.
మాగంటి సునీత అభ్యర్థిత్వం సానుభూతి వోట్లను తెచ్చి పెడుతుందని బీఆర్ఎస్ చాలా ఆశలు పెట్టుకుంది గానీ సానుభూతి వోట్లు రావడం మాటేమిటో గానీ… కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తోంది… ఇప్పుడు తాజాగా కేటీయార్ ఫుల్ డిఫెన్స్‌లోకి పడిపోయాడు ఈ వ్యవహారంలో…
- మొదటి నుంచీ చెప్పుకుందాం… మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి… ఆమెకు ఓ కొడుకు ప్రద్యుమ్మ… తరువాత గోపీనాథ్ వదిలేశాడు… వాళ్లు అమెరికాలో ఉంటున్నారు… తను సునీతను పెళ్లి చేసుకున్నాడు… ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు… ఇక్కడే అసలైన చిక్కు…
సునీతను పెళ్లి చేసుకోలేదనీ, కేవలం సహజీవనం చేశారని, అందుకని గోపీనాథ్ ఫ్యామిలీ మెంబర్‌గా సునీత అఫిడవిట్ చెల్లదని ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు… కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు… ఎందుకు..? ఫ్యామిలీ సర్టిఫికెట్ ఆమె సమర్పించింది కాబట్టి…
Ads
ఇక్కడ ఓ ట్విస్టు… అసలు ఆ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని, అది తప్పుడు సర్టిఫికెట్ అని గోపీనాథ్ మొదటి భార్య రెవిన్యూ అధికారులను ఆశ్రయించింది… ఇప్పుడు బాల్ శేరిలింగంపల్లి తహసిల్దార్ కోర్టులో పడింది….
- కుటుంబసభ్యులు తమ వివరణలను వినిపించారు, విచారణ వాయిదా పడింది… సో, ఎన్నిక వాయిదా ఉండదు… ఒకవేళ సునీత గెలిస్తే… అవును, ఒకవేళ గెలిస్తే… ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ గనుక తప్పు అని తేలితే, సునీత ఎన్నిక చెల్లదని గనుక ఎన్నికల సంఘం ప్రకటిస్తే… మళ్లీ ఉపఎన్నిక తప్పదు… (ఏమో, బీజేపీ సాయం బీఆర్ఎస్ కోరితే ఎలా ఉంటుందో… రహస్య స్నేహితులు కదా రెండు పార్టీలు…)
పోనీ, సునీత ఓడిపోతే… ఏ ప్రాబ్లమూ ఉండదు… ఆస్తులు, వారసత్వ వ్యవహారాలపై మొదటి భార్య, సునీత కోర్టులో కొన్నాళ్లు కొట్లాడుకోవాలి… కేవలం సీటును కాపాడుకోవడానికి, సానుభూతి వోట్ల కోసం సునీతను ఆదరించిన బీఆర్ఎస్ ఓటమి తరువాత పట్టించుకుంటుందనే నమ్మకం లేదు… ఏరు దాటడం వరకే సునీత కావాలి…

- ఇప్పుడు అసలైన ట్విస్టు… మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తెరపైకి వచ్చింది… ‘‘విదేశాల నుంచి కేటీయార్ వచ్చేదాకా నా కొడుకు మరణాన్ని ఎందుకు ప్రకటించలేదు, కేటీయార్ జవాబు చెప్పాలి, నన్ను ఓసారి కొడుకును చూడనివ్వండి అని కేటీయార్‌ను బతిమిలాడినా ఎందుకు పట్టించుకోలేదు..? నన్ను ఎందుకు సునీత, పిల్లలు రానివ్వలేదు ఏవో సాకులు చెప్పి..?’’ అని కేటీయార్‌ను వివాదంలో బలంగా లాగింది… లింక్ ఇదుగో…
https://www.facebook.com/reel/1184077050533026
మొదటి భార్య ఏదో చెప్పిందంటే జనం పెద్దగా నమ్మరేమో గానీ… సాక్షాత్తూ 90 ఏళ్లు దాటిన గోపీనాథ్ తల్లి చెబుతోంది… దాంతో సునీత పట్ల వోటర్లలో వ్యతిరేకత పెరిగి, కేటీయార్ ఆశించిన సానుభూతి వోట్లకు కాస్తా గండి పడే ప్రమాదం ఏర్పడింది…
అవునూ, ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ అంటే ఏమిటంటారా..? ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సమయంలో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ అవసరం పడుతుంది… ఇది అభ్యర్థి కుటుంబసభ్యుల ధ్రువీకరణ… వారసత్వ సంబంధాలు, కుటుంబ స్థితిని చెబుతుంది… ఒకవేళ దీని ప్రకారం అఫిడవిట్‌లో వివరాలు లేకపోతే చిక్కులే..!!

తాజాగా ఈ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది… మాగంటి గోపీనాథ్ సునీతను పెళ్లి చేసుకున్న చిత్రం… ఇందులో ఆయన తల్లి కూడా ఉంది… అయితే ఇది రిజిష్టర్ అయ్యిందా..? మరి మొదటి భార్య అసలు సునీతను పెళ్లి చేసుకోలేదు అంటోంది ఎందుకు..? ఈ పెళ్లి నాటికి మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదా..? అలాంటప్పుడు ఈ పెళ్లి చెల్లుతుందా..? ఆ తల్లి చెబుతున్నట్టు గోపీనాథ్ మరణంలో మిస్టరీ ఏమిటి..? అన్నీ ప్రశ్నలే… తేల్చాల్సింది ఎవరు..?!
Share this Article