.
( పొట్లూరి పార్థసారథి ) …… టేబుల్ మారింది! వడ్డించే వాడు మారాడు అంతే! వంటలు మారలేదు! వండే వాడు మారాడు!
2014 వరకూ కాశ్మీర్ టేబుల్ మీద పాకిస్థాన్ మనకి వడ్డిస్తూ వచ్చింది! 2015 నుండి పాకిస్తాన్ టేబుల్ మీద మనం వడ్డీస్తున్నామ్!
Ads
BLA ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ మీద ఆత్మహతి దాడి చేసి 90 మంది సైనికులని హతమార్చింది!
మొత్తం 8 ప్రయాణీకుల బస్సులు ఒక దాని వెనుక ఒకటిగా టఫ్తాన్ ( Taftan) వైపుగా ప్రయాణిస్తున్న సమయంలో నోష్కి ( Noshki ) అనే ప్రాంతం దగ్గరికి వచ్చే సరికి రోడ్డు పక్కగా పార్క్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకువచ్చి పేలిపోయింది!
బస్సు లో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్స్ కి చెందిన సైనికులు మరణించారు! BLA చాలా పకడ్బందిగా ప్లాన్ వేసి దాడి చేసింది.
BLA లో రెండు విభాగాలు ఉన్నాయి. 1. మజీద్ బ్రిగెడ్, ఇది ఫిదాయి ( ఆత్మా హుతి) విభాగం. అవసరం అయినప్పుడు బాలూచిస్తాన్ కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండే యువకులతో ఉంటుంది. నిన్నటి దాడికి పాల్పడింది మజీద్ బ్రిగెడ్ సభ్యులే!
ఒక కారులో పేలుడు పదార్ధాలు నింపి బస్సు దగ్గరికి రాగానే నేరుగా బస్సుని గుద్ది పేలుడు పదార్ధం పేల్చేసి విధ్వంసం సృష్టించాడు ఆత్మాహుతి సభ్యుడు.
బస్సు పేలిపోగానే వెంటనే ఫతే స్క్వాడ్ ( Fateh Squad) సభ్యులు వెనుక వస్తున్న బస్సు మీద కాల్పులు జరిపి బస్సులో ఉన్న సైనికులు అందరిని చంపేశారు!
ఫతే స్క్వాడ్ చేతుల్లో M4 అసల్ట్ రైఫిల్స్ ఉన్నాయి! M4 అసాల్ట్ రైఫిల్స్ 2020 లో అమెరికా సైన్యం కాబూల్ ఎయిర్ బేస్ లో వదిలిపెట్టినవే! అమెరికన్ ఆర్మీ దాదాపుగా 6 వేల M4 అసాల్ట్ రైఫిల్స్, బులెట్స్ మ్యాగజైన్స్ తో సహా వదిలివెళ్ళింది.
So! ట్రంప్ మా ఆయుధాలు మాకిచ్చేయండి అని డిమాండ్ చేసింది నర్మగర్భంగా మేము చెప్పిన వాళ్లకి ఇవ్వండి అని అర్ధం చేసుకోవాలి!
నిన్నటి దాడిని పరిశీలిస్తే ఇరాక్ లో ISIS టెర్రరిస్టులు అమెరికన్ సైన్యం మీద చేసిన దాడులని గుర్తుకు తెస్తున్నాయి. ఉన్నట్లుండి ISIS టెర్రరిస్టులు చిన్న కారులో వచ్చి యుద్ధ టాంక్ ని గుద్ది పేల్చేవాళ్ళు వెంటనే మరో గ్రూపు వెనుక ఉన్న టాంక్ మీదకి గ్రనెడ్స్ తో దాడి చేసి, ముందు పేలుడుకి గురయిన టాంక్ కి సపోర్ట్ అందకుండా చేసి, చివరికి రెండు టాంక్ లని అందులో ఉన్న వాళ్ళని చంపేసేవారు. ముఖాముఖీ పోరులోకంటే చిన్న చిన్న గెరిల్లా ఫైట్స్ లలోనే ఎక్కువమంది అమెరికన్ సైనికులు చనిపోయారు!
నిన్నటి BLA దాడి కూడా ఇరాక్ లో జరిగిన దాడిలాగానే జరిగింది!
ఇంటెలిజెన్స్ లీక్ అవుతున్నది!
అసలు 8 బస్సులలో ఫ్రాంటియర్ ఫోర్స్ ( పారా మిలిటరీ ) ని టఫ్టాన్ కి ఎందుకు తరలిస్స్తున్నట్లు? తఫ్టాన్ అనేది పాకిస్థాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న పట్టణం.
