దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు అర్జెంటుగా పౌరసత్వం ఇవ్వాలనే సోకాల్డ్ లౌకిక పార్టీలు ఈరోజు బీజేపీ అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం అంగీకరించట… అది మత విభజన చట్టమట… మమతలు, స్టాలిన్‌లు, పినరై విజయన్‌లు మా రాష్ట్రాల్లో మేం అమలు చేయబోం అని చెబుతుంటాయి… ఆ పార్టీల లౌకిక తత్వానికి నిర్వచనాలు వేరు కదా…
అంతెందుకు..? చట్టం చేసినప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లకు దిగాయి ఈ శక్తులు… సోకాల్డ్ మేధావులు కూడా ఆ చట్టంతో ఆదివాసీలకు పౌరసత్వం లేకుండా చేస్తారంటూ గాయిగత్తర లేపే ప్రయత్నం చేశారు… ఈ చట్టంతో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి మత వేధింపులతో బతుకుజీవుడా అని పారిపోయి వచ్చే అక్కడి మైనారిటీలకు భారతీయ పౌరసత్వం ఇవ్వడం… సరే, దీనిపై బోలెడంత చర్చ ఇప్పటికే జరిగింది, కానీ ఇదేరోజు మరో కీలక పరిణాం… అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం…
ఇస్రో ఫలానా రాకెట్ పంపించింది అంటూ ప్రతిసారీ ఆహా ఓహో అని రాసుకుంటాం కదా… నిజానికి దానికి రాకెట్ ప్రయోగాలు ఇప్పుడు చాలా అలవాటైన రొటీన్ ప్రక్రియ… నిజానికి ఈ అగ్ని-5 విశేషాలేమిటి..? దీన్ని దివ్యాస్త్ర అని ఎందుకంటున్నాం..?
Ads
మన దేశం అగ్ని పేరిట ఏనాటి నుంచో క్షిపణులను డెవలప్ చేస్తోంది… 2002 నుంచే 700 కిలోమీటర్ల పరిధితో… అది పెరిగీ పెరిగీ ఇప్పుడు అధికారికంగానే 5 వేల కిలోమీటర్ల వరకూ దాడి చేయగల అగ్ని-5 దాకా వచ్చాం… ఈ క్షిపణుల విశేషాలు ఇంకా ఉన్నయ్… ఇది MIRV… అంటే Multiple independently targetable reentry vehicle… ఒకేసారి ఎక్కువ అణుబాంబులను మోసుకెళ్లి, వేర్వేరు చోట్ల జారవిడిచే సామర్థ్యం ఉన్న అత్యాధునిక క్షిపణి ఇది… ఆర్బిట్‌లోకి వెళ్లి, భూకక్ష్యలోకి రీఎంట్రీ ఇచ్చి మరీ టార్గెట్లను ఛేదిస్తాయి…
అధికారికంగా 5 వేల కిలోమీటర్లు అని చెప్పడమే గానీ అసలు పరిధి 8 నుంచి 10 వేల కిలోమీటర్లుగా రక్షణ నిపుణులు చెబుతారు… అంటే చైనాలోని షాంఘై, బీజింగ్ సహా అన్ని ప్రధాన నగరాలూ ఇప్పుడు మన అణుదాడి పరిధిలోకి వచ్చేసినట్టే..! పాకిస్థాన్ వంటి తుప్పాస్ శత్రువుని వదిలేయండి… అది ఆ ఉత్తర కొరియా నుంచి తెచ్చుకున్న తుప్పు క్షిపణులనే నమ్ముకుంది… కానీ చైనా వేరు… అది మనకన్నా అడ్వాన్స్‌డ్… చైనా వద్ద ఉన్న Dongfeng 41 (CSS-20) రకం క్షిపణులు ఏకంగా 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దాకా పరిధి కలిగినవి…
సో, మనం ఈ దివ్యాస్త్రంతో ఆగడం లేదు… అగ్ని-6 పరీక్షలు సాగుతున్నయ్, అవీ సక్సెసయితే చైనాతో ఈక్వల్ అవుతాం… అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు మనకన్నా క్షిపణి పరిజ్ఙానంలో ముందున్నాయి… ఇవీ మన క్షిపణి రకాలు…
1. Surface-to-Air Missiles (SAM)
2. Air-to-Air Missiles (AAM)
3. Surface-to-Surface Missiles
4. Ballistic Missile Defence (BMD)/Interceptor Missiles
5. Cruise Missiles
6. Submarine Launched Ballistic Missiles
7. Anti-Tank Missiles
ఇవి గాకుండా హైపర్‌సోనిక్, సూపర్‌సోనిక్ క్రూయజ్ క్షిపణులు బ్రహ్మోస్ సరేసరి… ఇవి గాకుండా నాగ్, ఆకాశ్, త్రిశూల్, నిర్భయ్, అమోఘ వంటి అనేక క్షిపణులు… అవసరాలను బట్టి, పరిధిని బట్టి వేర్వేరు… మనం సొంతంగా ఎయిర్ డిఫెన్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నాం… ఇవన్నీ సక్సెసై, ప్రయోగాలకు సిద్ధమయ్యే దశకు చేరితే… రక్షణ కోణంలో దేశానికి అమితమైన భరోసా..!! అన్నట్టు అగ్ని-5 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ తయారీ..!!
Share this Article