Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పైసలా, పెంకాసులా… వరల్డ్ ఫోర్త్ రిచ్చెస్ట్ యాక్టర్ ఆస్తి ఇన్నివేల కోట్లా..?

January 22, 2023 by M S R

అమితాబ్ కుటుంబంలో ముగ్గురు సంపాదిస్తున్నారు… సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు… నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ దరిదాపుల్లోకి కూడా రారు… హాలీవుడ్  నటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు, ఎండార్స్‌మెంట్ డబ్బులు అడ్డగోలు… ఐనా సరే, నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ వాళ్లను కూడా దాటేసిపోయాడు… ప్రస్తుతం షారూక్ పొజిషన్ ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా నాలుగో అత్యంత ధనిక నటుడు…

పఠాన్ సినిమాను బ్యాన్ చేస్తారా..? చేసుకొండి… కొడుకు ఆర్యన్ ఖాన్ మరింతగా డ్రగ్ కేసుల్లో ఇరుక్కుంటాడా..? నో ప్రాబ్లం… ఇవన్నీ పట్టించుకోనంతగా… లైట్ తీసుకునేంతగా ఆస్తుల్లో, సంపాదనల్లో పెరిగిపోయాడు షారూక్ ఖాన్… ఇప్పటిదాకా బోలెడు వార్తలు కనిపించేవి… తన విలాసవంతమైన నివాసభవనం (మన్నత్), లావిష్ జీవనశైలి, ఖరీదైన కార్లు ఎట్సెట్రా…

ఇప్పుడు తన ఆస్తిని 770 మిలియన్ డాలర్లు అట… అంటే సుమారు 6,235 కోట్లు… ఒక నటుడి ఆస్తి ఈమేరకు పెరిగిపోయిందంటే ఆశ్చర్యమే… ఐపీఎల్ వ్యవహారాలు, పలు ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ఈడీ కూడా కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు గుర్తు… అవన్నీ దూదిపింజెల్లా తేలిపోయి, ఏయేటికాయేడు తన ఆస్తిని ఇంకా పెంచుకుంటూ పోయాడు… ఇప్పుడు సినిమాలే తనకు డబ్బు సంపాదించి పెట్టాల్సిన పనిలేదు… తన ఆస్తులు, తన డబ్బే డబ్బును సంపాదించి పెడుతుంటాయి… అంతటి విలువైన ఆస్తులున్నాయి తనకు…

Ads

srk

ఒకసారి ప్రపంచంలోని రిచ్చెస్ట్ యాక్టర్స్ జాబితా చూస్తారా… ఇదుగో…

RICHEST ACTORS IN THE WORLD:

🇺🇸 JERRY SEINFELD: $1 BILLION
🇺🇸 TYLER PERRY: $1 BILLION
🇺🇸 DWAYNE JOHNSON: $800 MILLION
🇮🇳 SHAH RUKH KHAN: $770 MILLION
🇺🇸 TOM CRUISE: $620 MILLION
🇭🇰 JACKIE CHAN: $520 MILLION
🇺🇸 GEORGE CLOONEY: $500 MILLION
🇺🇸 ROBERT DE NIRO: $500 MILLION

— WORLD OF STATISTICS (@STATS_FEED) JANUARY 8, 2023

జెర్రీ సీన్‌ఫెల్డ్ ఒక అమెరికన్ కమెడియన్, టీవీ ప్రొడ్యూసర్, యాక్టర్… తన ఆస్తుల విలువ అక్షరాలా 8 వేల కోట్లు… తరువాత స్థానంలో ఉన్న టైలర్ పెర్రీ ఆస్తులు కూడా దాదాపు సేమ్… తను అమెరికన్ ఫిలిమ్ మేకర్, యాక్టర్, సాంగ్ రైటర్, స్టోరీ రైటర్ ఎట్సెట్రా… మాజీ రెజ్లర్, ప్రస్తుత నటుడు డ్వయిన్ జాన్సన్ ఆస్తి దాదాపు 6,400 కోట్లు…

నాలుగో ప్లేస్ మన షారూక్‌ది… చెప్పేసుకున్నాం… మొన్నమొన్నటిదాకా టామ్ క్రూయిజ్ షారూక్‌కన్నా బెటర్ ప్లేసులో ఉండేవాడు… తన ఆస్తి 5000 కోట్లు… తనను ప్రస్తుతం షారూక్ దాటేశాడు… నిజానికి టామ్ ప్రపంచంలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్… ఐతేనేం, షారూక్ తన ప్లేసును కొట్టేశాడు… ఈ ఎనిమిది మంది అత్యంత ధనిక నటుల జాబితాలో షారూక్, ఆరో స్థానంలో ఉన్న జాకీ చాన్ మాత్రం నాన్- అమెరికన్స్… మన తెలుగు హీరోల్లో ఎవరైనా వీళ్ల దరిదాపుల్లోకి వెళ్లేంత సీన్ ఉందా..? ఒక్కసారి అలా అలా పేర్లను, మొహాల్ని తిరగేయండి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions