Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో మారువేషం అంటేనే అది… ప్రేక్షకులు తప్ప ఎవరూ గుర్తుపట్టరు…

May 9, 2024 by M S R

Subramanyam Dogiparthi….    రైతుల కష్టాల మీద , కార్మికుల కష్టాల మీద , పేదల పాట్ల మీద సినిమాలు వచ్చే ఒకనాటి రోజుల్లో వచ్చిన సినిమాలు ఇవి . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన రైతుబిడ్డ సినిమాలో NTR , వాణిశ్రీలు జంటగా నటించారు . వంద రోజులు ఆడింది . ఇలాంటి కధాంశంతో మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి . ANR అర్ధాంగి , కృష్ణ పాడిపంటలు వగైరా . ఈ 1971 సినిమా గురించి చెప్పుకునే ముందు 1939 లో వచ్చిన రైతుబిడ్డ గురించి చెప్పుకుందాం .

ఈ 1939 సినిమా ఓ పెద్ద సంచలనాత్మక సినిమా . జమీందార్ల దౌష్ట్యాలను ఎత్తిచూపిస్తూ , సన్నకారు రైతుల కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపిన ఈ సినిమాను తీసింది ఓ జమీందారే . చల్లపల్లి జమీందారు యార్లగడ్డ శివరాం ప్రసాద్ . మాలపిల్ల వంటి సామాజిక ప్రయోజనం కలిగిన సినిమాకు దర్శకత్వం వహించిన గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకు దర్శకులు . ఈ సినిమాను వ్యతిరేకించిన వెంకటగిరి , బొబ్బిలి మహారాజులు ప్రింట్లను కూడా తగలబెట్టించారట . కొన్ని జిల్లాలలో ప్రదర్శనను కూడా నిషేధించారట , ప్రభుత్వం చేత నిషేధింపచేసారట .

తెలుగు సినిమా రంగంలో నిషేధింపబడిన మొదటి సినిమా 1939 లో వచ్చిన ఈ రైతుబిడ్డ సినిమాయే . ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . బళ్ళారి రాఘవ , టంగుటూరి సూర్యకుమారి , ప్రముఖ దర్శకులు వేదాంతం రాఘవయ్య , ప్రముఖ రచయిత కొసరాజు వంటి హేమామేమీలు నటించారు .

ఇంక 1971 సినిమాకు వద్దాం . కలర్ సినిమాలు క్రమక్రమంగా తెలుగు సినిమా రంగాన్ని ఆక్రమించుకుంటున్న కాలంలో బ్లాక్ & వైట్ లో వచ్చినా NTR సినిమా కాబట్టి వంద రోజులు ఆడింది . యస్ రాజేశ్వరరావు అన్న యస్ హనుమంతరావు సంగీత దర్శకత్వంలో పాటలు కొన్ని హిట్టయ్యాయి . మనిషిని నమ్మితే ఏముందిరా అని రాజనాల పాడే పాట బాగా హిట్టయింది . అలాగే దేవుడు సృష్టించాడు లోకాలు , ఓ విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి , అ అమ్మ ఆ ఆవు అనే పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

ప్రత్యేకంగా చెప్పుకోవలసింది NTR ఆడా మగా కలిపి పగటి వేషం . అంతకన్నా రుక్మిణీ కల్యాణం అనే కూచిపూడి తరహా గాన నృత్యం . NTR ఉంటే మారువేషాలు లేకుండా ఎలా ? ఆడియన్స్ ఒప్పుకోరు . ఈ సినిమాలో కూడా మారు వేషాలు మస్తుగున్నాయి . ప్రేక్షకులు తప్ప తమ్ముడు , తల్లి , ప్రియురాలు , విలనూ ఎవ్వరూ గుర్తుపట్టరు . అదీ సినిమా అంటే .

వాణిశ్రీకి నటించేందుకు గొప్ప అవకాశం లేని సినిమా . జగ్గయ్య , శాంతకుమారి , సత్యనారాయణ , రాజనాల , రాజబాబు , ప్రసన్నరాణి , అల్లు రామలింగయ్య , ఛాయాదేవి , శ్రీధర్ , అనూరాధ ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలోనే కాలేజీ రోజుల్లో చూసా . టివిలో కూడా . యూట్యూబులో ఉంది . NTR అభిమానులకు నచ్చుతుంది . దురదృష్టం ఏమిటంటే 1939 సినిమా యూట్యూబులో లేదు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions