర్తి చేసిన ప్రభువుల వారు ఇక వేములవాడ (ఎములాడ రాజన్న) గుడిని ఉద్దరించడానికి కదిలి వెళ్తాడట… (సారూ, నీకు దండం పెడతం, వేమాద్రి అని పిలవకండి ప్లీజ్)… మరి ఇన్నేళ్లు ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి… ఓ సెంటిమెంట్ కథ రాయించాడు… తన పెళ్లి ఎములాడలో అయ్యిందట, అందుకని తన మనసుకు ఆ గుడి ఎప్పుడూ కనెక్టయి ఉంటుందట… ఇప్పుడే ఆ సంగతులన్నీ హఠాత్తుగా యాదికి వచ్చినయట… (ఫోటో, వార్త రాసిన తీరు బాగున్నయ్…) నిజంగా అంత భక్తి, అంత ప్రేమ, అంత సెంటిమెంట్ ఉంటే ఇప్పటికీ ఎములాడ ఎవరికీ పట్టకుండా ఎందుకు ఉండిపోయిందనే ప్రశ్నకు జవాబు దొరకదు… అది బ్రహ్మరహస్యం అన్నమాట…
ఇప్పటికైనా ఏదో జరుగుతుందని అనుకోలేం… అప్పట్లో ఎవరో చెప్పారు కదా… అసలు జియ్యర్ చెప్పిండని కాదు, స్వతహాగా వెలమలు వైష్ణవులు, అందుకే యాదగిరిగుట్ట మీద ప్రేమ కుదిరింది, ఎములాడను వదిలేశారు అని…! నిజానికి అదీ నమ్మబుల్ కాదు… నిజంగానే కేసీయార్‌కు వైష్ణవం మీద ప్రేమ, భక్తి బాగా ఉంటే… ఎములాడను వదిలేయండి, భద్రాచలాన్ని ఎందుకు వదిలేశాడు..? చివరకు ముత్యాల తలంబ్రాలు తీసుకుపోవడం లేదు కదా… ఓసారి మనమడికి బాధ్యత అప్పగించినట్టున్నాడు కూడా…
శృంగేరికి వెళ్లి, అక్కడి పీఠాధిపతిని అడిగి, వాళ్ల పర్యవేక్షణలో ఎములాడ డెవలప్‌మెంట్ చేస్తాడట… సరే, మంచిదే… చేస్తాడనే ఆశిద్దాం… ఏం సారూ..? ఇవేమైనా నీటి ప్రాజెక్టులా..? ఒకటి అయ్యాక ఇంకొకటి తీసుకోవడానికి..? ఇన్నేళ్లు ఏమిచ్చినవ్, ఏం చేసినవ్ అని ఎవరూ అడగరు కదా… (నిజానికి పాలకస్థానంలో ఉన్నవాళ్లకు శైవం, వైష్ణవం తేడాలు ఉండకూడదు…) (శృంగేరీ కేసీయార్‌కు కొత్తేమీ కాదు, వాళ్లకు ఈ కిషన్‌రావులు, ఆనందసాయిలు కూడా అవసరం లేదు… అన్నీ వాళ్లే నిష్ఠగా చేయగలరు…) పనిలోపనిగా కొండగట్టు (ఆంజనేయస్వామి గుడి)ను కూడా మస్తు డెవలప్ చేస్తాడట… ఇవన్నీ సరే గానీ… అయినప్పుడు ఆనందిద్దాం గానీ…
ఈరోజుకూ భద్రాచలం పేరు ఎత్తడం లేదెందుకు..? నిజానికి పాలకుడి సహకారం కావాల్సిందే ఆ గుడికి… ఆ రాముడి మీద కేసీయార్‌కు ఎందుకు వ్యతిరేకత ప్రబలిందో తెలియదు… అదీ వదిలేస్తే… ఎములాడ గుడి ఉద్దరణను సీఎల్‌రాజంకు అప్పగిస్తాడని అదే నమస్తేలో ఓ వార్త… రాజం తెలుసు కదా… నమస్తే తెలంగాణ వ్యవస్థాపకుడు, ఫాఫం, కేసీయార్‌కు వదులుకోవాల్సి వచ్చింది…
నమస్తే తెలంగాణను వదిలించుకుందామని అటు యశోద వాళ్లను, ఇటు రాజంను అప్పుడప్పుడూ అడుగుతూనే ఉన్నాడు కేసీయార్… కానీ పత్రిక అంటేనే ఈరోజుల్లో ఓ పే-ద్ద మోతకోలు యవ్వారం… తినడమే తప్ప వేరే ఫాయిదా లేదు… ఐనా ఇయ్యాల్రేపు కేసీయార్ మీడియా కానిదేముంది..? తనకు ఓ సొంత మీడియా దేనికి..? ఫాఫం, ఆయనేమో రాజ్యసభ సీటు ఆశపడుతుంటే… అదేమీ చెప్పకుండా, ఎములాడ బాధ్యతలు అప్పగిస్తాడట… భలే నచ్చింది ఆ వార్త…!!
Share this Article