BLA ని బాలూచిస్థాన్ నుండి ఇరాన్ బోర్డర్ వరకూ తరిమేసి, తఫ్టాన్ దగ్గర నుండి ఇరాన్ లోకి పారిపోకుండా అక్కడ సైనుకులు ముందే ఉంటారు కాబట్టి ముందుకు వెళ్లినా లేదా వెనక్కి వచ్చినా పాకిస్తాన్ సైన్యం చేతిలో BLA ఫైటర్లు చనిపోవాల్సిందే! అందుకే ముందుగా 500 మంది సైనికులని టఫ్తాన్ కి పంపించాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ సైన్యం. మిలిటరీ ట్రక్కులు అయితే తెలిసీపోతుంది కాబట్టి సాధారణ ప్రయాణీకుల బస్సులలో తరలించింది.
కానీ ఎవరో ప్లాన్ లీక్ చేశారు BLA కి. ప్లాన్ లీక్ అయ్యింది కాబట్టే హైవే మీద కాపుకాసి మరీ దాడి చేయగలిగింది BLA!
దాడి చేసిన దృశ్యాలని పాకిస్తాన్ లోని మీడియాకి తప్ప భారత్, మధ్య ప్రాచ్యంలోని మీడియా హౌస్ లకి వీడియోలతో వివరంగా దాడి ఘటనలని మెయిల్ చేసింది BLA!
ఇంటెలిజెన్స్ లో పనిచేసి రిటైర్ అయిన అధికారులు చేప్తున్నది ఏమిటంటే…. ప్రస్తుత BLA దాడులని చూస్తుంటే ఇరాక్ లోని పరిస్థితులని గుర్తుకుతెస్తున్నాయి. సద్దాం హుసేన్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఇరాక్ లో డాలర్ కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది కాదు.
అమెరికా ఇరాక్ మీద ఆంక్షలు విధించాక ఇరాక్ కరెన్సీ తన విలువ కోల్పోయింది. దాంతో వ్యాపార సంస్థలు డాలర్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇరాక్ లో డాలర్ కి డిమాండ్ పెరిగాక CIA కి డాలర్లు తీసుకొని సమాచారం ఇచ్చే వాళ్లు ఎక్కువయ్యారు.
ఒక దశలో ఇరాక్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వేల కొద్ది డాల్లర్లకి ఆశపడి కీలకమైన సమాచారాన్ని CIA కి అమ్ముకున్నారు. సద్దాం పతనానికి డాలర్ మీద ఉన్న ఆశ కూడా ప్రముఖ పాత్ర వహించింది.
ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి కూడా ఒకప్పటి ఇరాక్ పరిస్థితికి భిన్నంగా లేదు. ముఖ్యమైన ఆపరేషన్ సమాచారం రెండు రోజులముందే BLA కి దొరికి ఉండవచ్చు లేకపోతె ముందస్తు ఏర్పాట్లు చేసుకొని దాడి కోసం ఎదురు చూడరు!
హాండ్లర్ ( Handler) ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడని మాకు తెలుసు.. పాక్ సైనిక అధికారి వ్యాఖ్య!
హాండ్లర్ అంటే దాడికి పధక రచన చేసినవాడు. ముంబై దాడుల తరువాత భారత ఇంటెలిజెన్స్ అధికారి కూడా హాండ్లర్ లాహోర్ లో ( హఫీజ్ సయిద్) ఉన్నాడని మాకు తెలుసు అని వ్యాఖ్యానించాడు అప్పట్లో!
టేబుల్ మారింది అంతే!
అఫ్ కోర్స్! TTP ( Tehrik Taliban Pakistan) నాయకుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటూ BLA ఆపరేషన్స్ ని ఫాలో చేస్తున్నాడని పాక్ విదేశాంగ శాఖ ఆరోపణలు చేసింది. TTP, BLA లకి సహకారం ఇస్తున్నది RAW అని మాకు తెలుసు అని కూడా అన్నది!
రెండు నెలలలో మొత్తం 219 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తున్నది! BLA దాడులు ఇప్పట్లో ఆగేట్లుగా లేవు! ఈ రోజు ఉదయం క్వేట్టా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పాకిస్థాన్ అధికారి ( ISI?) ని గుర్తుతెలియని వ్యక్తి సమీపం నుండి కాల్చి పారిపోయాడు!
ఖైబర్ ఫక్ట్నూక్వా లో ప్రతీ రోజూ ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది! తాలిబాన్ల లక్ష్యం ముందు బోర్డర్ సైనిక పోస్ట్ ల దగ్గర ఎవరూ పనిచేయకుండా భయపెట్టడం! కనుక అక్కడ రోజూ ఏదో ఒక హత్య జరగడం పరిపాటి అయ్యింది!
మరోవైపు పాకిస్తాన్ ని కనుక పూర్తి షరియా దేశంగా మార్చకపోతే ప్రభుత్వ అధికారులని చంపేస్తాం అని బెదిరిస్తున్నది ISIS- K సంస్థ ( K అంటే KHEROSAN). ISIS- K ఇటు తాలిబాన్ల కి కూడా ప్రధాన శత్రువు! నిజం ఎంతవరకో తెలీదు కానీ ISIS-K అనే ఉగ్ర సంస్థ CIA కంట్రోల్ లో ఉన్నది అంటారు!
Share this Article