ఎంతసేపూ ప్రేక్షకుల్ని నిశ్చేష్టులను చేసే భాషాపరిజ్ఙానం, సబ్జెక్టు నాలెడ్జి మాకే ఉన్నాయనే భ్రమల నుంచి ఇక బయటికి వచ్చేయండి… మీ టీవీ9 మాత్రమే కాదు, తెలుగులో ఇంకా టీవీలున్నయ్… మిమ్మల్ని భాషలో, సబ్జెక్టులో కొట్టేసే ఘనపాత్రికేయం వాళ్లకూ ఉంది… మీ రుధిరం, మీ ఆటోస్పై, మీ పోస్కో, మీ ఉప్పుడుబియ్యం పంట… ఎహె, ఆఫ్టరాల్… మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే, టీవీ5 వాడి లంజెముండల భాషను ఎన్నడూ మీ జీవితంలో మాట్లాడలేరు తెలుసా..? అది అల్టిమేట్… మన తెలుగు టీవీ జర్నలిస్టులందరూ గర్వంగా చెప్పుకోదగిన భాష… మొన్న తృటిలో తప్పిపోయింది మెగసెసే అవార్డు… లేకపోతే మీ టీవీ9 గర్వం అణిగిపోయేది… ఇప్పుడు చూడండిక, మా వంశీ వచ్చేశాడు… ఇక గజగజే… అవును గానీ, పిచ్చి పిచ్చి హెడ్డింగులు పెట్టేసి, మాకు తలతిక్కలో ఎదురేలేదని విర్రవీగే పత్రికల సబ్‌ఎడిటర్లు కూడా కాస్త గర్వం అణుచుకోవాలి…
హమ్మయ్య, వీడియో చూశారు కదా… ఏమనిపించింది… గూస్‌బంప్స్ అంటారు కదా, అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయా..? మన టీవీల జ్ఞానానికి తలెగరేయాలనీ, మేడ మీదకు ఎక్కి గొంతువిప్పి ఓసారి గట్టిగా అరవాలనీ అనిపిస్తోందా..? ఒక చానెల్‌కు ప్రధాన బాధ్యుడు… (MD అంటున్నారు) టాల్కమ్ పౌడర్‌కూ, టూత్ పౌడర్‌కూ తేడా తెలియదు… పైగా వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌కు సంబంధించిన సీరియస్ సబ్జెక్టు అది… ఎక్కడ ప్రేక్షకుడికి తన నాలెడ్జి అర్థమవుతుందో లేదో అనుకుని… పళ్లు తోముకున్నట్టు అభినయిస్తూ మరీ టాల్కమ్ పౌడర్ అంటే పళ్లు తోముకునేదే అని చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాడు… అదీ టీవీ డిబేట్లు నడిచే తీరు… మిగతా డిబేట్ హోస్టులు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో…!! నిన్నో మొన్నో ఎవరో సీనియర్ జర్నలిస్టు ఏదో పత్రికలో రాసినట్టు గుర్తుంది… ఏం..? అభినయాలు, ఉద్వేగాలు లేకుండా వార్తలు చప్పగా ఓ యంత్రంలా ఎలా చదువుతారు, అలాగైతే రోబోలతో చదివించడం మేలు కదా అని అభిప్రాయపడినట్టు గుర్తుంది… మరి ఈ రుధిరం, టాల్కమ్ పౌడర్ జ్ఞానాల గురించి ఏమంటారో…!!
Share this Article