Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యశోద, శబరి… ఏ పాత్రకైనా ఎవర్ రెడీ… ఇప్పుడు చేతిలో 8 సినిమాలు…!

September 27, 2022 by M S R

ఆమె పెద్ద అందగత్తెనా..? కాదు… ఇతర హీరోయిన్లతో పోలిస్తే అంతంతమాత్రమే… ఒబేస్ అనిపించదు గానీ, కాస్త పుష్టిగా కనిపిస్తుంది… జీరో సైజులు ఆమె దగ్గర చెల్లవు… పోనీ, డాన్సులు, ఆరబోతలకు ప్రయారిటీయా..? అసలే లేదు… తను రెడీ, కొన్ని సినిమాల్లో బోల్డ్‌గా చేసింది, కానీ మరీ అతిగా, అంతగా చేసే సీన్ కూడా ఏమీ లేదు… అసలే శరత్‌కుమార్ బిడ్డ… ఆపై ఈమె టెంపర్‌మెంట్ కూడా తక్కువేమీ కాదు, ఎక్స్‌పోజింగ్ అడిగే సాహసం ఎవరూ చేయరు… ఆమెకు నప్పదు కూడా… యంగ్ చార్మింగా..? కాదు, ఇప్పటికే 37 ఏళ్ల వయస్సు… వెటరన్ త్రిష వయస్సుకు ఏడాదో రెండేళ్లో తేడా… ఆంటీ..!

గొప్ప నటి అనుకోవచ్చా..? తన పాత్రకు అవసరమైనంతమేరకు ప్రయాసపడుతుంది… అంత గొప్పగా పేరు తెచ్చిపెట్టిన పాత్రలు కూడా ఏమీ లేవు… అవార్డులు గట్రా బాగా సంపాదించేసిందా..? అవీ తక్కువే… వాటిపై ధ్యాసా తక్కువే… మరెందుకు ఆమె గురించి చెప్పుకోవడం..? ఎవరామె..? ఆమె పేరు వరలక్ష్మి… తన పేరు పాత చింతకాయ అనేమీ తనకు తాను కించపడలేదు ఆమె… కొత్త పేరేమీ తగిలించుకోలేదు… అదే పేరు… మొదట్లో శరత్‌కుమార్ ఆమె సినీరంగప్రవేశాన్ని పెద్దగా ఇష్టపడలేదు… కానీ తరువాత తప్పలేదు…

పదేళ్లు గడిచిపోయాయి… ఆమె ఎంట్రీకి శరత్‌కుమార్ బిడ్డ అనే కార్డు పనిచేసిందేమో గానీ, తరువాత ఆమే నిలబడింది… ఎంతగా అంటే..? ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలున్నయ్… నిజం… అసలు ఒక్కొక్కరు ఒక్కో చాన్స్ కోసం నానా గడ్డీ కరుస్తున్న రోజులివి… అలాంటిది ఈ వయస్సులో, ఈ సాదాసీదా సొగసుతో భలే శాసిస్తోంది ఆమె… సాధారణంగా వారస హీరోలు క్లిక్ అవుతారేమో కష్టమ్మీద… కానీ వారస హీరోయిన్లు చాలా చాలా తక్కువ… అసలు ఇండస్ట్రీలో తెర మీదకే రానివ్వరు… అలాంటిది వరలక్ష్మిది చెప్పుకోదగిన కథే…

Ads

varalaxmi

లీడ్ రోల్ మాత్రమే కావాలనేమీ లేదు… చిన్న రోల్ అయినా సరే, రెడీ… తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఏ భాషయినా సరే… చిన్న హీరోనా..? పెద్ద హీరోనా..? డోన్ట్ కేర్… ఎవరైనా సరే… అసలు హీరో పక్కన చేయాలని కూడా ఏమీలేదు… కాస్త చెప్పుకోదగిన పాత్ర అయినా సరే… పోనీ, ప్రధాన హీరోయిన్ వేరే ఉంటారు, సెకండ్ హీరోయిన్‌గా చేస్తుందా..? ఎస్… ఏమాత్రం అభ్యంతరం లేదు తనకు… పని, పని, పని… అందుకే అంతటి కరోనా సంక్షోభంలో కూడా ఆమె సినిమా చాన్సులకు మాత్రం ఢోకా లేదు…

varalakshmi

యశోద చేస్తోంది… అసలు హీరోయిన్ సమంత… అందులో వరలక్ష్మి ఉంది… శబరి అని ఓ సినిమా చేస్తోంది… దాదాపు లేడీ ఓరియెంటెడ్… ఈమే లీడ్ రోల్… పంబన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది… పిరంతై పరాశక్తి,, కలర్స్, లగామ్, హను మాన్‌తోపాటు ఓ బాలయ్య సినిమా కూడా… దశ నడుస్తోంది… ఈ ఎనిమిదిలో తమిళ, కన్నడ, తెలుగు సినిమాలున్నయ్జ… కొన్ని హిందీ, మలయాళంలోకి డబ్ కాబోతున్నయ్… కొన్నాళ్లు విశాల్‌తో లవ్ ట్రాక్ మీద వార్తలొచ్చేవి… కానీ ఏమైందో ఏమో… తాను అసలు జీవితంలో పెళ్లే చేసుకోను అని ప్రకటించింది… పూర్తిగా సినిమాలే జీవితం… ఇంట్రస్టింగు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!
  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
  • ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
  • అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
  • పోలీసులది క్రౌర్యమే, తప్పే… మరి రౌడీ షీటర్లకు రాజకీయ ఓదార్పు..!?
  • ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions