Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకడిని మించి మరొకడు… ఒకరు నోరు మూస్తే మరొక నోరు బార్లా…

May 10, 2024 by M S R

ఒకరు కాకపోతే మరొకరు… వ్యంగ్యంగానో, వెటకారంగానో చెప్పాలంటే కాంగ్రెస్ క్యాంపులోని బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లు… ఎవరు..? ఒక శామ్ పిట్రోడా, ఒక అధీర్ రంజన్ చౌదరి, ఒక శశి ధరూర్, ఒక దిగ్గీ రాజా, ఒక మణిశంకర్ అయ్యర్… ఇలా చాలా మొహాలు…

ఏవో పిచ్చి కూతలు కూస్తారు, పార్టీని ఇరకాటంలో పడేస్తారు… పార్టీ పెద్దలు ఖండించలేక, సమర్థించలేక, వీళ్లను తన్ని తరిమేయలేక, పీకలేక అవస్థలు పడుతుంటారు… ఏదో అంకుల్ శామ్ లాంటోళ్లు తమంతట తామే రాజీనామాలు ఇచ్చి నిష్క్రమిస్తే తప్ప..!

మనం అంకుల్ శామ్ కూతల గురించి చదివాం… అధీర్ రంజన్ చౌదరి ప్రవచనాలు కూడా విన్నాం కదా… ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ అనబడే మరో మేధావి గురించీ చెప్పుకోవాలి… ఇవీ తాజా కూతలే కాబట్టి..!

Ads

‘‘పాకిస్థాన్ ఓ గౌరవనీయ దేశం, దాని దగ్గర అణుబాంబులున్నాయి, అందుకే చర్చలే పరిష్కారం, పదేళ్లుగా పాకిస్థాన్‌తో సత్సంబంధాల దిశలో ఇండియా చేసిందేమీ లేదు…’’ ఏప్రిల్ 15 నాటి ఇంటర్వ్యూ అట, తాజాగా వైరల్ అవుతోంది… ఇంకా ఏమంటాడంటే..?

‘‘మాట్లాడటం, చర్చించడం దిశలో గాకుండా ఓ గన్ను తీసుకుని దాని వైపు వెళ్తున్నాం మనం… అదీ ఓ సార్వభౌమ దేశం, గౌరవనీయ దేశం, దీంతో ఏమొస్తుంది, ఉద్రిక్తతలు పెరగడం తప్ప… ఎవరైనా పిచ్చోడు మన అణుబాంబును లాహోర్ మీద వేస్తే జస్ట్, ఎనిమిది ఘడియల్లో ఆ రేడియేషన్ అమృత్‌సర్ చేరుతుంది…’’

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో విలీనం కావల్సిందే అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై కాశ్మీర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాకు మస్తు కోపమొచ్చింది… వాళ్లేమీ చేతులకు గాజులు తొడుక్కుని కూర్చోలేదు, వాళ్లకూ అణుబాంబులున్నయ్, అవి మన మీద పడతాయి’’ అని భయపెడుతున్నాడు… మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వీటికి భిన్నంగా ఏమీ లేవు… వివాదాస్పద కూతలకు ఈ సారు వాడు గతంలోనూ ఫేమసే…

‘‘పాకిస్థాన్ దగ్గర అణుబాంబులుంటే, మన దగ్గర ఏమున్నాయి మరి..? దీపావళి పటాకులా..?’’ అని ఒకరిద్దరు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు గానీ… ఈ పాకిస్థానీ అనుకూల గొంతులేవీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మీద, ఇండియా భద్రత, సమగ్రత మీద విసురుతున్న సవాళ్ల మీద, చిమ్ముతున్న విషం మీద మాత్రం ఒక్క మాటా మాట్లాడిన పాపాన పోలేదు…

పాకిస్థాన్ ఎలాంటి ధూర్తదేశమో ప్రపంచం మొత్తానికి తెలుసు… ఉగ్రవాదానికి అది అడ్డా… అపరిమిత ద్వేషానికి, అనంతమైన విషానికి ఆయువుపట్టు… అలాంటి దేశం మీద ఈ మెచ్చుకోలు మాటలేమిటో… ఈ అపాత్ర ఔదార్యాలు, ప్రేమలేమిటో వాళ్లకే తెలియాలి… ఎవరో చెప్పినట్టు… కసబ్ వంటి ఉగ్రవాదులు చాలా బెటర్, స్ట్రెయిట్, వాళ్లది స్ట్రెయిట్ ఫైట్… ఎటొచ్చీ ఇదుగో ఈ ఫరూక్ అబ్దుల్లాలు, మణిశంకర్ అయ్యార్లే అసలు ప్రమాదం..! అబ్బే, మంచి చెబితే తిట్టిపోస్తారా అంటారా..? పిరికిమందు నూరిపోయడం వెనుక కూడా యాంటీ బీజేపీతనమే కనిపిస్తుంది కాబట్టి..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions